ప్రమద
అరుణ గోగుల మంద
–సి.వి.సురేష్
అరుణ గోగుల మంద గారి కవిత Celestial Confluence ను తెలుగు లోకి అనుసృజన చేయాలన్న ఆలోచనే ఓ సాహసం. చాల లోతైన భావాలతో…ఒక సరిక్రోత్హ ఫిలాసఫీ ని తన కవితల్లో జొప్పించడం ఆమె సహజ కవిత లక్షణం. ఈ కవిత భిన్న మైనది. ఆంగ్లం లో చాల ఉన్నత విలువలు కలిగిన పోయెమ్. తెలుగు ప్రపంచం గర్వించదగ్గ కవియత్రి. అనువాదం లో చాల పదాలను అనుసృజన లోకి మార్చే సమయంలో పూర్తి స్వేచ్ఛను తీసుకొన్నాను.
నెచ్చెలికి ఆమె అనువాదాన్ని అందించే ఆలోచనలో ఆమెకు ఇవాళ ఫోన్ చేసి మాట్లాడాను. ఆమె గురించి ఆమె మాటల్లోనే….
తాడేపల్లి గూడెం దగ్గర ఒక పల్లెటూరు జన్మ స్థలం. నాన్న గారి ఉద్యోగ రీత్యా చాల ఆదివాసీ గ్రామాల్లో నివసించాను. ప్రకృతి ఒడిలో పెరిగాను. తండ్రి ట్రాన్స్ఫర్ వల్ల ఆంధ్ర ప్రదేశ్ మొత్తం తిరిగాల్సి వచ్చింది. బాపట్ల, పోలవరం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల లో నా విద్యాభ్యాసం జరిగింది. సైన్సు స్టూడెంట్ ను. ఇంగ్లీష్ కోర్ సబ్జెక్టు. సైకాలజీ, పొలిటికల్ సైన్సు. ఇంగ్లీష్ లిటరేచర్ నా కాలేజి లైఫ్ లో బెస్ట్ టీచర్స్ వల్ల సాధ్యపడింది. పోయెట్రీ అంటే వల్లమాలిన అభిమానం. కీట్స్, జాన్ డన్ , వర్డ్స్ వర్త్, షేక్ స్పియర్ ల కవిత్వాన్ని బాగా చదివాను. తెలుగు సాహిత్యం కూడా నాన్న నేర్పారు. తెలుగు చాల ఇష్టం.
నా చిన్నతనం లోనే నాకు కవిత్వం రాసిన కారణంగా చాల అవార్డులు వచ్చాయి. అప్పుడే సామాజిక అంశాల పైన అనేక కవితలు రాసాను. కాలేజీ రోజుల్లోనే చాల సాహిత్య పోటీలు పాల్గొని, నేనే విజయం సాధించేదానిని. వివాహం, సంసారం అంతా కుదుట పడ్డాక, మళ్ళీ నాకు కవిత్వం లో ఒక స్పేస్ దొరికింది కవి సంగమం లోనే. నాకు పెళ్లి అయ్యాక నాకు తారసపడిన వాళ్ళు వల్ల కొద్ది రోజులు కవిత్వం రాయడమే మానుకున్నాను. తర్వాత కొద్ది రోజులకు పూర్తి స్థాయిలో కవిత్వాన్ని రాయడం మొదలు పెట్టాను.
ఫెమినిజం పై స్పష్టమైన అభిప్రాయం:
దీపిక పడుకొన్ తన “ మై ఛాయస్” అనే వీడియో లో తాను ఎక్ష్ప్రెస్ చేసిన విషయాలు సరికావు. ఆమె అనుకొంటున్న హక్కులు….సరైనవి కావు. అవి కావు ఇప్పుడు ఈ దేశం లో స్త్రీలకూ కావాల్సిన హక్కులు. ఆ వీడియోకు పార్లల్ గా నేను “need vs choices” అనే కవిత రాసాను. ఈ దేశంలో, 90 శాతం మంది స్త్రీలు బేసిక్ రైట్స్ అందక బాధపడుతున్నారు. అసలు ఉమెన్స్ డే , మదర్స్ డే లు ఎందుకు జరుగుతున్నాయో తెలియని పరిస్థితుల్లో స్త్రీలు మగ్గి పోతుంటే, సమాజంలో కొంత ఎదిగిన స్త్రీలు టైం పాస్ కోసం, ఒక ఐడెంటిటీ కోసం ఇలాంటి రాతలు రాస్తునప్పుడు ఫెమినిజంకు చెడ్డ పేరు వస్తుంది. ఈ సమాజం లో అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి కానీ, తమ ఇష్టారాజ్యంగా తిరుగుతానంటే అది ఫెమిజిజం అనిపించుకోదు. అందరికీ బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతారాహిత్యం అనేది ఏ జెండర్ కైనా క్షమార్హం కాదు. మన వెనకాల ఉన్న తరాలకు బాధ్యత ఏంటో తెలియచేయాలి. ఇలాంటి అనాలోచితమైన మాటలు ఖచ్చితంగా ఫెమినిజం పట్ల ఏ వ్యవస్థలో నైనా నవ్వులాట కు గురి అవుతాయి.
