జ్ఞాపకాల సందడి-6

-డి.కామేశ్వరి 

“క్రూరకర్మములు  నేరక చేసితి “ తెలియక చేసిన పాపాలు , తెలిసిచేసిన పాపాలు (బొద్దింకలు , ఎలకలు, ఈగలు, దోమలు  వగైరా ) వాటి బాధ భరించలేక తప్పక చంపడం, చిన్నప్పుడు తెలియక తల్లినించి కుక్కపిల్లలని, పిల్లిపిల్లలని  దాచి వినోదించడం, బోనులో ఉడతలని పట్టుకుని వినోదించడం కాలికింద మనకు తెలియకుండా చీమలలాటివి చచ్చిపోవడం  ఇవన్నీ తెలియక చేసిన పాపాలు.  ఇవన్నీ అందరు చేసేవే.

మరి మాంసాహారులు  జంతువులని చంపి తినడం పాపంకిందకివస్తుందా?  అది పెద్ద ప్రశ్న నాకెప్పుడూ. మరితెలిసి క్రూరంగా చేసినపాపాలు నాకయితే  చేసిన గుర్తు లేదు. సరే చిన్నోపెద్దో చేసినవి కడుక్కుందామని, పుణ్యం మూటకట్టుకుని స్వర్గద్వారాలు తెరిపించుకునే  ప్రయత్నాలు మొదలెట్టా కొన్నేళ్ళనించి, దానం ధర్మం, ఉన్నంతలో అనాధాశ్రమాలు, వృధాశ్రమాలకి డబ్బులు అన్నదానాలు చేస్తూ ఆ క్రమంలో  పాపం ఎండాకాలం పావురాలు నోరెండిపోయి నీటికోసం అల్లాడుతాయని నీళ్లు పెట్టడం ఆరంభించ. ఉట్టి నీళ్లు ఏమిటి నాలుగు బియ్యం గింజలు పెడదాం అనిపించి బియ్యపు నూకలు పెట్టడం ఆరభించ.

హిమాయత్నగర్లో  ఉన్నప్పుడు గుజరాతీ, మార్వాడి లందరు డాబామీద పోసిపెడుతుంటే అవి బిల్డింగ్ పట్టుకు వదలకుండా రెట్టలేసీ తగలేస్తున్నాయని తెల్లారకుండా కువ కువ గోల డాబామీదకెళ్ళడానికి బద్దకకం వేసి వరండాల్లోవేసేవాళ్ళు  వాళ్లందరితో buiding తగలేస్తున్నారని దెబ్బలాడేదాన్ని ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్ లాటి పోస్ట్లు చేసి హోల్డ్ సంపాదించ గదా! అలాటి నేను ఇక్కడికి వచ్చాక వేలపావురాలు బిల్డింగ్ లో చూసి వాటిని తరమడం  ఎవరి తరం కాదు కనక, ఈ లోగ పాపాన్ని తరిమికొట్టే ప్రయత్నంలోపడ్డ నేను గింజలు వేద్దామంటే చోటే కనపడలేదు. పదంతస్తుల బిల్డింగ్ టెర్రస్ తలుపులు తీయరు అని ఆలోచిస్తే విండో ఏసీ మీద వేస్తె అనిపించి katori బియ్యం నీళ్లు పెట్ట అంతే ఎక్కడనించి  చూశాయి గుంపులు వచ్చి ఊదేసాయి. అవి తిని నీళ్లు తాగి పోతే అపుడు ఎదో మంచి పనిచేసానన్న తృప్తి వచ్చేసింది. నాలుగయిదు నెలలుగా అలవాటయి అవి ఇంకా పెట్టవేం అని డిమాండ్ చేసే స్టేజికి వచ్చాయి.

తెల్లారి ఆరుగంటలకి బద్ధకంగ కాస్త దొర్లుతుంటే  లే ఇంకా పడుకున్నది చాలు అన్నట్టు విండో గ్రిల్ లోపలికి తొంగిచూస్తూ పిలుస్తాయి. రోజు లేచి పాలు స్టవ్ మీద పడేసి బాత్రూమ్లో దూరి వచ్చి యోగ మొదలెట్టే ముందు వాటికి వేసేదాన్ని, ఇపుడు వాటిగోల భరించలేక ముందే వేసేస్తున్న. అందులో తెల్లముక్కు పావురం. ఇదేదో దాని సొంతం ఇంకెవరు తినకూదన్నట్టు ముక్కుతో పొడుస్తూ తరుముతుంటుంది, మిగతావి పాపం సందుచూసుకు కాస్తదూరి భయంగా తింటుంటాయి.

ఇదిచూసి చూసి ఒక అరుపు అరిచా “ఏయ్, అందరిని తిననీ నీకేకాదు అన్ని తినాలి” అని గట్టిగ అనగానే తలెత్తి నావైపు చూసి కాసేపు ఊరుకుని మళ్ళి మొదలు పెట్టింది అరిస్తే మళ్ళి కాసేపు ఊరుకోవడం  ఇలా నాలుగు రోజులు యోగ పావుగంట పోస్టుపోన్ చేసి కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుంటే అదిపొడవడం, నేనరవడం చూసి ఇంక మానింది. ఈలోగా వెర్రిగాలికి నీళ్లు పెట్టిన ప్లాస్టిక్ బౌల్స్ ఎగిరికింద పడిపోతుంటే వెళ్లి బరువయిన మట్టి పాత్రతెచ్చా బజారునించి.

ఇపుడు కాస్త ఆలస్యం అయితే లేపుతాయి, అవి వెంటనే వచ్చి తినకపోతే  నాకు తోచదు, అందుకే ఇచ్చుటలో ఆనందం స్వంతంగా గ్రహిస్తే దానం ధర్మం అన్నది ఒక యోగం అనిపిస్తుంది. పుణ్యం సంగతి దేముడెరుగు పావురాలతో జతకుదిరింది పావుగంట పక్షిభాష (వాటి హావభావాలతో ఎంతచక్కగా మాట్లాడుకుంటున్నామో) అలవాటయింది. మంచయినా చెడయినా అలవాటు పడితే మనలేంగదా!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.