
Please follow and like us:

నేను సిద్దిపేటలో 1972లో జన్మించాను.
మా బాపు పద్యకవి కావడం వల్ల కొంత సాహిత్య జ్ఞానం అబ్బింది. నందిని సిధారెడ్డి, దేశపతి మిత్రుల వల్ల ప్రాపంచిక దృక్పథం తెలిసింది.
1993 నుండి కవిత్వం రాస్తున్న. ‘అలుకుబోనం’ నా మొదటి కవిత్వ సంపుటి. ‘వానపండుగ’ రాబోతున్న కవిత్వ పుస్తకం. ‘మెతుకు కథ’ సంపుటికి ఒక సంపాదకుడిని, ‘మునుం’ తెలంగాణ పుష్కరకవిత్వ పుస్తకానికి ప్రధాన బాధ్యుల్లో ఒకన్ని. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను.