జ్ఞాపకాల సందడి-14
-డి.కామేశ్వరి
The sky is pink …. ఈ మధ్యే ఈ అద్భుతమైన సినిమా చూసా.
ఇంత గొప్ప సినిమా ఎలా మిస్ అయ్యానో, పేరుకూడా విన్న గుర్తు లేదు.
మొన్న రోహిత్ “తప్పకుండా చూడు” అంటే సరే అనుకుని పెళ్లి హడావిడి అయ్యాక netflix లో చూస్తే కనపడలేదు. మళ్లీ మర్చిపోయి నిన్న వెతికితే దొరికింది.
సినిమాకాదు జీవితం చూస్తున్నంత సహజంగా ప్రతి సీను, ప్రతిమాట, నటన… ఏం చెప్పాలి?
ప్రియాంకచోప్రా ,ఫరనక్తర్, భార్యాభర్తలు. కొడుకు, కూతురు టీనేజ్ పిల్లలు .
ఇది ఒక real story ఆధారంగా తీసిన సినిమా. ఢిల్లీలో మాములు సంసారుల కథ. కూతురు ఆయిషా చెపుతున్నట్టు జరుగుతుంది. కొడుకు తరువాత తాన్యా అనే కూతురు పుట్టి ఏడాదిలోపలే చనిపోతుంది. ఆ పాపకి కి మిలియన్స్ లోఒకరికి ఎక్కడో వచ్చే జబ్బు . s .c .i .d .అంటే sevear combined imune defficency అంటే ఏ ఇన్ఫెక్షన్ రాకూడదు, వస్తే తగ్గదు, అతిజాగ్రత్తగా మందులు ఇంజెక్టయిన్లు ,oxgen ,ఇంట్లో ప్రతిదీ అతిశుభ్రంగా చేతులు కడుక్కోకుండా పాపని ముట్టుకోకుండా ఐసోలేటెడ్ గా ఉంచాలి.
ఇవన్నీ వాళ్ళకి ముందు తెలియదు, తెలుసుకునే వరకు పిల్ల దక్కదు. అపుడు డాక్టర్లు టెస్ట్ లు చేసి తేల్చింది పైన చెప్పినజబ్బు ఆ తల్లితండ్రులిద్దరిలో ఏదో rare faulty gene వల్ల అలాటి జబ్బు వస్తుంది. అంచేత ఆడపిల్ల మాత్రమే క్యారీ చేసింది కనక మరోసారి ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోమని సలహా ఇస్తారు.
కథ మూడోసారి ఆక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ రావడంతో ఆరంభం అవుతుంది.
ఒకరినొకరు blame చేసుకుంటూ, abortion చేసుకోవాలని మొగుడు, పాపం తాన్యా లేని లోటు పూడ్చుకుందాం, అలాగే అవుతుందని ఏముంది… అంటూ రకరకాల డిస్కషన్స్ ఆఖరికి పిల్లని కంటారు.
ఆయిషా ముద్దులు మూటకట్టే అందమైన కూతురు. ఈసారి ముందునించి జాగ్రత్తగా వైద్యం చేయించాలని కష్టపడి ఎలాగో లండన్ తీసికెడతారు.
అక్కడ డాక్టర్స్ అదే చెప్పి బోన్ మారో ఎక్కించి కొన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇమ్మ్యూనిటి పెరిగి బతికే ఛాన్స్ ఉందంటారు. అప్పటినించి వాళ్ల కష్టాలు ,ఆరాటాలు ,అవస్థలు , ప్రతిరోజు దినదినగండంగా బతుకుతూ మొగుడు, కొడుకు ఇండియా వెడితే పిల్లని పెట్టుకుని బంధువుల ఇంట్లో వుండి వైద్యం చేయిస్తూ తల్లి , ప్రతిరోజూ ఫోన్ లోవిషయాలు చెప్పుకుంటూ కొడుకుని వదలలేక.
తల్లి పిల్లాడిని చూసుకోలేక తండ్రి ఆఖరికి ఏదోలా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అందరం ఒకేచోట బతకాలని నిర్ణయించుకుని లండన్ లోకాపురం మొదలు. పగలు మొగుడు ఉద్యోగం, రాత్రిభార్య వుద్యోగం చేస్తూ అనుక్షణం ఆ పిల్లని కాపాడుకుంటూ వాళ్ల అవస్థలు చూస్తే మనసు కరిగిపోతుంది.
