వినోదిని స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అంటరానితనం జోగిని వ్యవస్థ పై గ్రామీణ అభివృద్ధి శాఖ లో పని చేశారు స్వచ్ఛంద సంస్థలతో కలిసి రైతు ఆత్మహత్యలు మహిళా సాధికారత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు వంటి ప్రోగ్రామ్స్ లో పని చేశారు. జండర్ శిక్షణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా నిర్వహించారు, రచయిత్రిగా విమర్శకురాలిగా రచనలు చేస్తున్నారు. బ్లాక్ ఇంక్ పేరుతో కథా సంపుటి ప్రచురించారు. అన్నమయ్య వేమన వీరబ్రహ్మం మీద వారి సామాజిక దృక్పథం గురించి వేగుచుక్కలు పేరుతో గ్రంథం రచించారు. డాక్టర్ వినోదిని రచించిన దాహం నాటకం ఇంగ్లీష్ లో Thirst పేరుతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ద్వారా ముద్రణ పొందింది. నాటకం దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ స్థాయిలో ఈ సిలబస్ గా ఉంది. Parable of lost daughter అనే వీరి కథ కేరళ యూనివర్సిటీ డిగ్రీకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గా ఉంది. ఇప్పటివరకు దాదాపు 20 కథలు, 50 పైగా పరిశోధన వ్యాసాలు, నాటకం కవిత్వం రచించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ఇంకా జాతీయస్థాయిలో పది పైన పురస్కారాలు పొందారు. అంబేద్కరిస్ట్ దృక్పథం నుంచి రచనలు ప్రసంగాలు చేస్తున్నారు.
Please follow and like us: