Please follow and like us:
1955 లో జననం,సిద్ధిపేట ప్రాంతం.టీచరుగా 2013 లో రిటైర్మెంట్. శ్రీశ్రీ మహాప్రస్థానం ,ఉన్నవ మాలపల్లి సాహిత్య అవసరం ,అక్షరం విలువ నేర్పినయి. 45 ఏళ్ల సాహిత్య ప్రయాణం లో గోరుకొయ్యలు,పట్టుకుచ్చుల పువ్వు ,విరమించని వాక్యం కవిత్వ సంపుటాలు – ప్రోత్సాహకాలుగా ఉమ్మిడిశెట్టి ,సమైక్య సాహితి ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అవార్డులు. మంజీరా రచయితల సంఘం లో శాశ్వత సభ్యున్ని.
ప్రధానంగా సాహిత్య సృజన – జీవన గమన ప్రేరణాత్మక ఆచరణ గ ఉండాలని నమ్ముతాను.
‘ దినపు అంతాన భయం వలన
నీ గేటు త్వరితంగా మూయబడుతుంది
అయిననూ నాకు తెలుసు, ఇంకనూ సమయ ముందని….’ – గుండె కలుక్కుమంది. ఈ వాక్యాలు మళ్లా మళ్ళా చదివా.. మీకు నా అభినందనలు.
నా అనువాద కవితను ప్రచురించినందుకు, సాహిత్య విలువలకు పట్టం కట్టిన “నెచ్చెలి” కి ధన్యవాదాలు.
మంచి రచనలకు నెచ్చెలి ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది. దాసరాజు గారూ! కవిత పంపినందుకు ధన్యవాదాలండీ.