స్తీల హక్కులు మానవ హక్కులు. పిల్లల హక్కులు మనవ హక్కులు. అలాగే ఏ వర్గం లో నైన వారి హక్కులు మానవ హక్కులే. పురుషులను ఏదో ఇతర ప్లానెట్ వచ్చిన వారి లాగా ట్రీట్ చేస్తూ, వాళ్ళకు సమస్య ను అర్థం అయ్యేలా చెప్పకుండా, వాళ్ళను పూర్తిగా వేరు చేసి మాట్లాడటం జరిగితే, అసలు సమస్యకు పరిష్కార దిశగా పోనట్లే. కాగా ఆ సమస్యను మరింత జటిలం చేసినట్లే
పురుషులను కూడా include చేసుకొని , ఒక సమిష్టి సమానత్వం వైపు అందరం కలిసి కదిలితే ఒక మంచి సమాజాన్ని భావి తరాలకు అందించగలము. అలంటి సమాజ ఏర్పాటు కోసమే ఏ కవిత్వం అయినా, ఏ సాహిత్యమైనా లక్ష్యంగా కదలాలి.
అరుణ గోగులమంద || Celestial Confluence ||
అనుసృజన : సి.వి. సురేష్ || దివ్య సమాగమం||
..
అనంత ఆకాశం ఒంటరిగా నడుస్తుంది
చీకటి సువిశాల సాగర తీరం
పైకెగిసే అలల అంతుచిక్కని రహస్య ఘోష
జీవితమనే ఓ నాటకాన్ని చిత్రీకరిస్తాయి
ఒక రోజంతా సుదీర్ఘ మూకాభినయం తో…!
…….
కాలి గుర్తులు ..
కొన్ని జతలుగా ..
కొన్ని ఏకా౦తంగా..
తీరపు అంచున గుసగుస లాడే రెల్లుపువ్వులు
అంతం లేని హృదయ ఘోష ల
అనావిష్క్రుత చరిత్ర లెన్నో అందిస్తాయి
…
ఒక పొగమంచు..
ఒక చిక్కుముడని పిలచే జీవితం..
ఆ గజిబిజి గమ్యాలు..
సిద్ధపడిన ఆట౦కపు అపనమ్మక౦..
ఒక చిక్కు ను విప్పే౦దుకు
ఇంకో అలోచాన శక్తిని విడుస్తూ వెళ్ళడం..!
..
హటాత్తుగా ….
ఎదురయ్యే విభ్రమాలను స్మరిస్తూ…
హృదయం మంత్ర ముగ్ధు లను చూసే ఆ చూపుల్లో…
చివరి ముగింపు ఊహించినప్పటికీ…
..
ఆ చికిలించే కళ్ళు
సుతారమైన హృదయ స్పందనలు
మెరిసే భౌతిక రూపాలు
ఆ తడి పెదవులపై …
ప్రకాశించే నవ్వులు
హృదయ కవాటాల్లో …తడిసి ముద్దయ్యే స్వప్నాలు ..
పెనవేసుకొన్న ఆ యవ్వన ప్రేమ
జీవితంలోకి చేరుకొన్న ఆ సోలమన్ సంగీతం
ఆ శీతల రసరమ్య వెన్నెల పరచుకొన్న రాత్రులు
ఆ నులివెచ్చటి కౌగిలింతల్లో శాశ్వతమవుతాయి…!
…
కనురెప్పల తడబాటు ..
చెట్టు కొమ్మలపై కిల కిల రావాలు చేస్తూ పక్షులు …
దైవత్వ బృందగానంగా తమ ప్రేమను ఆలపిస్తుంటే..
ఆ ఉద్వేగాల జలపాతం
…
అసంబద్ధ సమావేశాలపై
అలల్లాగా వచ్చే ఆలోచనలు
నాలుగు రోడ్ల కూడల్లలో నిలిచే ఒక్కో ఏకాంతం
క్రూరమైన గమ్యాల యొక్క విధి నాటకం !!!
..
ఫలితం లేని ప్రమాణాలు
హృదయానికి తాకకుండా ఆవిర్భవించడ౦
పగిలిన భవిష్యత్తు పై
గుట్టలు గుట్టలుగా దృశ్యాలు
ఒక సుదీర్ఘ నడక….
అతని జీవిత గమ్యం పై … అతని తో….
