జ్ఞాపకాల సందడి-10
-డి.కామేశ్వరి
మేము భువనేశ్వర్లో వుండేటప్పటి మాట. మా బావగారు హనుమంతరావు గారు మద్రాస్ లో ఏదో కంపెనీ లో పని చేస్తూ బిజినెస్ పనిమీద భువనేశ్వర్ వస్తుండేవారు. ఒకసారి వచ్చినపుడు ఆయన మహంతి అనే ఆఫీసర్ని కలవాలని ముందుగా అప్పోయింట్మెంట్ ఫిక్స్ చేసుకోడానికి ఇంటికి ఫోన్ చేసారు.
ఈయనకి ఒరియా ఎలాగో రాదు హిందీ రెండు ముక్కలు వచ్చు. అటు నించి ప్యూన్ ఫోన్తీసాడు. ”హలో, మై మద్రాస్ సే రావు బోలా మహాన్తిసాబ్ హాయ్“ అని అడిగారు అట్నుంచి వాడు “నహన్తి” అన్నాడు.
ఈయన “నహీ , నహన్తి నై మహంతి హోనా “
మళ్ళీవాడు “నహన్తి” అన్నాడు.
ఈయన మహంతి ..మహంతి అని గట్టిగ నొక్కి అడుగుతున్నారు.
డ్రాయింగ్ రూమ్ లోనేవున్న నేను మొదట పట్టించుకోలేదు .
“ఏమిటమ్మా , వాడు మహాన్తినడిగితే నహన్తి పేరు చెపుతాడేమిటి, కాస్త మాట్లాడు నీవు అని ఫోన్ ఇచ్చారు.
అప్పటికే సంగతి అర్ధమైనది నాకు. ఒరియాలో మహాంతి గారున్నారా ఉంటే పిలు అన్నా .
వాడు “నహన్తి సాబ్ బహార్ జాయిచ్చి” అని జవాబు ఇచ్చాడు.
అసలు భాగోతం ఏమిటి అంటే ఒరియాలో “నహన్తి” అంటే లేరు అని మర్యాదగా చెప్పడం..
“నహి” అనడం “లేడు అన్నట్టు అమర్యదగా వుండే పదం” నౌకర్లు వాడరు.
ఈయన మహంతి అంటే వాడుమర్యాదగా “లేరు” అంటున్నాడు.
మహంతి లాగే నహన్తి కూడా పేరనుకుని ఈయన మహంతి కావాలి మొర్రో అనడం.
నేను చెప్పాక ఆ జోక్ చెప్పుకు అటు విభిషన్ మహంతి గారు, మేము బావగారిని ఏడిపించాం చాల రోజులు.
*****