ముందస్తు కర్తవ్యం (కవిత)
-యలమర్తి అనూరాధ
కనికరం లేని కబళింపు
జాపిన చేతులు పొడగెక్కువ
గాలి కన్నా వేగంగా వ్యాప్తి
లక్షణాలు మెండే
అయితే ఏంటంట
చేయి చేయి కలుపు
ఒకప్పటి నినాదమైతే
దూరం దూరంగా జరుగు ఇప్పటి నినాదం
ఎంతలో ఎంత మార్పు?
ఊహించనవి ఎదురవ్వటమేగా
జీవితమంటే!?
తట్టుకుని నిలబడటమేగా ధైర్యమంటే
కరోనా అయినా మరేదైనా
ఆత్మస్థైర్యంతో తరిమి కొట్టడమే
ముందస్తు కర్తవ్యం
వైద్యులు అండ
పోలీసులు తోడు
శాస్త్రజ్ఞులు సహకారం
నిస్వార్థ హృదయాల మానవత్వం
అండగా ఉండగా
లేదులే నీకు భయం
స్వయం నిర్బంధనకు సంసిద్ధత
శుభ్రతకు తొలి స్థానం
వెచ్చదనానికి దగ్గరగా చల్లదనానికి దూరంగా
నిన్ను నీవు నియంత్రించుకుంటే
నూరేళ్ళ జీవితానికి ఢోకా లేనట్లే
కరోనా ఐనా
మరే మహమ్మారి అయినా
దౌడు తీయాల్సిందే!
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి