పునాది రాళ్లు-13
-డా|| గోగు శ్యామల
కుదురుపాక రాజవ్వ కథ
అదో కల్లోల దశాబ్దం . గడిచి యాబై నాలుగు సంవత్సరాలు ఆ తరువాత ఆ భూమంతా నీటి పారుదల ప్రాజెక్టు కింద మధ్య మానేరు నది లో మునిగిపోయింది. భూమి కథ అలా ముగిసింది. ఈ భూమి కథలో కుదురుపాక గ్రామ ప్రజల జీవితాలతో సహా రాజవ్వ జీవితం కలసిపోయి ఉన్నది. ప్రత్యేకంగా చెప్పాలంటే రాజవ్వ కథలో భూమి కథ, భూమి కథలో రాజవ్వ కథ మిళితమై ఉన్నాయి. ఇంత దాక వచ్చినా
రాజవ్వకు న్యాయం చేయడంలో, రక్షణ కల్పించడంలోనూ, భూమి దక్కడంలో పాలక పక్షాలు, న్యాయ వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం, మీడియాతో సహా అన్ని వ్యవస్థలు విఫలమై నాయనే చెప్పాలి. ఇక ఈమె ఏ భూమి కోసమైతే పోరాడిందో దాని సర్వే నంబర్ 504 ఐతే 110 ఎకరాల భూమి, ఈ కోవకు చెందినవి మరికొన్ని సర్వే నంబర్లు ఉన్నాయి. ఈ కథలని ఇక్కడ చెపితే ఒడువని కథలే అవుతాయి. మధ్యలో యస్సిలు కొంత కాలం పాటు భూమిని సాగు చేసుకున్నప్పటికీ వారికీ ప్రభుత్వం పట్టాలీయలేదు. పైగా ఎస్సిల మధ్యనే చీలికలు తెచ్చి తగాదాలను పెట్టి పట్టాలివ్వకుండా కాలం గడిపింది . 2004సం.లో మాదిగ దండోరా ఉద్యమం సహాకారంతో ఉపాధి కోసం ఆందోళన చేసినప్పటికినీ, చివరగా మలుపు తిరిగిన ముగింపు ఏమంటే మానేరు నదిలో కుదురుపాక గ్రామం దాని చుట్టూ ఉన్న భూములు ఎస్సిల భూమితో సహా మునిగిపోయినయి. ఇగ భూమి కథ ఒడిసింది అనే చెప్పాలి. రాజవ్వ మరణించిన కొన్ని రోజులకే ఈ భూములు మునిగి పోవాడం జరిగింది. ఆ రకంగా గ్రామానికి చెందిన అనేక సజీవ గాధలు పోరాట చరిత్రేoబడి నడిచిన అనేక కథల జ్ఞ్యాపకాలు కూడా అక్షరీకరిస్తే తప్పా నదిలో మునిగిపోయినట్లేనని చెప్పాలి. ఇదిలా ఉంటె, ఆనాడు రాజవ్వతో పాటు కుదురుపాక ప్రజలు చేసిన పోరాటం అక్షరీకరణకానీ దృశ్శ్హీకరణ కానీ దాదాపుగా నోచుకోలేదనే చెప్పాలి. నిజానికి ఈ చరిత్రని వివిధ కోణాలలో రాయగలిగి ఉండినట్లైతే నేటి అనేక వర్తమాన సమస్యలను ప్రతిబింబిoచగలిగి ఉండే తాత్విక పునాది కలిగిఉంది. కుల హింసా విధానాలను, లైoగిక హింసాదిపత్య సంస్కృతీ , రాజకీయాలను, భూస్వామ్య ఆధిపత్య పాలనా విధానాలను ఏ రూపం వచ్చినా అవలీలగా అర్థం చేసుకునే అనుభవ జ్ఞ్యానాన్ని చ్చిందనే చెప్పాలి. ఐతే, హింస అత్యాచారాలు, బాధితులు అన్న కోణం మేరకు ఈ చరిత్ర నమోదు కాగలిగింది. కనుకనే కొన్నికొత్త చట్టాలు రూపుదిద్దుకోవడానికి, అంతకు ముందు ఉనికిలో ఉన్న చట్టాలు సవరణ జరగడానికి పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ కారణం కాగలిగిందనీ చెప్పాల్సిందే. అది 1989 లో చేయబడిన ఎస్సే ఎస్టీల ఫై జరిగే అత్యాచారాలను నిరోదించే చట్టం కావచ్చు, అది నిర్భయ చట్టంగా సవరణ చేయబడిన లైంగిక అత్యాచార నిరోధక చట్టం కావచ్చు ననే నేపథ్యములో చూడవచ్చు. రాజవ్వ పోరాటం 1970 దశకంలో మొదలై తన వయసు 98 వ ఏటా చివరి ఘడియలు 18. 8. 2016 వరకు గల సుదీర్ఘ పోరాట అనుభవం కొత్త తరాలకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. వివిధ అస్తిత్వాలను తెలియజేస్తుస్తుంది. ఆ రకంగా, నల్లజాతి సిద్ధాంత కర్త కింబర్లీ క్రిన్ షా తయారు చేసిన ఉప అస్తిత్వాలు (ఇంట్రసెక్షనాలిటీ) సిద్ధాంతం లో జాత్యంకారం, వర్గం, జండర్ అస్తిత్వాల సంబంధిత సిద్ధాంత వెలుగులో ఈమెను చూడాల్సి ఉంది. అంతేకాక ఇందులోని అస్తిత్వాలను పరిశీలింస్తూనే పరిధులను, పరిమితులను దాటిన కులం తాలూకు వివిధ అస్తిత్వాలు రాజవ్వాలో కనిపిస్తాయని గమనించాలి. అవి..1 మాదిగ కమ్మూనిటీకి చెందిన వ్యక్తిగా, స్త్రీగా 2, ప్రకృతిని రక్షించే