ప్రమద
నందిని సాహు
–సి.వి.సురేష్
“నా కలం నాలిక పై
ఎప్పుడైతే పదాలు నర్తిస్తాయో.
ఏది కూడా దాచుకోకుండా..ఏ దాన్ని, వదలకుండా
పొంగి పొరలే నదిలా
నేను భాష ను అనుభూతిస్తాను
నా మది అంతః పొదల నుండి
కట్టలు తెంచుకొని
కవిత్వం వెల్లువై ప్రవహిస్తుంది…
మీరెందుకు కవిత్వాన్ని రాస్తారు? అన్న ప్రశ్నకు …ఆమె కోట్ చేసిన సమాధానం ఇది.
తన ఏడవ తరగతి లోనే మాతృ బాష అయిన ఒడియ లో మొదటి పోయెమ్ ను రాసిన నందిని సాహు ఒరిస్సా లోని జి. ఉదయ గిరి లో జన్మించారు .
ఆమె పేరు నందిని సాహు. తల్లి తండ్రులు ఇద్దరూ టీచర్ లే. ఆరుగురు ఆడపిల్లల మధ్య పెరిగిన నందిని సాహు ఒక క్రమ శిక్షణ తో తన జీవితాన్ని మలచుకొంది. 1973 జూలై 23 లో జన్మించిన నందినికి అతి చిన్న తనం నుండే ఆమెకు సాహిత్యాభినివేశం కలిగింది. ప్రస్త్తుతం ఆమె ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, న్యూ ఢిల్లీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో రెండు బంగారు పతకాలను సాధించిన నందిని కవిత్వం అమెరిక, లండన్, ఆఫ్రికా, పాకిస్తాన్ లలో బహుళ ప్రాచుర్యం లో ఉంది. ఇంటర్ డిస్సిప్లినరి జర్నల్ ఆఫ్ లిటరేచర్ అనే జర్నల్ కు ఆమె ఎడిటర్ ఇన్ చీఫ్ గా పని చేస్తున్నారు. తల్లి తండ్రులు ఇద్దరూ టీచర్ లే..
*ఆమె కుమారుడు పార్థసారధి సాహు ఎనిమిదవ తరగతి నుండే కవిత్వాన్ని, కథలని , ఎన్ బి టి, ఎస్.బి. టి. జర్నల్స్ ను ప్రచురిస్తున్నాడు.
*వర్తమాన రచయతలకు మీరిచ్చే సందేశం అని ఒక ఇంటర్వ్యూ లో అడిగితే…..: లోతుగా ఆలోచించండి. అది బయటకు వ్యక్తం చేసే సమయం లో నిజాయతీ తో ఉండండి. మీతో ఏదైతే కలిసి నడుస్తుందో ఆ కవిత్వాన్ని చదవండి. నా కవిత్వ నమ్మకం ఏమంటే, వర్డ్స్ వర్త్ , కీట్స్ ల మధ్య ఉండే ఆ వైరుధ్య ధోరణి మధ్య లో నిల్చోవాలి. ఒక గొప్ప రచయత కావాలంటే, ఒక గొప్ప చదువరి అయ్యి ఉండాలి. అంతః శోధన జరిపేతనము ఉండాలి. తక్షణమే వచ్చే కీర్తి కావాలని కోరుకోకు. నీ గురించి నీవు వ్యక్త పరచుకోవాలంటే, నీవు ఒక కఠినమైన `పరిశ్రమ చేయాల్సి ఉంటుంది… అని చాల బోల్డ్ గా సూటిగా చెప్పారు.
మీ గురించి ప్రపంచానికి తెలియని విషయాలు ఏమిటి? అని అడిగిన ప్రశ్నకు …నందిని ఒక అభ్యుదయ భావాలు గల చదువరి. రుచికరమైన వంట చేయగలను. అంకితభావం గల తల్లి ని. లతా మంగేష్కర్ గానానికి వీరాభిమానిని. అని చెప్పారు.
..
ఆమె హైకూ లు ఒక లోతైన అధ్యయనం తో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.. గొప్ప తాత్విక ఆలోచనలను రేకెత్తించే ఆమె హైకూ లు ప్రపంచ ప్రసిద్ధి గాన్చినాయి.
Sleep
My sleep and sleeplessness
play hide-and-seek.
Is someone awake in me?
ఇది ఆమె రాసిన ఒక హైకూ …
నా నిద్ర…నా మెలుకువా..
నాతో దోబూచు లాడుతాయి.
ఎవరైనా నాలో మేల్కొనే ఉన్నారా? ఎంత గొప్ప హైకూ,…ఎంత గొప్ప భావన….ఆమె ఒక లిటరరీ లెజెండ్.
అదే విధంగా, ఆమె కన్నీళ్ళ పైన రాసిన ఆ చిన్న హైకూ…
..
