విషాద నిషాదము

అష్టమ భాగము – స్వరాంజలులు

-జోగారావు

పద్మ భూషణ్ డాక్టర్ అన్నపూర్ణాదేవి మృతికి భారత రాష్ట్రపతి తో సహా అనేక సంగీత విద్వాంసులు, సంగీత ప్రియులు, దేశ విదేశ పత్రికలు నివాళులు అర్పించేరు

భారత రాష్ట్ర పతి శ్రీ రామ నాథ్ కోవింద్ తమ శోక సందేశములో

“ Sorry to hear the passing of classical musician and sur bahar

exponent Annapurna Devi. A legatee of her father and Guru

Baba AllaauddIn Khan, she was a rare talent and a generous

teacher. Her life will always serve as a poignant inspiration for

women artistes. “

న్యూ యార్క్ టైమ్స్ తమ నివాళిలో

“ Annapurna Devi, Acclaimed but reclusive Indian Musician , Dies at 91”

అని జోహారులు అర్పించేరు.

ది గార్డియన్ దైనిక పత్రిక తమ నివాళి లో అన్నపూర్ణాదేవి జీవిత చరిత్ర వ్రాస్తూ కొనియాడేరు.

అమెరికన్ వార్తా పత్రిక NPR శ్రీమతి అన్నపూర్ణాదేవి గారికి తమ నివాళి ఘనంగా సమర్పిస్తూ, ఆవిడ జీవిత వివరాలను పూర్తి పేజీ లో ప్రచురించేరు.

అన్నపూర్ణాదేవి మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించేరు.

ఆవిడ మృతిని ప్రముఖ వార్తగా ప్రచురించిన దైనిక పత్రికలలో కొన్ని

The Telegraph UK, The Times UK, The Globe and Mail,

Maris World India ,

The Hindustan Times, The Times of India, Indian Express,

The Hindu, India Times, National Herald.

అన్నపూర్ణాదేవి సోదరుడు ఆలీ ఆక్బర్ ఖాన్ తన సోదరి విద్వత్తు గురించి చెబుతూ, తననూ, ప్రముఖ బాన్సురీ విద్వాంసులు పన్నాలాల్ ఘోష్ ను, రవిశంకర్ ను త్రాసులో ఒక ప్రక్క న తన సోదరి అన్నపూర్ణాదేవిని రెండవ ప్రక్కన ఉంచితే, త్రాసు ఆవిడ ప్రక్కనే ఒరుగుతుంది అని చెప్పేరు.

ప్రముఖ హిందుస్తానీ కర్ణాటక గాయకులు ఉస్తాద్ అమీర్ ఖాన్ అన్నపూర్ణాదేవి గురించి

ఆవిడ తన తండ్రి ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ విద్వత్తులో 80 శాతము తలపించితే, ఆలీ అక్బర్ ఖాన్ 70 శాతము, రవిశంకర్ 40 శాతమే తలపిస్తారు అని చెప్పేరు.

ఈ రెండు ప్రశంసలను బట్టి అన్నపూర్ణాదేవి గురించి సంగీత విద్వాంసుల అభిప్రాయము తెలుసుకున్న మీదట ఆవిడ సంగీత మేరు శృంగమని తెలుస్తుంది.

అన్నపూర్ణాదేవి రవిశంకర్ ల వైవాహిక జీవితములోని కొన్ని సంఘటనల ఆధారముగా 1973 సంవత్సరములో అమితబ్ బచ్చన్ జయ బాధురి నాయకా నాయికలుగా అభిమాన్ సినీమా వచ్చింది.

అలాగే, 2007 వ సంవత్సరములో సుహైల్ టటరి దర్శకత్వములో ప్రియా గిల్, సందీప్ కులకర్ణి, దీపక్ కాజిర్ నటించిన భైరవి చిత్రము కూడా వచ్చింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.