జ్ఞాపకాలసందడి-5
-డి.కామేశ్వరి
మొన్న ఎవరో శేఖాహారంలో ప్రోటీన్ వుండే వంటలు చెప్పామన్నారు. మనం తినే వంటల్లో పప్పుదినుసుల్లో చేసే అన్నిటిలో ప్రోటీన్స్ వున్నవే. పప్పు లేకుండా సాధారణంగా వంటవండుకోము. కందిపప్పు, పెసరపప్పు రెగ్యులర్ వాడతాము. పాలకపప్పు, గోంగూర, తోటకూరపప్పు, మామిడికాయ, దోసకాయ, టమోటా పప్పు వీటన్నిటిలో ఈ. రెండుపప్పులుతో విధిగా ప్రతి ఇంట పప్పు చెస్తాం.
శేఖాహరులం, ముద్దపప్పు సరేసరి, ఇదికాక, ఆనపకాయ, పోట్ల, అరటి, బీర అన్నిటిలో పెసరపప్పు, సెనగపప్పు కానీ వేసి చేస్తాం. సాంబారులో పప్పు కందిపచ్చడి, పెసరపచ్చడి, కందిపొడి ఇవన్నిటిలో పప్పుల్లో ప్రోటీన్స్ ఉంటాయి, అంచేత మాంసంలోనే ప్రోటీన్స్ వుంటాయని, శేఖాహారులకి అంతగా ప్రోటీన్స్ అందవని అనుకోనక్కరలేదు.
ఇడ్లి, దోశె, వడ, పెసరట్టు టిఫిన్స్ అన్నిటిలో పప్పులేగదా. ఇంకా చిన్నప్పటి నించి పిల్లలకి రోజు ఒక వేరుశెనగబెల్లం ఉండ, నువ్వులవుండ, కొబ్బరి ఉండ, మినపసున్నివుండ లాటివి, స్కూల్ నించి రాగానే గ్లాసుపాలు, ఒక ఈ ఉండ, ఒక అరటిపండు పెడితే చాలు.
కుర్కురేలు, చిప్స్, నూడిల్స్, పాస్తాలు ప్యాకెట్లలో దొరికే చెత్త అలవాటు చేయకుండా వుండేపిల్లలకి కావలసిన పోషకాలు అందుతాయి. ఈ నాటి తల్లులకు టైం లేక పిల్లలకి డబ్బులు ఇస్తే తల్లితండ్రులు ఇంటికివచ్చేలోగా ఇవన్నీ కొనితినడం చూస్తూనేవుంట.
వేరుశెనగ ఉండలు చేసేతీరిక లేకపోతె పొట్టుతీసిన పప్పుకొని డబ్బాలోపెట్టి తినమనండి, అందులో కొన్నిబెల్లంముక్కలు పడేసి తినేయాలవాటు చేయాలి. అలాగే రోజు ఉదయం పాలతో నలుగయిదు బాదంపప్పులు పెట్టండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిస్తాలాటివి జీడిపప్పు కొన్ని జేబులోవేసి తినమనండి డబ్బులుఇవ్వడమనే అలవాటు మనిపించి ఇలాటివి తినే అలవాటు చేస్తే ప్రొటీన్స్కి లోటుండదు.
పిల్లలేకాదు ఆడామగా ఇళ్ళకి రాగానే ఇలాటి ఉండలు ఖర్జురమ్ అరటిపండు లాటివి తింటే అలసట, నీరసం తగ్గుతుంది. పిస్తా, బాదాం, జీడిపప్పు అన్ని బోలెడు ఖరీదుఅనద్దు, పాకెట్ చిప్స్, కుర్కురేలు, కూల్డ్రింక్స్ నెలాఖర్చుతో నెలమొదట్లో, ఇవన్నీ కొంటె వాటికంటే చవకే. పోనీ అవికాకపోతే, వేసెనగప్పులు, ఖర్జురామ్, ఎండుకొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు కొనగలరుకదా, పెద్దాచిన్నా అవితిని ఆరోగ్యాలు కాపాడుకోండి.
నేను ఈ వయసులోను రోజు కాస్త పిస్తా, వేరుశెనగపప్పు విత్ బెల్లం, ఖర్జురామ్, అరటిపండు కంప్యూల్సరిగ తింటా. అంచేత మన పెద్దలు అన్నిరకాల పోషకాలుండేటట్టే వంటలు చేసే వారు అవి పాటిస్తే చాలుబయట తిళ్ళు తగ్గించి.
*****