Tears
Tears theorize with condensed waters
and close accounts with history.
Tears burst a sovereign destiny to time.
కన్నీళ్లు
చిక్కనైన నీళ్ళతో కలిసి సిద్ధాంతీకరిస్థాయి కన్నీళ్లు
చరిత్ర తో తన బంధాలను తెంచుకొంటాయి.
కన్నీళ్లు , కాలగమ్యపు సార్వభౌమత్వాన్ని బట్టబయలు చేస్తాయి…
..
ఇలాంటి ఎన్నో అద్బుత హైకూ లను ఆమె చాల అవలీలగా చాల తాత్వికంగ రాసుకోస్తారు. aside అనే కవిత ఆమెను ఆమెగా గుర్తించే కవిత. అనేక మంది ‘ఆమె’ లకు ఆ పోయెమ్ ఒక ప్రతీక.
అనేక అవార్డులు, ప్రసంసలు పొందిన నందిని సాహు భారత దేశానికే గర్వ కారణం. ఒరిస్స లో పుట్టి ఆంగ్ల లిటరేచర్ ను ఆవ పోసన పట్టి, అద్బుతమైన కవిత్వం, కథలు అందిస్తున్న నందిని సాహు గురించి ఇవాళ ఆమె రాసిన రెండు పోయెమ్స్ ను తెలుగు లోకి అనుసృజన చేసి, అందిస్తున్నాను.
ఎంజాయ్ ది పోయెట్రీ…
..
..
1 పోయెమ్
nandini sahu || loving stranger||
అనుసృజన : సి.వి.సురేష్ || అపరిచుతుడి తో ప్రేమలో ||
నీవు నన్నొదిలి వెళ్ళాక
నీవెళ్ళి పోయాక మాత్రమే…
నీ జ్ఞాపకాల నీడలు
నా హృదయ కవాటాల అడుగున ప్రవహిస్తున్నాయని
నేనూహించగాలిగా…
నీవో అపరిచుతుడివి.
అరుదైన ప్రేమాత్మక అపరిచుతుడివి
కాలం స్థాణువై పోయింది…
వేదన నా దేహాన్నంతా చుట్టుముట్టేసింది..
..
విహారానికి అలవాటు పడిన నా రెక్కలు
ఈ విషయం నా రెక్కలను విరిచేసి
ధూళి పాల్చేసింది.
నేను సేద తీరి, పరుండే ఆ కొమ్మపై
నుండి నను ఓ అంతులేని అగాధం లోకి తోసేసింది..
నా గుండె ముక్కలైంది..
ఆ ప్రకంపనలు ఆకాశాన్నంత వ్యాపించాయి.
..
నేను ఎప్పుడైనా నీకోసం ఒక ప్రేమ గీతాన్ని రాయగలనా?
కేవలం నీ కోసమే రచించగలనా?
కాలం చివరి దశకు చేరుకుంది..
పాలిపోయిన దేహం తో ఉన్న ఎముకల గూడును
ఛిద్రం చేయడానికి
అది తన పంజా ను పదును పెట్టుకుంది.
ఆ నీడలు నాతో దోబూచు లాడుతూ..
నను వేదిస్తూ ఉన్నప్పటికీ,
నీడ నిచ్చే ఆ వృక్షం నాకోసం వేచి ఉండగా,
నేనెందుకు ఆ సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తున్నాను
..
నా వేదననంతా మటుమాయం చేసి
నా స్వీయ ఆత్మకు ఆనందాన్ని ఇచ్చే
ఆ ఆలాపనను ముందే నీవెందుకు ఆలాపించలేదు..
గిన్నె నిండా పొర్లి పోర్లుతున్నప్పుడు
నేను తాగాలని అనుకోను…
ఎప్పుడైతే జీవితం కల్మషం అయ్యిందో..
అప్పుడే నాకు తాగాలని అనిపిస్తుంది.
కానీ, నేనప్పటికే ఒక పేద మరణించిన వాడిని…
నేనొక ఖాళీ కప్పు ను చూసాను.
అంతే కాదు, నా హృదయాన్ని ముళ్ళతో గుచ్చాను
..
ఓ విధి వంచితుడా…
బహు పరాక్ గా జీవితం వెంబడి పయనించు..
నీకు కన్నీళ్ళే ప్రియమైనవి.
ఆ కల్లోల జలాల కింద ..
తేలి యాడటం నాకు ప్రియమైనదే ..!
..
ఇవాళ
బాగా ప్రేమించిన ఓ అపరిచుతుడిని,
ఒక జీవిత సంక్షోభాన్ని
బహూకరించ బడినాను ..
..
ఒరిజినల్ పోయెమ్:
After you left
only after you left
I could guess
that your shadow spreads
beneath my lonely heart,
and you are a stranger
the most loving stranger;
time came to a halt
pain sprinkled over my earth.
