నారీ”మణులు”
మేరీ క్యూరీ
-కిరణ్ ప్రభ
మేరీ క్యూరీ( Maria Salomea Skłodowska Curie) (నవంబర్ 7, 1867 – జూలై 4, 1934) సుప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సోర్‌బోన్‌లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలండ్‌లో జన్మించి తరువాత ఫ్రెంచి పౌరసత్వం తీసుకొన్న ఈమెకు రెండు దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది. ఈమె భర్త, సహ పరిశోధకుడు అయిన పియరీ క్యూరీ వారి మొదటి నోబెల్ బహుమతిని ఈమెతో కలసి అందుకొన్నాడు. ఈమె కుమార్తె ఇరీన్ జూలియట్ క్యూరీ కూడా నోబెల్ బహుమతి గ్రహీతే. ఇలా వీరి కుటుంబంలో ముగ్గురికీ నోబెల్ బహుమతులు లభించాయి.