ప్రమద

ఫణిమాధవి కన్నోజు

సి.వి.సురేష్ 

నిన్నేదైతే గాయపరిచి౦దో దాన్ని గురించి గట్టిగా, చాల స్పష్టంగా రాయమని ఎర్నేస్ట్ హెమ్మింగ్వే చెప్తారు.

Write hard and clear about what hurts – EARNEST HEMINGWAY

కవిత్వం ఎలా పుట్టుకొస్తుంది అన్న అంశం పై షరోన్ ఒల్డ్స్ తన “The dead and living” పుస్తకం లో అనేక అంశాలను చెప్పుకొస్తూ.. “Out of memory—a dress I lent my daughter on her way back to college;” అనే ఒక కవిత్వ ప్రేరకాన్ని కూడా ప్రస్తావిస్తాడు.

After great pain, a formal feeling comes

The nerves sit ceremonious, like tombs

The stuff heart questions ‘was it He, that bore.,’

And ‘yesterday , or Centuries before? అని Emily Dickinson తన ఒక కవిత ను ఇలా ప్రారంభిస్తారు….

ఎందుకో ఫణి మాధవి కన్నోజు గారి కవిత్వం చదివినప్పుడు, షరాన్ ఒల్డ్స్ , ఎర్నేస్ట్ హెమ్మింగ్వే లు కవిత్వంపై మాట్లాడిన అంశాలు ..Emily Dickinson రాసిన కవిత గుర్తుకొస్తాయి.

తన చిన్న తనం నుండి భాష పట్ల, సాహిత్యం పట్ల విపరీతమైన అభిమానాన్ని పెంచుకొన్న ఆమె జీవితంలో ఒక విషాద వీచిక… గుండెలు పగిలే ఆ పెను బాధ నుండే ఆమె కవిత్వం పుట్టుకొచ్చిందేమో!

“ఆ పై లోకంలో నా బంగారు తల్లికి ఎవరు జడ వేస్తారో? 

ఎవరు తనకు తోడుగా పడుకొంటారో? 

ఎవరు స్నానం చేయిస్తున్నారో? 

ఎవరు నా చిట్టి తల్లి ఇష్టాలు కనుగొని తినిపిస్తున్నారో? 

తనకు నా పైన చేయి వేసుకొని పడుకొనే అలవాటు ఉంది…ఇప్పుడెలా చేస్తు౦దో? 

నేను అక్కడికి వెళితే బావుంటుందేమో”  

అని  తన బాధను హృదయ విదారకంగా ఆమె వివరిస్తుంటే, కన్నీళ్ళ పర్యంతం అయ్యాను.

ఆమె  కవిత్వం ఆ పెను బాధలో నుండే పుట్టి౦దని అనిపించింది.

తన తొలి కవితల్లో ఒక కవిత లో ఇలా..రాసారు..

ఆ విధాత కరుణిస్తే…

ఒక్కసారి నిను పంపితే…

నా ఒడిలో నీకు లాలి పాడాలని ఉందమ్మా

వింటూ నువ్వు కురిపించే నవ్వుల వెన్నెలలో తడిసి

ముద్దవాలని ఆశగా ఉందమ్మా…

విశాల గగనాన్ని కప్పుకొని విశ్రమించాలని ఉందమ్మ….

 

ఆమె రాసిన ఇంకో కవిత…లో…

చిన్నారి నా తల్లికి కుంకుమేదమ్మ…

విశ్వమంతా వెలుగునిచ్చు సూర్యబి౦బమేనమ్మా

పొన్నారి నా తల్లికి మేనేమి కట్టేను

పచ్చని ప్రకృతి పరికిణి చుట్టేను

అందాల నా తల్లికెవరమ్మ తోడు

అవనినే పాలించు శ్రీకృష్ణుడే

బంగారు నా తల్లి బొమ్మెక్కడుండు

బొమ్మలతో ఆడుకొను బ్రహ్మ చెంతనే ఉండు…

…నా నివాళి.

అని ముగించారు.

ప్రతి అక్షరం లో ఆ పెను బాధ ఆమెను కవిత్వం వైపు చుట్టేసింది. ప్రతి అక్షరంలో ఆమె ఆ పాప జ్ఞాపకాలను కలిపి కవిత్వాన్ని చేసింది….ఆ పెను బాధ నుండే ఆమె కవిత్వం !!