This contention crushed me to dust
clipped my wings
addicted to fly
pushed me off the branch
where I was resting, relaxed
in an endless sphere;
my heart broke.
The vibrations
spread across the sky.
Can I ever write a love poem
for you? Exclusively for you?
Time is ripe
sharpening its claw
to rupture the skeleton of pallid earth.
Why am I roaming in the sun
when the shady tree
has always waited
even though the shadows have only
troubled me
playing hide and seek.
Why didn’t you play that tune
earlier
taking away all pain
giving joy of self-introspection?
There is no want to drink
when the cup overflows.
I had always wanted
to drink life to the lees,
but a poor mortal that I was
I saw an empty cup
and pierced my heart with thorns.
Safely sail through life.
Oh fateful one,
tears are dear to you.
Beneath the troubled waters
I too love to float.
Today
I am awarded
with a life time of turmoil
and a stranger, loved the most.
Nandini Sahu
..
2 వ పోయెమ్ :
Nandini Sahu || Who Says Death Is The Only Truth? ||
అనుసృజన:: సి.వి.సురేష్ || ఎవరు చెప్పారు? మరణమొక్కటే నిజమని||
మెట్ల కింద వ్రేలాడదీసిన చిత్ర పటం లాగా,,
నాకు కొద్ది దూరం లో
రాత్రనకా, పగలనకా, చిరునవ్వుతో…కన్నార్పకుండా.
మృతువు అలా నాకు కొద్ది దూరం లోనే నిల్చోనే ఉంది…
..
నీవు నీ ప్రయాణపు చివరి బస్సు కోసం ఎదురు చూస్తున్నావా?
నీ చేతి వ్రేళ్ళ సందుల గుండా…
ఇసుక అలా జారిపోతూ ఉండటం నీకు తెలుసా?
..
నీ శవ పేటికనో, లేక నీ చైతన్య జీవితాన్నో…
ఏదో ఒకదాన్ని అట్టే పట్టుకొని ఉండాలన్న
జ్ఞానం తో ….నీ పిడికిలిని అలా బిగించి ఉన్నావు…
ఒక జననం నుండి ఇంకో జననం నాటికి,
నాగరికత పెరుగుతూనే ఉంటుంది.
..
నీ నవ్వు కుచించుకు పోయిన
నీ పెదాలను విచ్చుకోనేలా చేస్తాయా?
నీ దుస్తుల అలమార ను తెరుచు…
నిరుపేదల చాతీ ని ఆ గుడ్డలతో కప్పు..
సహస్రాబ్ది తిరుగుబాటు లేపనాన్ని .
నీ పెదాలకు పట్టించుకో…
..
చావు ఒక్కటే నిజమని
ఎవరు చెప్పారు?
చూడు నీ పొగమంచు దేహం
ఇంకా ఆ సింహాసనం పైన కూర్చొనే ఉంది….
నీవింకా ఆ విశాల ఆకాశపు నక్షత్రాల్లో
కాంతి వంతంగా మెరుస్తూనే ఉన్నావు…!!
..
ఒరిజినల్ పోయెమ్ : Who Says Death Is The Only Truth? ||
by నందిని సాహు..
..
Death stands at a distance
all day all night, smiling, unblinking,
like that picture under the staircase.
Are you waiting for the last bus?
Do you know, the sands are slowly
rolling through the gaps of your fingers?
Tighten your fist. You are enlightened to
pick one – the coffin or a life of action.
From one birth to another, augment the civilization.
Does your laugh tear your shrunken lips?
Open your wardrobe, cover the breast of the poor,
apply on your lips the balm of a millennium’s rebellion.
Who says death is the only truth?
See, your body of fog is still seated on the throne.
You still shine in the firmament of stars.
*****
సి.వి. సురేష్ : కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. సాహితీ ప్రేమికులు. 2013 నుంచి సాహిత్య వ్యాసంగంలో ఉన్నారు. చారిత్రక ప్రతీకలు అరుదైన సిమిలీలతో సాగే వీరి కవితలు పాఠకహృదయాల ఆదరణ పొందాయి. అనుసృజనలు వీరి ప్రత్యేకత. ఇప్పటివరకూ డెబ్భై కు పైగా కవితలు తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి.. ఎనభై పై చిలుకు కవితలు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. అందులో క్లిష్టమైన సూఫీ పోయెట్రీ సంగం పోయెట్రీ కూడా ఉన్నాయి. కవిసంగమం ఫేస్బుక్ గ్రూప్ లో ప్రతి బుధవారం “కవిత్వానువాదం” శీర్షిక, ప్రజాపాలన పత్రిక ‘విభిన్న’ సాహిత్య పేజీల నిర్వహణ, రస్తా మరియు సారంగ వంటి ప్రముఖ వెబ్ మేగజైన్స్ లో కాలమ్స్ నిర్వహిస్తున్నారు.