కానీ,
ఒక అపరిచిత శాపం మధ్యలో ఆవిష్కృతమవ్వడం.
..
ఆ మృత హృదయం యొక్క
సమాధి పై మొలిచిన అక్షరాలు
నా చెలియకు మాత్రమే అర్థమయ్యే ఓ విభిన్న శైలి!
అతని భుజం పై తలవాల్చి
తన అసాధారణ కోరిక ను వివరించే విఫల యత్నం…!
..
ప్రపంచమంతా ఘనీభవించినట్లు…
ఆమె..అతడు ..సర్వస్వం అందులో ఇమిడి పోయారు….
పరిస్థితులు ఇప్పుడు వేరుపడ్డాయి.
ఆమె కోల్పోయింది.
అతని మగదాసత్వం కోసం జీవితం కోల్పోయింది.
కానీ.
ఇప్పుడింకా,ఆమె ఆ గాలుల్లోనే ..
వగచిన గతపు జ్ఞాపకాల పరిమళ౦ లో ఉండిపోయింది..!!!
Original poem :
Aruna Gogulamanda || Celestial Confluence ||
Unending sky walks alone
The dark banks of the enormous sea..
Mysterious uproar of the high rising tides..
Presents the drama called life
in a day long mime.
…
Foot prints..
Some in pairs
others..lonesome.
Whispering reeds on the edges of the banks
convey the hidden histories
of endless heartaches.
..
A haze.
A labyrinth called life.
Confused destinations.
Willing suspension of disbelief
Dazed..
To solve the maze.
..
Enchanting sudden surprizes.
Heart pines for more to lose in his eyes
of magical gazes,
even after presuming the dead end.b
..
Twinkling eyes.
Tinkling heartbeats.
Glowing physical selves,
Radiant smiles on moist lips.
Dreams get drenched in twin hearts..
entwined in youthful love.
Song of Solomon..comes to life,
in romantic, chilled moonlit nights.
Eternalized in warm hugs.
…
Fluttering eye lashes..
Twittering birds on the branches of trees
sing their love in divine chorus.
A cascade of emotions flow in a series of sensuous unions.
Celestial confluence.
…
of Ripples of thoughts..
Of unplanned meetings.
on the cross roads individual solitudes.
Fatal play of cruel destiny.
..
Unfruitful promises.
Hearts ripped apart.
Heaps of images of broken future,
A long walk on the path of life with him
but an unknown curse landed in division.
..
Inscription on the tomb of a dead heart
In an enigmatic form known just to its lover.
She longed to elaborate
leaning on to his shoulder, but in vain.
..
Frozen seems the world..!
She.. him and everything in it.
Things fall apart.
She is lost..
lost for life..to his manly thrall.
But she remains still in the air
a fragrance of memories of tragic past.
*****
సి.వి. సురేష్ : కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. సాహితీ ప్రేమికులు. 2013 నుంచి సాహిత్య వ్యాసంగంలో ఉన్నారు. చారిత్రక ప్రతీకలు అరుదైన సిమిలీలతో సాగే వీరి కవితలు పాఠకహృదయాల ఆదరణ పొందాయి. అనుసృజనలు వీరి ప్రత్యేకత. ఇప్పటివరకూ డెబ్భై కు పైగా కవితలు తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి.. ఎనభై పై చిలుకు కవితలు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. అందులో క్లిష్టమైన సూఫీ పోయెట్రీ సంగం పోయెట్రీ కూడా ఉన్నాయి. కవిసంగమం ఫేస్బుక్ గ్రూప్ లో ప్రతి బుధవారం “కవిత్వానువాదం” శీర్షిక, ప్రజాపాలన పత్రిక ‘విభిన్న’ సాహిత్య పేజీల నిర్వహణ, రస్తా మరియు సారంగ వంటి ప్రముఖ వెబ్ మేగజైన్స్ లో కాలమ్స్ నిర్వహిస్తున్నారు.
అరుణ గారు పూర్తిగా కవిత్వపు మనిషి.. ఊపిరి పీల్చినంత సహజంగా కవిత్వం చెబుతారు. కవిసంగమం లో, ఎఫ్బి లో ఆవిడ కవితలు చాలా చదివాను.
సురేష్ గారి అనువాదం.. కవయిత్రి పరిచయం రెండూ బాగున్నాయి.
Love to see this comment andee, after this big gap of publication. Thank you so much.
అరుణ గారు మంచి కవిత్వం రాస్తారు . ఆవిడని ఢిల్లీ లో 2016 లో జరిపిన ఆధునిక కవితా గోష్టి లో పిలిచాను
Thank you sir
బావుంది సర్ అరుణ గారి పరిచయం వారి కవిత లోని భావాలు …..
Thank you Rukmini garu