నైపుణ్యమున్న పరియావరణ వేత్తగా, 3, వ్యవసాయ వాటం తెలిసిన పనిమంతురాలుగా 4, గడిలో వెట్టి గాయిధగా 5, వ్యవసాయ కూలీగా 6, తన జీవితంలో ఒకసారైనా కనీసం ఒక ఎకర భూమికి పట్టాదారు కావాలనే ఆకాంక్ష కలిగిన రైతు మహిళగా 7, కుల నిచ్చెన అసమాన అంటరాని వెలివాడ స్త్రీగా , 8, భూస్వామ్య పితృ స్వామ్య అధికారానికి వ్యతిరేకంగా ఉద్యమించిన గొప్ప నాయకురాలు కామ్రేడ్ రాజవ్వ గా 9. పోరాటంలో ఎస్సి బీసీ ప్రజల ప్రాతినిధ్యంగా నిలబడిన నాయకురాలిగా 10. అత్యున్నతమైన గౌరవం గలిగిన , అంత్యంత దైర్యం కలిగిన స్త్రీగా వాడా ఊరు, జిల్లా , రాష్ట్రం మంతటా పేరొందినదిన ప్రజా నాయకురాలిగా 11, భార్యగా, గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా 12, లైంగిక అత్యాచార బాధితురాలుగా రాజవ్వ యొక్క అస్తిత్వాలను చూడవచ్చు. అంతే కాక రాజవ్వ అస్తిత్వాన్ని చూడాలి అంటే ఆమె యొక్క కమ్యూనిటీ , కుటుంభం, వ్యవసాయం, పచ్చదనం తదితర అంశాలను ప్రాతిపదిక చేసి విశ్లేషించాలి. కనుక నల్లజాతి స్త్రీ అస్తిత్వం తో కొన్ని అంశాలతో పోలిక ఉన్నప్పటికిని అదనపు విషాలను చూడవచ్చు. అన్యాయాలకు , అత్యాచారాలకు గురయ్యే బాధితులుగా వారిని గుర్తిస్తూనే ఉత్పత్తి నైపుణ్యమున్న వ్యక్తిగా కూడా పరిగణించడం అనివార్యం అని రాజవ్వ జీవితo నేర్పుతుంది. ఈ నేపథ్యంలో ‘ పరిజ్ఞనాన్ని నైపుణ్యాన్ని నిరాకరించడం లేదా నిర్లక్ష్యం చేయడం ద్వారా కులవ్యవస్థ యొక్క అసమానత్వాన్నిఆధిపత్యాన్నినిలబడుతుందని డా ఉమాచక్రవర్తి తన పుస్తకంలో పేర్కొన్నది . రాజవ్వ సుదీర్ఘ పోరాట జీవిత చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ప్రపంచంలోని ప్రముఖ లెజెండ్ యోధురాలైన సోజోర్న ట్రూత్ మనకు జ్ఞప్తికి వస్తుందిలా .. 1. రాజవ్వ కులదోపిడికి, అంటరాని తనానికి గురైన బాధితురాలీమె, సోజోర్న ట్రూత్ జాతి వివక్షతకు, బానిసత్వానికి గురికావడం తెలిసిందే. 2. దళితుల మిగితా పేదప్రజల హక్కులకోసం, భూమి హక్కుకోసం రాజవ్వ పోరాడింది. సోజోర్న ట్రూత్ నల్ల జాతి ప్రజల హక్కులకై పోరాడింది. 3. అతి భయంకరమైన అంటరానితనం అణిచివేతను వెట్టిచాకిరి జీవితం నుండి ఉద్యమించి భూమి హక్కు కోసం నిలవడిన రాజవ్వను కేవలం దళిత స్త్రీ ఐనందుకే మనువాదులు అత్యాచారం చేసి అతిదారుణంగా అవమానించారు. అయినా ఎం ఎల్ పార్టీ కులసమస్యను ప్రమాదకరమైనదిగా గుర్తించలేదు. పైగా రాజవ్వను రేప్ విక్టిమ్ గా తప్ప నాయకురాలిగా చూడలేదు. సోజోర్న ట్రూత్ ను నల్ల జాతి ఉద్యమం ఓ లెజెండ్ గా గుర్తించింది. అందుకే భారత దేశంలోని కుల వివక్ష అంటరానితనం జాత్యంకారపు బానిసత్వం కన్నా అతి భయంకరమైoది క్లిష్టమైంది కుడా బాబాసాహెబ్ అంబేద్కర్ తేల్చి చెప్పాడు
****
డా|| గోగు శ్యామల గత 20 సంవత్సరాలనుండి నుండి దళిత సాహిత్యం మరియు దళిత స్త్రీల సాహిత్యం పై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా వెలువరించిన సంకలనాలు:- “నల్లపొద్దు” యాభై నాలుగు మంది దళిత స్త్రీల సాహిత్యపు సంకలనం, (2002), ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తండ్రి నయం- కథా సంకలనం (2014), “నేనే బలాన్ని” తొలి దేవాదాయ శాఖ మంత్రి టి. ఎన్ సదాలక్ష్మి జీవిత చరిత్ర, వాడపిల్లల కథలు. సహా సంపాదకత్వ సంకలనాలు:- “నల్లరేగడి సాళ్ళు. “(2006), Oxford Anthology of Telugu Dalit writing (2016). అనువాదం ayinn కధలు Father may be an Elephant mother only a small bosket but మొ.వి. మౌఖిక సాహిత్యం, గాధలు, తాళపత్ర గ్రంధాల గురించి పుస్తకాలు రాస్తున్నారు.