చిత్రం-7
-గణేశ్వరరావు
కొందరు గొప్ప వారు తమ జీవితకాలం లో కీర్తి ప్రతిష్ట లను అనుభవించ కుండానే పోతుంటారు, విన్సెoట్ వాంగో తను గీసిన ఒకే ఒక బొమ్మని అమ్ముకో గలిగేడు. మరి కొందరి విషయం లో అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది, ఫ్రాన్స్ చిత్రకారిణి ఎలిజబెత్ వీజీ ల బ్ర న్ గీసిన 900 చిత్రాలన్నీ ఆమ్ముడయాయి – అదీ ఆమె జీవించిన 18వ శతాబ్దంల, స్త్రీలకి విద్యా సంస్థలలో, శిక్షణాతరగతుల్లో ప్రవేశమే దొరకని రోజులలో.
ఆమె అద్భుత చిత్ర కారి ణి, తన అందాన్ని చూసుకుని తానే మురిసి పోతూ స్వీయ చిత్రాలను గీసే ది, ప్రకృతి దృశ్యాల ని ఎంతో సహజత్వం ఉట్టి పడేలా చిత్రించేది. తన ఏడవ ఏట స్కూల్ లో గోడ లని బొమ్మలతో నింపేది, తండ్రి ఆమెని కొపగించకుండా, ప్రోత్సహించి మెచ్చుకుని ఆకాశానికి ఎత్తే యటం తో, ఆమె సృజనాత్మక శక్తి రెక్కలు విప్పుకుంది, తండ్రీ ఆమె 13వ ఏట చనిపోయాడు, ఆమె తల్లి కూతురి దుఃఖాన్ని మరపించండం కోసం ఆమెని చిత్ర కళా ప్రదర్శనలకి తీసు కె ళ్ళే ది, రూ బె న్ కళ ఆమెని ప్రభావితం చేసింది. యూరప్ రాజులు రాణీ లు ఆమె చేత తమ స్వీయ చిత్రాలు వేయించు కోటా నికి పోటీ పడే వారు. ఫ్రాన్స్ లో విప్లవం వచ్చిన సమయం లో ఆమె ప్రవాసం లోకి వెళ్ళినా, ఆమె చిత్రాలకి గిరాకీ తగ్గ లేదు. అవి జీవం తో తొణీ కి స లా డు తూ ఉంటాయి.
*****