నారీ”మణులు”
వింజమూరి అనసూయాదేవి- 4
-కిరణ్ ప్రభ
అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే వీరి పాట రికార్డ్ అయింది. బాలమేధావి. స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం వీరి కుంది. మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన ప్రముఖ దేశభక్తి గీతం “జయజయజయ ప్రియ భారత” పాటకు బాణీ కట్టింది వీరే. 1930 -50 దశకాలలో కృష్ణశాస్త్రి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, నండూరి మొదలైన మహా కవుల గేయాలకు బాణీలు కట్టి చెల్లెలు సీతతో కలిసి పాడారు.