జయశ్రీ నాయుడు
–సి.వి.సురేష్
ప్రముఖ రచయిత్రి, జయశ్రీ నాయుడు గారిని నెచ్చెలి కి పరిచయం చేయాలని, ఆమెతో కాసేపు మాట్లాడాను…
ఆమె గురించి ఆమె మాటల్లోనే విందాం..!
“నా పేరు జయశ్రీ నాయుడు.
అమ్మ పేరు సీతారత్నమ్మ, నాన్నగారి పేరు బ్రహ్మా రావు. నాన్న గారికి ఆంధ్రా స్పెషల్ పోలీస్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా ఉద్యోగం. అందువలన ఉమ్మడి ఆంధ్రా రాష్ట్రం లోని కాకినాడ లో కొన్నాళ్ళు, కర్నూల్ లో కొన్నాళ్ళు ఉద్యోగ పరం గా వుండవలసి వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత చివరగా పటాంచెర్వు లో ఒక ప్రైవేట్ కంపెనీ లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పదవిలో దాదాపు పదిహేను సంవత్సరాలు పని చేశారు.
పుట్టింది కర్నూలు అయినా, నాన్న గారి ఉద్యోగ రీత్యా అన్ని వూళ్ళు తిరగడం వలన అన్ని ప్రాంతాల ఆచార వ్యవహారాలకు అలవాటు పడటం జరిగింది. నేటివ్ ప్లేస్ ఏమిటన్నది పెద్ద విషయం గా అనిపించకపోవడం వెనుక కారణం కూడా ఇదే అనుకుంటాను. ఎక్కడైనా ఎవరినైనా అర్థం చేసుకోవడానికి ఈ ప్రాంతీయ భేదం లేని మనస్తత్వమే చాల చోట్ల ముఖ్యం గా ఉద్యోగపరం గా నాకు ఉపయోగ పడింది.
కాకినాడ లోని సెంట్ ఆన్స్ స్కూల్ లో చదువుకున్న మూడు సంవత్సరాల కాలం మనసులో చాలా విషయాలకి పునాది వేసింది. గుంటూరు లో ఎమ్మే వరకు చదివాక, స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగిగా చేస్తున్న మురళీ కృష్ణ గారితో వివాహం, ఆ తరువాత హైద్రాబాద్ లోని హిందూ మహిళా కళాశాలలో ఆంగ్ల భాషా బోధకురాలిగా ఉద్యోగ ప్రయాణం మొదలయ్యింది. ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ బోధించడం వృత్తి పరంగా సంతృప్తినిస్తున్న విషయం.
ఆంగ్ల సాహిత్యం తో పరిచయం, అంతకు ముందే తెలుగు సాహిత్య పఠనం సాహితీ లోకం వైపు అడుగులు వేయించాయి. ఆంగ్ల సాహిత్యం లో కీట్స్, షెల్లీ, బైరన్ ల కవిత్వం , షేక్స్పియర్ నాటకాలు అంటే బాగా ఇష్టం. తెలుగులో శేషేంద్ర కవితా శైలి రాయడం వైపు ప్రేరేపించింది. అజంతా, మో, చలం, రవింద్రనాథ్ టాగోర్ అనువాద కవితలు, సరోజిని నాయుడు ఆంగ్ల కవిత్వం పదే పదే చదువుకునే రచనలు. కవితలు రాయడం, ఇతర కవులు, కవయిత్రులతో పరిశీలనాత్మక పరిచయాలు ఏర్పడటం జరిగింది. తరువాత వివిధ పత్రికలలో కవితల ప్రచురణ, ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం లో కవితా పఠనం, ఆంగ్ల కవితా పఠనం నుండి ఆంగ్ల కవితల వైపు అడుగులు వేసి, డైలాగ్ విత్ డైరీ అన్న సంకలనం వెలుగు చూసింది.
ఇవీ క్లుప్తంగా నా… సాహితీ ప్రయాణ సరిగమలు!”
***
జయశ్రీ నాయుడు –“నేనే నా నౌక” అనువాదం గురించి:-
తన మానసిక ఏకాంతం లో తనను తాను దర్శించుకోవడం మనిషి నైజం. అప్పుడే, అనుభవాలు…. ఊహలు… ఆశలు మొలకెత్తడం అంతే సహజం.
మనిషి అంతః సంఘర్షణ పై కవయిత్రి ‘జయశ్రీ నాయుడు” రాసిన చిక్కటి విభిన్న కవిత ఇది.
మనిషి ఉన్నన్నాళ్ళు సంఘర్షణ ఉంటుంది.
ఈ కవిత ను అనువదించే సమయం లో కవయిత్రి తో మాట్లాడాను. ఆమె కవితలోని కవితా వాక్యాలను, ఏ అర్థం లో ఆ పదం తీసుకొన్నది ఎలాంటి రిఫరెన్స్ చూసుకోకుండా చెప్పారు..
