అన్నీ తానే

-చందలూరి నారాయణరావు

సూర్యుడు

నాకు గుర్తుకు రాడు.

నాలో ఉదయించే వెలుగు వేరు..

చంద్రుడు

నాకు అవసరం అనుకోను.

నాకై పూసే శశి ఉంది

గాలితో

నాకు పనే లేదు

నాకై మొలిచిన నవ్వుల చెట్టుంది.

మట్టిని

అడిగేది లేదు.

ప్రేయసి పాదముద్రలో సంతోషాలే అన్నీ.

వానలో

తడిసేది లేదు.

జ్ఞాపకాల జల్లుతో తేమకు కరువేలేదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.