చిత్రం-17

-గణేశ్వరరావు 

గత పదేళ్లలో ఆఫ్రికన్ చిత్రాలకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఇర్మా స్టెర్న్ చిత్రాలకు. చిత్రకళా ప్రపంచంలో ఆమె విశ్వవ్యాప్తంగా పేరు పొందింది. 1966లో ఆమె మరణించింది. ఆ మధ్య   ఆమె గీసిన లేడి కళ్ళ భారతీయ వనిత బొమ్మ $3 మిలియన్ల కు అమ్ముడయింది. 2015 లో ఒక లండన్ ఫ్లాట్ లో వంట గదిలో నోటీస్ బోర్డు లా వాడుతున్న ఆమె చిత్రం బయట పడింది. మండేలా సహాయార్థం అది 1950 లో అమ్ముడయింది , అది విచిత్రంగా చేతులు మారుతూ వంట గదిలోకి చేరింది. ఇలాంటి కోల్పోయిన చిత్రాన్ని మళ్ళీ వేలాం వేస్తే ఈ సారి అత్యధిక ధర కు అమ్ముడయింది. ఆఫ్రికా ఆర్థికంగా కోలుకోవటం తో అక్కడ చిత్రాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఆఫ్రికాలో ప్రసిద్ధి చేందిన బొన్హామ్స్ హౌస్ విజయాన్ని లండన్ లోని ఆక్షన్ హౌసెస్ అనుకరించాలని చూస్తున్నాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.