అనుసృజన

నిర్మల

(భాగం-3)

ఆర్. శాంతసుందరి 

(హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -)

కల్యాణికి ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చిపడింది.భర్త పోయాక ఆమె ఒంటరిగా  సమస్యని ఎలా ఎదుర్కోవాలో తెలీక సతమతమయింది.కొడుకులు చెప్పుల్లేకుండా స్కూలుకెళ్ళినా, ఇంట్లో అంట్లు తోముకుని,ఇల్లు ఊడ్చి తుడుచుకోవలసి వచ్చినా, ఒక పూటే తిని అర్ధాకలితో పడుకోవలసి వచ్చినా పెద్ద కష్టం కాదు,కానీ వయసొచ్చిన కూతురు పెళ్ళికాకుండా ఇంట్లో ఉందంటే అది చాలా పెద్ద సమస్య.వెళ్ళి భాలచంద్రని నాలుగూ కడిగెయ్యాలన్నంత కోపం వచ్చిందామెకి.

ఇంతలో కృష్ణ ఆమె దగ్గరకి పరిగెత్తుకొచ్చింది.”అమ్మా, పంతులుగారు వచ్చేశారుగా, పెళ్ళి ఎప్పుడని చెప్పారు?” అంది

కలగంటున్నావా?”

అదేమిటమ్మా? ఏమైంది?”

మగపెళ్ళివాళ్ళిల్లు కాలిపోయిందిట !”అంది కల్యాణి కసిగా.

అయ్యో,మరి వాళ్ళకిప్పుడు ఇల్లు లేదా?మరి అక్కయ్య ఎక్కడికెళ్తుంది?”

ఎంత అమాయకురాలివే! వాళ్ళు పెళ్ళి వద్దనారు?”

ఎందుకు? ముందు ఒప్పుకున్నారుగా?”

బోలెడంత డబ్బు కావాలిట.నా దగ్గర అంత డబ్బు లేదు.”

అబ్బ ఎంత మోసం ! కానీ అక్కకి పెళ్ళి తప్పిపోవటమే మంచిది.అలాంటి వాళ్ళతో ఎలా ఉంటుంది?నువ్వు సంతోషించాలి గాని దిగులేమిటి?”

చిన్న పిల్లయినా ఎంత లోతుగా ఆలోచించింది,అనుకుంటూ కల్యాణి కూతుర్ని ప్రేమగా దగ్గరకి తీసుకుంది.ఆమె మనసు తేలికైంది.

కల్యాణి కూడా అంత పక్షపాతం లేనిదేం కాదు.ఆమెకి కూతుళ్ళ కన్నా కొడుకుల మీదే ప్రేమ ఎక్కువ.చదువు సంధ్యల విషయంలో కాని,పోషణ విషయంలో కాని ఆమె తేడా చూపించేది.

***

మోటేరామ్ లక్నో నుంచి రాగానే మళ్ళీ సంబంధాల వేటలో పడ్డాడు.లక్నో వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు జవాబు చెప్పాలనీ, అంతకన్నా మంచి సంబంధం కుదర్చాలనీ అనుకున్నాడు.కల్యాణి ఆయనకి ఉత్తరమ్ రాసేందుకు కలం, కాయితమ్ తీసుకోగానే ఆయన ఇంట్లో ప్రవేశించాడు.

రండి పంతులు గారూ. ఎక్కడైనా మంచి సంబంధం దొరికిందా?” అంది కల్యాణి.

ఎందుకు దొరకదమ్మా? నలుగురైదుగురితో మాట్లాడి వచ్చాను.”అన్నాడు మోటేరామ్.

[మొదటి మూడు సంబంధాలూ కల్యాణికి అంతగా నచ్చలేదు. మిగిలిన మూడిట్లో ఇద్దరు రెండో పెళ్ళి వాళ్ళు.ఇద్దరూ బాగా డబ్బూ,ఆస్తీ ఉన్నవాళ్ళు.ఒక వరుడు జమీందారు బిడ్డ.మొదటి భార్య వల్ల పిల్లలు లేరు.ఆట్టే చదువుకోలేదు.వాళ్ళకి పొలాలున్నాయి, వాటిమీద వచ్చే ఆదాయం బాగానే ఉంది.రెండో వరుడు లాయరు.వయసు ముప్ఫై ఐదు.ముగ్గురు మగపిల్లలున్నారు.ఆస్తిపరులు.సొంత ఇల్లు కూడా ఉంది.]

అందరూ కట్నం డబ్బులడుగుతున్నారు.ముందు అడిగే రొక్కం తీరా పెళ్ళిదాకా వచ్చేసరికి ఎంత పెరుగుతుందో తెలీదు.మా పరిస్థితి మీకు తెలీనిదేముంది? ఒక్క లాయరుగారు మాత్రమే కట్నమ్ వద్దంటున్నారు.ముప్ఫై ఐదేళ్ళు పెద్ద వయసేమీ కాదుగా ! సంబంధమే ఖాయం చెయ్యండి పంతులు గారూ!” అంది కల్యాణి చివరికి.

బాగా ఆలోచించుకోండమ్మా, మీ మాట కాదనేంతటి వాణ్ణి కాను.మీరు చెప్పిన సంబంధం కుదుర్చుకుని వస్తాను.కానీ ప్రెస్ అబ్బాయిది బంగారం లాంతి సంబంధం.ఒక్క వెయ్యి రూపాయల కట్నానికి వెనకాడకండి.అతనితో మీ అమ్మాయి సుఖపడుతుంది. ఇద్దరికీ ఈడూ జోడూ  చక్కగా అమరుతుంది.”అన్నాడు మోటేరామ్.

నాకు మాత్రం ఇష్టం లేదా పంతులు గారూ?కానీ డబ్బెక్కణ్ణుంచి తేను? నాకు ఒక్కరూ సాయానికి రారు.నా పిల్ల మీద నాకు మాత్రం ప్రేమ ఉండదా? కానీ పరిస్థితులు అలా ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చెయ్యను? అమ్మాయి అదృష్టం బాగుండాలే గాని, ఇంటికి వెళ్ళినా సుఖంగానే ఉంటుంది. మీరు వెళ్ళి లాయరు సంబంధం నిశ్చయం చేసెయ్యండి.వయసు కాస్త ఎక్కువే , పిల్లలు కూడా ఉన్నారు.కానీ నిర్మలకి పిల్లలంటే చాలా ఇష్టం.వాళ్ళని తన సొంత పిల్లల్లాగే అనుకుంటుంది.ముహూర్తం పెట్టుకుని మరీ రండి.”

***

నిర్మలకి లాయర్ తోతేరామ్ తో పెళ్ళయిపోయి ఆమె అత్తారింటికి వచ్చింది.తోతేరామ్ నల్లగా ,లావుగా దిట్టంగా ఉంటాడు.ఇంకా నలభై యేళ్ళు రాకపోయినా అతను చేస్తున్న ఉద్యోగం చాలా కష్టమైంది కాబట్టి జుట్టు నెరిసిపోయింది.వ్యాయామం చేసే తీరిక ఉండదు.చివరికి వాహ్యాళికి కూడా వెళ్ళటం కుదరనంత పని ఒత్తిడి.దాంతో పొట్ట పెరిగింది.ఒంట్లో కొవ్వు చేరటం వల్ల ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటూనే ఉంటుంది.

ముగ్గురు మగపిల్లల్లో పెద్దవాడు మన్సారామ్ కి పదహారేళ్ళు,రెండోవాడు జియారామ్ కి పన్నెండు,ఆఖరి పిల్లవాడు సియారామ్ కి ఏడేళ్ళు. ఇంట్లో మరో ఆడదిక్కు తోతారామ్ అక్క మాత్రమే.ఆమె వితంతువు.ఆమే ఇంటి యజమానురాలు.యాభైయేళ్లకి పైబడ్డ ఆవిడ పేరు రుక్మిణి.

పాపం తనలోని లోపాలని కప్పిపుచ్చుకునేందుకు తోతారామ్ నిర్మలకి తరచు ఏదో ఒక కానుక తెచ్చిస్తూ ఉండేవాడు. కాస్త తీరిక దొరికినా సినిమాలకీ, సర్కస్ , నాటకం లాంటి వాటికి తీసుకెళ్ళేవాడు.లేకపోతే ఆమె పక్కనే కూర్చుని గ్రామఫోన్ లో పాటలు వినేవాడు.కానీ నిర్మలకి ఆయన పక్కన కూర్చోవాలంటే ,నవ్వుతూ కబుర్లు చెప్పాలంటే సంకోచంగా ఉండేది.

అందరూ కట్నం డబ్బులడుగుతున్నారు.ముందు అడిగే రొక్కం తీరా పెళ్ళిదాకా వచ్చేసరికి ఎంత పెరుగుతుందో తెలీదు.మా పరిస్థితి మీకు తెలీనిదేముంది? ఒక్క లాయరుగారు మాత్రమే కట్నమ్ వద్దంటున్నారు.ముప్ఫై ఐదేళ్ళు పెద్ద వయసేమీ కాదుగా ! సంబంధమే ఖాయం చెయ్యండి పంతులు గారూ!” అంది కల్యాణి చివరికి.

బాగా ఆలోచించుకోండమ్మా, మీ మాట కాదనేంతటి వాణ్ణి కాను.మీరు చెప్పిన సంబంధం కుదుర్చుకుని వస్తాను.కానీ ప్రెస్ అబ్బాయిది బంగారం లాంతి సంబంధం.ఒక్క వెయ్యి రూపాయల కట్నానికి వెనకాడకండి.అతనితో మీ అమ్మాయి సుఖపడుతుంది. ఇద్దరికీ ఈడూ జోడూ  చక్కగా అమరుతుంది.”అన్నాడు మోటేరామ్.

నాకు మాత్రమ్ ఇష్టం లేదా పంతులు గారూ?కానీ డబ్బెక్కణ్ణుంచి తేను? నాకు ఒక్కరూ సాయానికి రారు.నా పిల్ల మీద నాకు మాత్రమ్ ప్రేమ ఉండదా? కానీ పరిస్థితులు అలా ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చెయ్యను? అమ్మాయి అదృష్టం బాగుండాలే గాని, ఇంటికి వెళ్ళినా సుఖంగానే ఉంటుంది. మీరు వెళ్ళి లాయరు సంబంధం నిశ్చయం చేసెయ్యండి.వయసు కాస్త ఎక్కువే , పిల్లలు కూడా ఉన్నారు.కానీ నిర్మలకి పిల్లలంటే చాలా ఇష్టం.వాళ్ళని తన సొంత పిల్లల్లాగే అనుకుంటుంది.ముహూర్తం పెట్టుకుని మరీ రండి.”

***

(ఇంకాఉంది) 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.