కాళీ పదములు                              

 

-పాలపర్తి ఇంద్రాణి

1.

ధూళి ధూసరితమైన 

భూమి పైన్నుంచి లేచి

హంసలా మబ్బులలో 

ఎగురుతున్నాను

సాటి రాయంచల 

హొయలు చూచి 

మైమరచానో

మోహించానో

ఆ వేల అడుగుల 

ఎత్తునుంచి

జారి పడబోయాను 

అమ్మా,అమ్మా,

అమ్మా,అమ్మా!

అద్భుతమాశ్చర్యమానందం! 

మూడు హస్తాలు 

నిలువరించాయి నన్ను

నువ్వు పంపిన

పరమ గురువులు

ముగ్గురు

పక్షి పాదాల వారు

కాంతి కమండలాల వారు

గాలి బిరడాల వారు

తోవ చూపుతున్నారు

అమ్మా, చూడిదిగో,

ఎగురుతూ ఉన్నాను

ఏ రంగూ లేని 

అతీత లోకాల్లోకి,

వెలుగు బిలాల్లోకి.

2.

మన స్నేహం ముగిసిపోయాక,

తల పైని మబ్బులు చెదిరి పోయాయి 

రొద పెట్టే కందిరీగ పారిపోయింది

చిటుకు చిటుకుమని కుట్టే ఎర్ర చీమ చచ్చిపోయింది

కళ్ళు తుడుచుకుని 

ఖాళీ మనసుతో

గడ్డి వాముల మలుపు తిరగ్గానే

నన్ను వదలి వెళ్ళిన అమ్మ తిరిగి 

మందార మాలతో ఎదురొచ్చింది

అమ్మ చిటికె వేయగానే

చిటారు కొమ్మన మిఠాయి పొట్లం

దోసిలిలోకి వచ్చి పడింది

పొట్లం విప్పితే 

ఓహ్‌,కలకల నవ్వులు 

నావే!

కొన్ని కనికట్టు పువ్వులూ.

*****

Please follow and like us:

One thought on “కాళీ పదములు       ”

  1. Indranigari poem baagundi.good imagenary oriented poem.abhivyakti navyata adhunika vachana kavitalu alankaaram.pesinification poetry to Ismail oka gurtimpu techukunnadu.nedu palakurtilanti young poets adbhutamaina poetic-diction poems rastunte kavitvam-diction (kavitaa nirmanam paddatulapai authentic book veluvarinana)naaku ento santosamestondu.poetic deviceslo allegory,syllogism,metonomy,objective correlative,apostrophe,parallelism lanti kavitaa nirmana paddatulu telusukoni sarikotta dictionto poems raste baaguntundi.all the best.

Leave a Reply

Your email address will not be published.