చిత్రం-12
-గణేశ్వరరావు
ఈ ‘అమ్మ’ ఫోటో తీసినది అలేనా అనసోవ. ఆమె రష్యన్ ఫోటోగ్రాఫర్. అనేక అంతర్జాతీయ అవార్డ్లు ఆన్డుకుంది. ఈ ఫోటో కూడా అంతర్జాతీయ గుర్తింపు, అవార్డ్ పొందింది. . 5 ఖండాలకు చెందిన 22 దేశాలనుంచి ఫోటోగ్రాఫర్ లు ఆ పోటీలో పాల్గొన్నారు. దృశ్య మాధ్యమంగా మనల్ని అబ్బురపరిచే చాయా చిత్రాల్లో దీన్ని అత్యుత్తమమైనదిగా న్యాయ నిర్ణేతలు గుర్తించారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ – మనం ముఖ్యంగా గమనించదగ్గది ఎలెనా ‘అమ్మ ‘ పట్ల కనబరచిన సృజనాత్మకత, ఆమె దృక్కోణం, సాధారణమైన దృశ్యాన్ని అసామాన్యoగా చూపించిన ప్రతిభ.
ఈ సందర్భంలో రాజాచంద్ర ఫౌండేషన్ వాళ్ళ కృషిని కూడా మనం గుర్తించాలి. ‘అమ్మకి జే జే’ అనే సంకలనాన్ని వాళ్ళు ప్రచురించారు. వివిధ రంగాలకు చెందిన తెలుగు వెలుగులు – ముళ్ళపూడి రమణ-బాపు..బాలమురళీ కృష్ణ.. రావు బాలసరస్వతి.. భానుమతి.. ఎస్పీ.. మొత్తం 18 మంది ‘అమ్మ’ పట్ల వెలిబుచ్చిన అభిప్రాయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
రమణ అన్నట్టు ‘అమ్మ జన్మరీత్యా అమ్మ, జీవిత రీత్యా స్నేహితురాలు,బతకడం నేర్పిన గురువు, హాయిని రుచి చూపిన దైవం ‘! అలేనా అనసోవ ‘అమ్మ’ అద్భుత రూపాన్ని ఎంత అద్భుతంగా తన ఫోటోలో బంధించిందో!
*****