ఓ నా బట్టా! ముట్టుకో!

 
 
Day – 1
 
అదొక ఎర్రనది
అదొక అరుణ గంగ
అదొక రుధిర యమున
అదొక నెలసరి బ్రహ్మ
 
ఇది ఓ తిట్టు ఆత్మ కధ
ఉండచుట్టి చాటుగా దాపెట్టి
విసిరేసిన ప్యాడ్ అనే బట్ట తిట్టు వ్యధ
 
కోపాన్ని నొప్పినీ
అసహనాన్నీ తిట్టుగా మోస్తున్న ఆత్మ కధ
 
బడి పీరియడ్ లకీ బాడీ పీరియడ్లకూ
తేడా తెలియని అజ్ఞానాన్ని 
ఆమెకు ప్రసాదించిన 
మనమ్ కదా అంటరానివాళ్ళం..
 
పాపం ఆ పిచ్చి టిచర్నేమీ అనకండి 
ఆమెకూ ఆ మూడురోజులున్నాయి
ఆమెకూ
అంటుముట్టుమైలలున్నాయి
పీడకురాలి రూపంలోని పీడిత ఆమె
 
Day -2
 
ఆ రక్తంలోనే పుట్టి దాంతోనే స్నానంచేసి  అందులోనే ప్రవహించి బయటకొచ్చిన నీకు …మరకలేంట్రా
 
నీకు ఒళ్ళంతా మరకేగా
 
నీదేహం మీది నీ ఆత్మలోపలి 
నీ అణువణువునా పేరుకున్న మరకనేం చేస్తావ్..
నువ్వొక నిలువెత్తు ఎర్ర మరకవేగా
నాకులాగే నాలాగే 
 
అందుకే 
బట్టా నువ్వూ సేంటుసేం 
 
నీ జన్మమూలాన్ని 
నువు మూడురోజులు మూలన కూచోపెట్టినపుడే మొదటి తప్పు జరిగింది
 
ఈ రక్తపుదినాన వ్రతాలకూ యాగాలకూ దైవదర్షనానికీ నేను పనికిరానన్నపుడే అసలు నేరం జరిగిపోయింది
 
నన్ను ముట్టుకోవడం మైల అన్నపుడే అసలు పాపం మూటగట్టుకున్నావ్
 
పచ్చడి జాడీని తగలకూడదన్నపుడూ తులసి చెట్టును తాక కూడదన్నపుడూ దోషాలన్నీ జరిగిపోయాయి..
 
పాపం ఆ పిచ్చి టిచర్నేమీ అనకండి 
ఆమెకూ ఆ మూడురోజులున్నాయి
ఆమెకూ
అంటుముట్టుమైలలున్నాయి
పీడకురాలి రూపంలోని పీడిత ఆమె
 
Day – 3
 
ఆ విద్యార్ధినులకేమీ తెలీదు 
కాళ్ళ మధ్య పుండుగురించీ
ఆ పుండులోపలి నదీ ప్రవాహాల గురించీ
ఆ నెత్తుటి పాప పుణ్యాలూ
పవిత్రాపవిత్రతల గురించీ 
వాళ్ళకేమీ తెలియదు
 
రోడ్ల మీదా వెలివాడల్లో కులకురుక్షేత్రాలలో
పారుతున్న నెత్తురెవరికీ కనపడదు కానీ
ఆ పాప లెహంగా మీది మరక మాత్రం
అందరికీ దృశ్యమే..
అది బహిష్టు కాదు 
అంతర్ ఇష్టు
అది దూరం కాదు దగ్గరితనం
అది బయటుండడం కాదు లోపల విస్తరించడం
 
అంటు మన ఆచారాలది
అంటు మన ఆంక్షలది
అంటు మన నియమాలది
అంటు మన చూపుది
 
పాపం ఆ పిచ్చి టిచర్నేమీ అనకండి ఆమెకూ 
ఆ మూడురోజులున్నాయి
ఆమెకూ
అంటుముట్టుమైలలున్నాయి
పీడకురాలి రూపంలోని పీడిత ఆమె
 
 D day
 
అది రావడమే పుట్టుకకు నాంది
అది రానినాడే జన్మకు పునాది
 
                                    – అజ్ఞాత కవయిత్రి
 
NOTE
———-
ఇది ఓ నా మితృరాలి పెయిన్. అదేదో స్కూల్ లో అంటు పేరుతో అమ్మాయిలను బాత్రూం లోకి తీసుకెళ్ళి చూసారన్న వార్తకు స్పందన ఇది.
అయితే ఈ టాబూ దుష్ప్రభావం ఎంత తీవ్రమైనదీ అంటే..ఈ అక్షరాలను తన పేరుతో పోస్టించుకోవడానికి కూడా తాను ఇబ్బంది పడేంత..నేను ఎంత నచ్చ చెప్పినా తను కన్విన్స్ కాలేదు..ఆ స్తైర్యాన్ని ఇవ్వలేకపోయాను..పద్యం బాగుందనిపించింది…ఇది ధర్మాగ్రహమే అనిపించింది. అయినా బాధకు వేదనకు వేలిముద్రలెందుకు..కదా
-ప్రసేన్ 
Please follow and like us:

3 thoughts on “ఓ నా బట్టా ముట్టుకో (కవిత)”

  1. baagundi andee. kavitha wraayadam aavida hakku.. adi ithara aachaaraalakee, muurkhathvaanikee, moodhanammakaalakee atheethamainadi..
    aavida baadha kanipistondi..inko kavitha aavida peruthone wraayaalani korukuntunnaa.. kalam peru pettukunnaa sare… all the best andee

Leave a Reply

Your email address will not be published.