ఆయిషా అందమైన టీనేజ్ గర్ల్ , అబ్బాయి కాలేజ్ లెవెల్ కివచ్చాక కొత్త సమస్యలు. ఆర్ధికంగా తండ్రి మంచిస్థితికి వచ్చిన ఎదిగే అమ్మాయి అందరిలా ఆడుతూ పాడుతూ వుండాలనే కూతురు కోరికలు వీలయినంతవరకు తీరుస్తూ , సరదాలు తీరుస్తూ స్నేహితులని పిలిచి పార్టీలు, పుట్టినరోజులు, పికానిక్ లు వీలయినంతవరకు సంతోషంగా ఉంచాలనే తల్లితండ్రుల ప్రయత్నం, ఎదిగే అమ్మాయి తనకొచ్చిన జబ్బు తగ్గేదికాదని తెలుసుకున్న దగ్గర నించి ఆ పిల్ల మనోభావాలూ, అదిచూసి తల్లితండ్రులు తట్టుకోలేక బాధని పైకి కనపడకుండా దాచే ప్రయత్నాలు. అందరిదీ నటన అనలేం, అనుభవిస్తున్నారు అనేటంతగా లీనమైన నటన. క్రమంగా ఈషా immune system తగ్గిపోవడం రోజుప్రతి క్షణం ఆక్సిజన్ లేకుండా గాలిపీల్చలేని స్థితికి lungs దెబ్బతిన్న స్థితి డాక్టర్ లు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మరో పదేళ్లు బతకచ్చు కానీ మిలియన్స్ అవుతుంది.
కూతురు ఇంకోపదేళ్లు బతుకుతుంది. అన్న ప్రేమ తో తండ్రి ఎలాగో అలాగా డబ్బు తెద్దాం అంటే తల్లి ఇంకో పదేళ్లు దాన్ని బాధలకి గురిచేద్దామా అంటూ ఏడుస్తూ గుండె రాయి చేసుకు వద్దు దాని చూస్తూ భరించే శక్తి నాకింకలేదంటుంది. తల్లి, తండ్రి గొడవపడి ఆఖరికి నిర్ణయం కూతురునే తీసుకోమందాం అనుకుని తండ్రి అడిగితే నాకు బతకాలని వుంది. డాడీ కానీ ఇలాటి బతుకు కాదు అంటూ ఏడుస్తూ చాలు ఇంకా పక్కకి అంకితమైన నన్ను చూస్తూ మీరు పడేఅవస్థలు బాధలు నేను చూడలేకపోతున్నా, ఇంకో పదేళ్ల కోసం అంటే ఇరవయి ఎనిమిది గదా మరింత అటాచ్మెంట్ పెంచుకు మరింత బాధ మీకెందుకు నన్ను పోనీయండి అంటూ ఏడుస్తూ ఉంటే ఆ తల్లితండ్రుల వేదన భరించలేం.
ఇంకా కూతురు బతికినన్నాళ్లు ఆమెని ఆనందంగా ఉంచడానికి వాళ్ళు పడే ఆరాటం చూస్తే గుండె తరుక్కుపోతుంది. క్రమంగా ఆక్సిజన్ తో కూడా ఊపిరి అందని పరిస్థితి లో కన్ను మూస్తుంది . నిజంగా ప్రతి సీను ఎంత సహజంగా మనమే ఆ తల్లితండ్రులమన్నంతగా కదిలిపోతాం.
చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా ఫోన్ చేసిఆక్సిజెన సిలిండర్ తెప్పించే తల్లి కూతురిచేత పెయింటింగ్ లు వేయించడానికి, పోయెట్రీ, కథలు రాయించి ప్రోత్సహిస్తూ… ఒకటేమిటి ఇది సినిమా కాదు జీవితం అన్నట్టు ఉంది డైరక్షన్. పోటీపడి పాత్రలో జీవించిన faran , ప్రియాంక హాట్స్ ఆఫ్. ఇలాటి సినిమాలు మనవాళ్ళు ఎందుకు తీయరు? ఇంకా హీరోగారు తంతే గింగురులు తిరిగి కిందపడి రక్తాలు కారడం, అదీ హీరోయిజం అన్న స్థాయి దాటని సినిమాలు.
పిల్లని బతికించుకోడానికి ఏ కష్టమైనా ఎదుర్కొంటూ, బతికినన్నాళ్లు సంతోషపెడదాం అనే ఆ తండ్రి తపన ..హీరోయిజం అంటే అది. లుంగీలెత్తి పిచ్చి డాన్సులతో చేసే వికృత చేష్టలు కాదు.
ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి.
*****
డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.