తొలి నాటి కవితల్లో ఎంతో ఆర్ద్రతగా విషయాన్ని చెపుతూ , స్త్రీ వాద కవిత్వపు ధోరణలను తన కవిత్వం లో వినిపిస్తున్న ఖమ్మం కు చెందిన కొత్త కవిత్వ స్వరం ఫణి మాధవి కన్నోజు.

ఈ వారం  “ప్రమద”  శీర్షిక కు ఆమె సాహితీ ప్రయాణం ఆమె మాటల్లోనే విందాం…

పుట్టింది తల్లాడ గ్రామం, ఖమ్మం జిల్లా, అమ్మమ్మ గారి ఊరు. ఖమ్మం లో పెరిగాను. నాన్న రాఘవాచారి నల్గొండ జిల్లా. NSP కార్యలయం లో సీనియర్ అసిస్టెంట్. నాన్నగారు జాబు చేస్తున్నప్పుడే చనిపోయారు. అప్పుడు నా వయసు ఆరేళ్ళు. మూడవ తరగతి చదువుతు౦డినాను. అప్పుడు తల్లాడ లో మూడో తరగతి సగం నుండి చేర్పించారు. తర్వాత మిర్యాలగూడ లో నారాయణ విద్యాలయం లో చదివాను. ఇంగ్లీష్ పై మమకారం టీచర్ రాజేంద్ర ప్రసాద్ గారు కారణం. అక్కడ ఉదయాన్నే శ్లోకాలు, తెలుగు బాష, సాహితీ సంస్కృతిక అంశాలపై చెప్పడం తో, అక్కడే తెలుగు నేర్చుకోవాలని బీజం పడింది. అప్పల నారాయణ గారు స్ఫూర్తి గా నిలిచారు.

అమ్మ జానకి. సంస్కృత పండితురాలు. తెలుగు పండిట్ కోర్సు కూడా చేసి “వైరా” అనే ప్రాంతం లో టీచర్ గా పని చేసింది. ఇంట్లో ఎప్పుడూ గీత శ్లోకాలు, భారత భాగవతాలు, అమ్మ నోట్లోనే నానేవి. పూజ చేస్తూ, శ్లోకాలు పాడేది. ఇప్పటికీ కూడా పాడుతూనే ఉంటుంది. మా అమ్మ చేతిరాత కూడా అందంగా ఉంటుంది. ఇదే బహుశా నాకు తెలుగు బాష పట్ల ప్రేరణ కలిగించి ఉండొచ్చు. మాక్సిం గోర్కి నవల “అమ్మ” నన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం. అందులోని తల్లి పాత్ర అద్భుతం….దినపత్రికల పట్ల ఎక్కువ మక్కువ ఉండటం, నా బాబు కడుపు లో ఉన్నప్పుడు పూర్తి విశ్రాంతి తేసుకోవాలన్నప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ సలహా ఇచ్చారు. ఆ సమయం లో దాదాపు 300 పైగా నవలలు చదివాను. సులోచన రాణి నవలలు ఇష్టం.

కవిత్వం లోకి ఎలా వచ్చాను అంటే ఖచ్చితంగా చెప్పలేను కానీ, నా ఆలోచల్ని అనూహ్యమైన మలుపు తిప్పిన అంశం ఒకటుంది. నా పాప స్మృతులే అక్షరాల్లో రాసుకొంటూ , ప్రతి నెలా పాప  తిధికి ఒక్కో కవిత పోస్ట్ చేస్తుంటే, సాహితీ అభిమాని, మా శ్రేయోభిలాషి అయిన మా బంధువు ఫోన్ చేసి, చాల ప్రోత్శాహించాడు. నీ దుఖం కోసం కాక, సమాజ దుఖాన్ని స్వంతం చేసుకొని రాయి.. అని అద్భుతమైన ఉత్సాహాన్ని నాలో నింపారు. రచయత ఆకెళ్ళ రాఘవేంద్ర గారి ఉపన్యాసంతో నా దిగులు నుంచి బయటకు వచ్చాను. మనదంటూ ఒక ముద్ర వేసే పోవాలి అనే ఆలోచనలోకి జారుకొన్నాను. శూన్యం పోగొట్టి , నాలో ప్రతికూల శక్తిని నింపుకోవటానికి సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆశ్రయించా. మహిళలు, పిల్లల సమస్యలు నన్ను బాగా కదిలించే అంశాలు.

