నారీ “మణులు”
టంగుటూరి సూర్యకుమారి- 2
-కిరణ్ ప్రభ
టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925లో రాజమండ్రిలో జన్మించారు. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి తమ్ముడు టంగుటూరి శ్రీరాములు గారి సుపుత్రిక. 1937లో సినీరంగ ప్రవేశం చేసారు. సూర్యకుమారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించారు. 1952లో ఆమె తొలి మద్రాసు అందాలసుందరి (మిస్ మద్రాసు) గా ఎంపిక అయ్యారు. కచ్చేరీలు, లలిత గీతాలతో పాటూ, సినిమాల్లోనూ పాటలు పాడారు.
వీటన్నిటితో బాటూ చదువుమీద దృష్టి కేంద్రీకరించి ప్రైవేటుగా కేంబ్రిడ్జి సీనియర్ పరీక్ష వ్రాసి ప్రథమశ్రేణిలో పాసయ్యారు. 1960 దశకంలో లండను లో ‘ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ సంస్థను స్థాపించారు. 1979లో రాజ్యలక్ష్మి అవార్డు పొందారు.
******