అనువాదం చేసే సమయం లో ఒరిజినల్ కవిత లోని ‘విషయం’ తో పాటు , ఆ ‘ శైలి’ కూడా పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుంది. కవిత లోని idioms , మెటఫర్స్ ను అలాగే ఒడిసి పట్టడం చాల కష్టతరమనిపిస్తుంది, ఎందుకంటే, ఒక్కో భాషలో ఒక్కో రకమైన structural difference ఉంటుంది. చేయి తిరిగిన కవుల కవిత్వ అనువాదం విషయాని కొస్తే, poetic devices embellish literary language, which makes it a challenging task for the translator to carry it over to another language. కవితలో అధిక భాగం allusions (సూచితాలు) ప్రతీకలు, ఆ కవిత మీటర్, సంభాషణల స్వరూపం ఉంటే, అనువాదం లేక అనుసృజన మరింత కష్టం అనిపిస్తుంది.
ఈ కవిత విషయానికొస్తే.. ముఖ్యంగా: “నా వెలుగూ నీ పులుగే కదా..” అన్న వాక్యం, నాకు అంతు చిక్కని మిస్టరీ అయ్యింది. కవయిత్రినే అడగాల్సి వచ్చింది. పాత కాలపు ఆ ప్రాంతపు పదం “పులుకే” అని, అంటే, బంగారు సహజంగానే మెరుస్తుంటుంది, అలా మెరిసే బంగారుకే, మెరుపు ఎక్కించడం పులుకు (పులుగు) అని అంటారని, ఆ అర్థం తో ఆ కవిత లో ఆ వాక్యం తీసుకొన్నానని చెప్పారు. అంటే, “ఆమె వెలుగు కూడా అతడందించిన మెరుపే” అన్న అర్థం. ఆ వాక్యం లో సొగసు అద్భుతం. అక్కడ, “ my glare is your radiance, it is so!” అని అనువదించాను. ఆ వాక్యం లో కూడా చివరన “ కదా” అని పాఠకుడిని అడిగినట్లు అనిపిస్తుంది. అక్కడా స్వేచ్ఛానువాదం అవసరమైంది.
అలాగే,
“ ఎన్నో మనసుల పాత్ర ఉంది
అనుభవాల ఉలి దెబ్బలున్నాయి.
ఎన్నో హృదయాల ఓదార్పు ఉంది
ఈత నేర్పినకాల ప్రవాహం ఉంది.:
ఈ వాక్యాలు డైరెక్ట్ sentences అయినప్పటికీ, ఇందులో రిథమ్ ఉంది.
ఆ రిథం అనువాదం లోకి తీసుకు రావడానికి పదాలను వెతుక్కోవాల్సి వచ్చింది.
దీన్ని చివరాఖరుకు
There, a role of lots of minds
There, the flogs of chisel
There, a Lot of heart full consoles
There, the preaches of time to live…! అన్న రూపం లో అనువదించాను.
అలాగే, “లయం కావాలి”
“ఆలయం కావలి” అన్న పదాలకు జయశ్రీ గారు చెప్పిన లోతైన తాత్విక అర్థం ఆశ్చర్య పరిచింది. రెండే చిన్న వాక్యాలు అయినా, మనిషి అతడు ఆ లయ ను పొందిన తర్వాత, పవిత్ర స్థితి కి చేరుకొంటాడని అని అర్థం. ఆ రెండు వాక్యాలను
“Need a joyful rhythm
And, to become a holiest sanctum!”
ఇలా అనువదించాల్సి వచ్చింది.
***
జయశ్రీ నాయుడు || నేనే ౼నా నౌక||
ఆంగ్లం లోకి స్వేచ్ఛానువాదం :సి.వి. సురేష్
|| myself…. is my ferry ||
If I see..
through the pages of my dairy…
Lot of fruitions walk over into me…
There, a role of lots of minds
There, the flogs of chisel
There, a Lot of heart full consoles
There, the preaches of time to live…
..
In the cracks of faith and unfaith
To the trapped faithful canopy…
Letting the soul bloom on its own…!
..
Sticking the time viscid to every branch
Showering the thoughts of rain…
Like the sky as evidentiary state…
Counting the each step… myself
..
The inner mind is deepest pacific of all…
the dualism of swinging fishes
becoming thoughts swallowed by ignorant whales
started like goals by ferries…
lot of hubbub and it’s an ocean of fire… !!
..
Need a joyful rhythm
And, to become a holiest sanctum!
..
In the row of rhythmic feelings…
Should become a sand less ocean
..
Compile the aglow of stars
Transforming the eyes as milky way
And, I perusing closely
..
You are afire in a Dazzle
my glare is your radiance, it is so!
..
Never halt journey :
nevertheless change my joyous life
Glee and regret are my heart beats…
..
The greedy waves across the sea..
lightning journey of Tearless eyes
..
Myself is my ferry : And, my faith is my sail….!
