నూజిళ్ల గీతాలు-1(ఆడియో)

ఎందరో మహానుభావులు

-నూజిళ్ల శ్రీనివాస్

పల్లవి:

ఎందరో మహానుభావులుఅందరికీ మా వందనాలు
మహమ్మారి వైరసొచ్చిన వేళ, మనిషి పైనే దాడి చేసిన వేళ
మానవత్వాన్ని మేలు కొల్పి ఈ లోకానికి మేలు చేసేటి వారు ఎందరో….!
చరణం-1:

రోగాలు మన దరి చేరకుండగా, ఇంటనే ఉంచి భద్రంగా చూస్తూ
అయిన వాళ్లకు దూరంగా ఉన్నా అందరి క్షేమాన్ని కోరే పోలీసులు ఎందరో…
ఎందరో మహానుభావులుఅందరికీ మా వందనాలు!
చరణం-2:

పగలు రేయి రోగి చెంతనే ఉంటూ కంటికి రెప్పలా కాపాడు కొంటు
ప్రాణాలు పోసి, త్యాగాలు చేసే ప్రత్యక్ష దైవాలు వైద్యులు, నర్సులు ఎందరో…
ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు!
చరణం-3:

చెత్తను ఊడిచి, మురికిని తీసి ఆరోగ్యకరమైన పరిసరాలిచ్చి
రోగాలు, రొష్టులు చేరకుండగా శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు ఎందరో…
ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు!
చరణం-4:

మన తిండి, నీరు, విద్యుత్తుకేనాడు లోటు కలుగకుండ సేవలనందిస్తు
అందరి కష్టాలు తీర్చేటి తక్షణ సేవల సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు ఎందరో…
ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు!
చరణం-5:

లోకాన శోకము నిండిన వేళ విషపు గాలి విస్తరించిన వేళ
మరణభేరి మ్రోగించే వేళ సేవకు ప్రతిరూపమైన దైవాలు ఎందరో…
ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.