చిత్రం-15
-గణేశ్వరరావు
కళా హృదయం కలవారు తమ పరిసరాలలో వున్న వాటి నుంచి తరచూ సృజనాత్మక ప్రేరణను పొందుతుంటారు. వాటిని తమ కళా ప్రక్రియలలోకి అనువదించడానికి ప్రయత్నిస్తుంటారు.
రష్యన్ ఫోటోగ్రాఫర్ క్రిస్టినా తన కెమెరా తీసుకొని ప్రపంచం అంతా పర్యటిస్తుంటుంది. ఫ్యాషన్, ఆర్కిటెక్చర్ రంగాలు కలిసే వుంటాయి. క్రిస్టినా తన ట్రావెల్ ఫోటోగ్రఫీ లో ఆ రెండూ ఎలా కలిసిపోతాయో చూపిస్తుంది.
ఆమె అందమైన రూప చిత్రాలను ఎన్నో తీసింది, ఆ సిరీస్ లో సుందరమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో గంధర్వకాంతల దుస్తుల్లో ఉన్న వనితలను మోడల్స్ గా వున్నారు, లోకేల్స్ లోని ఎసెన్స్ ని ఆమె ఫోటోలు పట్టి చూపిస్తాయి. అమ్మాయిలు ధరించిన దుస్తుల రంగులకు సరైన నేపథ్యంను క్రిస్టినా ఎప్పుడూ ఎన్నుకుంటుంది, రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది. లోకేల్స్ లోని ఎసెన్స్ ని ఆమె ఫోటోలు పట్టి చూపిస్తాయి, చూపరులను అలౌకిక ఆనందంలో ముంచి వేస్తాయి, ఆమె తీసిన ఫోటోలు కంటికి ఎంత సుఖమయంగా కనిపిస్తాయో అనడానికి ఒక ఉదాహరణ – వాటిని చూస్తూ అమెరికాలోని కొందరు ధ్యానంలో మునిగిపోయారట!
*****