I am getting initiated
Making comfort of myself..
for the,
never ending rapport with me…
***
ఒరిజినల్ తెలుగు కవిత …
జయశ్రీ నాయుడు || నేనే … నా నౌక ||
డైరీలో పేజీలు తిప్పి చూసుకుంటే
నాలో నడిచి వచ్చిన అనుభవాలు
..
ఎన్నో మనసుల పాత్ర ఉంది
అనుభవాల ఉలి దెబ్బలున్నాయి.
ఎన్నో హృదయాల ఓదార్పు ఉంది
ఈత నేర్పినకాల ప్రవాహం ఉంది.
..
నమ్మకం అపనమ్మకాల పగుళ్ళలో
ఇరుక్కున్న విశ్వాసపు పందిరికి
ఆత్మని పూయించాలని
..
ఒక్కో కొమ్మకూ కాలపు చిగురు అతికిస్తూ
ఆలోచనల వర్షం కురిపిస్తూ
ఆకశంలా సాక్షీ భూత స్థితికి
ఒక్కో మెట్టు లెక్కిస్తూ.. నేను
..
అంతరంగం అన్నిటికన్నా లోతైన పసిఫిక్
ముందు వెనుక ఊగిస బాటలు చేపలు
తలపులై మింగేసే అజ్ఞాన తిమింగలాలు
గమ్యాలుగా బయలు దేరిన చిట్టి పడవలూ
ఎంతో కోలాహలం హాలాహల సముద్రమిది
లయం కావాలి
ఆలయం కావలి
భావాలన్నీ లయించే తీరులో
ఇసుక రేవులూ కానని సముద్రం అవ్వాలి
..
చుక్కల వెలుగుపోగు చేసి
పాలపుంతే కళ్ళు చేసుకుని
విప్పార్చి చూస్తున్న.
..
అఖండంగా వెలుగుతున్నావు
నా వెలుగూ నీ పులుగే కాదా
..
ప్రయాణం ఆగదు, జీవన వినోదం మారదు
మోదఖేదాలు గుండె చప్పుళ్లే
..
ఆశల అలలు దాటినా సముద్రం
కనీళ్ళు లేని కళ్ళు మెరిసే ప్రయాణం
..
నేనే నా నౌక – విశ్వాసమే నా తెరచాప
నన్ను నేను సిద్దపరచుకుంటున్న…
నాతో నిరంతర చెలిమికి అవకాశంగా మలుచుకుంటున్న..
*****
సి.వి. సురేష్ : కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. సాహితీ ప్రేమికులు. 2013 నుంచి సాహిత్య వ్యాసంగంలో ఉన్నారు. చారిత్రక ప్రతీకలు అరుదైన సిమిలీలతో సాగే వీరి కవితలు పాఠకహృదయాల ఆదరణ పొందాయి. అనుసృజనలు వీరి ప్రత్యేకత. ఇప్పటివరకూ డెబ్భై కు పైగా కవితలు తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి.. ఎనభై పై చిలుకు కవితలు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. అందులో క్లిష్టమైన సూఫీ పోయెట్రీ సంగం పోయెట్రీ కూడా ఉన్నాయి. కవిసంగమం ఫేస్బుక్ గ్రూప్ లో ప్రతి బుధవారం “కవిత్వానువాదం” శీర్షిక, ప్రజాపాలన పత్రిక ‘విభిన్న’ సాహిత్య పేజీల నిర్వహణ, రస్తా మరియు సారంగ వంటి ప్రముఖ వెబ్ మేగజైన్స్ లో కాలమ్స్ నిర్వహిస్తున్నారు.
The interview and inner view of the poetess established well in this write-up. Good poem selection for translation. Congratulations Sir!
the flogs of chisel
మూల భాషలోని భావంతోపాటు
ఆ పదాల సొబగు అచ్చు గుద్దినట్లు
అనువదించడం it added new dimensions..నాలో నడిచి వచ్చిన అనుభవాలు అన్న ఎత్తుగడనుంచే
జయశ్రీ నాయుడు గారి అద్బుతమైన కవిత
ఆత్మని చక్కగా lot of frutitions walk over into me అంటూ ఆరిజిన్ భాషా భావాన్ని
ఆంగ్లంలోకి అంతే గొప్పగా అనువదించారు ⚘⚘⚘⚘మీ ఇరువురికీ🙏🙏
Ramesh గారు చాలా సంతోషంగా ఉంది.. మీ వ్యాఖ్యానం..ధన్యవాదాలు
చదివాను, మీ అనువాద సంగతులు ఆసక్తికరం.
మంచి కవిత ఎన్నుకునారు.
మీ ఇద్దరికీ అభినందనలు
రామారావు గారు..ప్రత్యేక ధన్యవాదాలు
అద్భుత అనుసృజన తో ఓ మంచి కవియిత్రిని పరిచయం చేశారు. భావ సాంద్రత కలిగిన వారి కవనానికి మీ ట్రాన్సిలేషన్ చాలా చాలా బాగుంది.ఇరువురికి అభినందనలు💐💐
మాధవి…మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు