

పేరు: శ్రీనివాస భరద్వాజ కిశోర్ కలం పేరు: కిభశ్రీ (డా।।సినారె గారి ఆశీస్సులతో) వృత్తి: 17 సం।।లు భారత దేశంలో వైజ్ఞానికునిగానూ, గత 23 సం।।లుగా అమెరికాలో ఐటీ మానేజ్మెంట్ లోనూ పని చేసి కళారంగంలో కృషి ద్విగుణీకృతం చేసేందుకు పదవీవిరమణ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. తెలుగులో మహాత్మా గాంధీ మీద ఒక చక్కనైన గేయాన్ని రచించి, సంస్కృతాంగ్లాలను మేళవించి, స్వరపరచి, సింఫానిక్ ఆర్కెస్ట్రేషన్ సమకూర్చి 62మంది భారతీయులు, 261 మంది అమెరికన్లుగల ఒక కోరస్ ను సమన్వయపరచి, ప్రపంచ విఖ్యాతి చెందిన డా।।ఆండ్రె థామస్ సహకార కండక్టరుగా అమెరికా టాలహాసీ నగరంలో కండక్ట్ చేసి కచేరీ చేయించిన తొలి, ఏకైక తెలుగు వాడు, జాతి గర్వించదగ్గవాడు, డా।। సి. నారాయణరెడ్డిగారి ఆశీస్సులతో “కిభశ్రీ” అన్న కలంపేరుతో రచనలు చేసే రచయత, గాయకుడు, సంగీత దర్శకుడు, శ్రీనివాస భరద్వాజ కిశోర్. ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన చాలా గేయాలను, నాటకాలను బృందాలు ప్రదర్శించాయి. యూట్యూబులో “srinikishore” చానల్ లో కొన్ని మచ్చు తునకలు వున్నాయి.