చీకటి వేకువ 

(అనువాద కవిత)

ఆంగ్ల మూలం: గుగి వా థియోంగో

 తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్

 

(24 మార్చ్ 2020)

తెలుసు, తెలుసు, నాకు తెలుసు

ఒక కరచాలనం

ఒక బిగి కౌగిలి

దుఃఖ భారం దించుకోవడానికి ఒకరికొకరం అందించే భుజం

ఎప్పుడైనా సరాసరి లోపలికి నడవగల పొరుగిల్లు

మానవానుబంధపు అతి సాధారణ ఆనవాళ్లన్నిటినీ

సవాల్ చేస్తున్నదిది

ఎగుడుదిగుళ్ల వ్యక్తివాదపు గొప్పలతో 

మన భుజాలు మనమే చరుచుకుంటూ, 

మనిషి మీద సకల హక్కులూ ఆస్తికే ఉన్నాయంటూ  

ప్రకృతిని చీదరించుకుంటూ

ఉచ్చపోసినట్టు దాని మీద విషాన్ని కూడ చిమ్ముతూ

పెట్టుబడి దేవతలలో మనకందిన వాటాలకు ధన్యవాదాలు జపిస్తూ

సాగిన మనకిది సవాల్ 

ఓహ్, నేనిప్పుడు కవిత్వం రాయగలిగి ఉంటేనా 

ఇంగ్లిష్ లోనో 

మీరు మాట్లాడే ఏదో ఒక భాషలోనో

అన్ని భాషలలోనో

నా గికుయు తల్లి వంజికూ నాకెప్పుడూ చెపుతుండిన

మాటలు మీతో పంచుకునే వాణ్ణి

గూతిరీ ఊతుకూ ఊతకీయ:

వేకువతో ముగియనంత

గాఢమైన చీకటి రాత్రేదీ లేదు.

ఇంకా సులభంగా చెప్పాలంటే

ప్రతి రాత్రీ వేకువతోనే అంతమవుతుంది

గూతిరీ ఊతుకూ ఊతకీయ

ఈ అంధకారం కూడ సమసిపోతుంది

మనం మళ్లీ మళ్లీ మళ్లీ కలుస్తూనే ఉంటాం

చీకటి గురించీ వేకువ గురించీ 

మాట్లాడుకుంటూనే ఉంటాం

పాడుకుంటూనే ఉంటాం

నవ్వులాటల్లో మునిగితేలుతూనే ఉంటాం

బహుశా కావలించుకుంటుంటాం కూడ. 

ప్రకృతీ పోషణా పెనవేసుకునే ఆకుపచ్చని కౌగిలి

మామూలు మనిషిలోని ప్రతి ఒక్క జీవనాడీ

ఉత్సవమవుతుంది

నిజంగా నిజమైన పునరావిష్కరణ 

నిజంగా నిజమైన అనుభూతి

చీకటి వెలుగులో

వినూత్న వేకువలో  

(పొరుగింటి జేన్ దివిన్సెంజో హాస్య లయబద్ధ గీతానికీ, కార్నెల్ యూనివర్సిటీ నుంచి ముకోమా వా గుగి, కోల్ కత్తా నుంచి సీగల్ పబ్లిషర్స్ నవీన్ కిషోర్ పరామర్శలకూ స్పందనగా)  

—–

Dawn of Darkness

By Ngũgĩ wa Thiong’o

(24 March 2020)

I know, I know,

It threatens the common gestures of human bonding

The handshake,

The hug

The shoulders we give each other to cry on

The Neighborliness we take for granted

So much that we often beat our breasts

Crowing about rugged individualism,

Disdaining nature, pissing poison on it even, while

Claiming that property has all the legal rights of personhood

Murmuring gratitude for our shares in the gods of capital.

Oh how now I wish I could write poetry in English,

Or any and every language you speak

So I can share with you, words  that

Wanjikũ, my Gĩkũyũ mother, used to tell me:

Gũtirĩ ũtukũ ũtakĩa:

No night is so Dark that,

It will not end in Dawn,

Or simply put,

Every night ends with dawn.

Gũtirĩ ũtukũ ũtakĩa.

This darkness too will pass away

We shall meet again and again

And talk about Darkness and Dawn

Sing and laugh maybe even hug

Nature and nurture locked in a green embrace

Celebrating every pulsation of a common being

Rediscovered and cherished for real

In the light of the Darkness and the new Dawn.

*****

 “Dawn of Darkness” is a response to “Doggerel” by neighbor Janet DiVincenzo as well as “In Our Times” by Mukoma wa Ngugi of Cornell University, and “Another Twilight” by Naveen Kishore of Seagull Publishers, Kolkata, India. (http://www.warscapes.com/poetry/dawn-darkness)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.