గత ఏడాది నుండి, మనసు స్పందించే అంశాలను, వ్యాసాలుగా, కవితలుగా రాయడం మొదలు పెట్టాను. “మానవి” మహిళా మాగజైన్ లో, రెగ్యులర్ గా నా వ్యాసాలు, కవితలు ప్రచురితమయ్యాయి. “రంగుల కన్నీళ్లు” అనే కథ రాసాను. అనేక కవితలు నవతెల౦గాణ ఖమ్మం అంకురం పేజీ లో వచ్చాయి.

***

|| తానెవరు..?? విజేత..? పరాజిత..??||

అనుసృజన : సి. వి. సురేష్

||Who she is? The winner? The looser?||

she herself is a question to her

who she is?

She is in search of herself.

Travelling through herself…

for the sake of hers

Searching in herself

for the sake of hers

fighting for herself…

being distressed herself..

looking deeper into herself

for the sake of herself n’ only for herself…

She is the bevy of specks..

She is amenable to the situations

Whether she is joyous…?

She herself being happy…

For the sake of her family….

Circumscribe herself …

By drawing the restricted lines..

She is a mother…?

She herself becomes aliment

To feed the ravenous

She herself becomes a plaything..

Being played herself if necessary

She is an umbrella?

She always with them…

in joys and sorrows

Alike an umbrella

Protects them in sunny and rainy!

She is the goddess of earth?

Yes, she is deity of earth….!

Being sowed and reaping the happy crop

With the seeds of longing and despondency of her people…!

she is an ocean…?

Yes, she is an inlet…

Merging the anguish and loving rivers into her….

N’ bearing alone the ebbs and flows

Is she a desert?

Yes, she is really a desert….

Filled the heart with appetence of oases..!

She herself is a question… who she is?

is she a winner??

Or the backbone to the triumphs of her people…!

She is a looser….??

She knows….

That she can’t find herself forever…

Original poem:

|| తానెవరు..?? విజేత..? పరాజిత..??||

తనకు తానో ప్రశ్న

తానెవరు??

తనను తాను వెతుక్కుంటోంది

తన కోసమై తనలోకే వెళ్తోంది

తానెవరో తనలోనే వెతుకుతూ..

తపించిపోతూ తండ్లాడుతోంది..

తనదైన.. తనదే అయిన తన కోసం..

తరచి చూసుకుంటోంది.

తానో నీటిబిందువుల సమూహం??

ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలా మారగల నీరు.

తానొక ఆనందం??

తన కుటుంబానికి

తనకై తానే గిరిగీసుకున్న తనదైన ప్రపంచానికి తానో ఆనందం.

తానొక అమ్మ??

ఆకలి తీర్చే అన్నం తనే

అవసరమైతే ఆడించే బొమ్మా తనే.

తానో గొడుగు??

ఎండలో వానలో తన వారి నెత్తిన గొడుగై

కష్టసుఖాల్లో వెన్నంటే నీడ తాను.

తానో భూమాత??

తన వారి ఆశనిరాశల విత్తనాలు

తనలో ఇముడ్చుకుని

సుఖశాంతుల పంట పండించగల భూమాత తను.

తానో సముద్రం??

తన వారి ప్రేమల కోపతాపాల ఆవేశాల నదులన్నీ

తనలో కలిపేసుకుని

ఆటుపోటులన్నీ తానే

భరించగల సముద్రం తను

తానో ఎడారి??

ఎద నిండిన ఆశల ఎండమావులను నింపుకున్న

ఎడారి తాను.

తనకు తానో ప్రశ్న

తానెవరు??

తానొక విజేత??

తన వారి విజయాలకు వెన్నెముక..

తానొక పరాజిత??

తనకు తానెప్పటికీ దొరకదని ఎరుక.

*****

Please follow and like us:

2 thoughts on “ప్రమద -ఫణిమాధవి కన్నోజు”

  1. Wah మధు కంగ్రాట్స్,
    చాలా మంచి కవితని తీసుకున్నారు సీవీ సర్….
    తానో పరాజిత తనో విజేత స్త్రీ జీవితం మొత్తం ఒక చోటకి మలిచిన నీకు
    అనుసృజన చేసిన సీవీ. సర్ కి అభినందనలు 💝💝👌👌👌👌

Leave a Reply

Your email address will not be published.