కొడుకు-కూతురు
–జి.అనంతలక్ష్మి
ఆడపిల్ల పుట్టింది అనగానే ఆడ పిల్ల అంటారు. ఏందుకు? పెళ్ళి అయి అత్తవారింటికి వెళి పోతుంది అని. ఈనాడే కాదు ఆనాడు మగపిల్లాడు పుట్టి ఏమి వుద్దరించాడు? ఆ మాటంటే ఇంట్లో అందరు యుద్ధానికి వచ్చేస్తారు. మగపిల్లాడు నెత్తిన పెట్టే రాయి ఏమిటి? ఆడపిల్ల నిజంగా రాయి పెట్టకపోవచ్చు. తల్లిదండ్రుల కష్టాలలోను చివరి పరిస్థితుల్లోను వెన్నంటి కాపాడేది ఆడపిల్లే. కాని చివరకి ఆ తల్లిదండ్రులకు కూడ ఆడపిల్ల పనికిరానిదవుథోందా! ఏందుకు? ఇలా ఆలోచిస్తూ తల్లి దగ్గర కూర్చుండి పోయింది.
తన జీవితం ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడింది. మాణిక్యాంబ, సూర్యనారాయణ బార్యభర్త లు. వారికి ఆరుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ముందుగా ముగ్గురుఆడపిల్లలు . తరువాత మగపిల్లలు, చివరగా నేను.మా తాతగారికి పిల్లలు లేకపోవడంతో మా నాన్నగారిని పెంపకం తీసుకున్నారు. మా నాన్నగారిని పెంపకం తీసుకున్నప్పుడు మా తాతగారికి ఆస్తిపాస్తులు చాలబాగుండేవి. మానాయనమ్మ గారి వంటిమీద యాబయి అరవై కాసుల బంగారం వుండేది. మా నాన్నగారిని చాల గారాబంగా పెంచడంతో చదువు అంతంత మాత్రంగానే వచ్చింది. ఆ గారాబంతోనే చెడు స్నేహాలకి అలవాటు అయ్యారు. సొమ్ము నీళ్ళప్రాయంగా ఖర్చు చేసారు. కొడుకు చెడు నడతను మా తాతగారు జీర్ణించుకోలేక పోయారు. ఆ బెంగతోనే ఆయన మంచం పట్టి చనిపోయారు. నిజానికి మా నాయనమ్మ పూర్వకాలం మనిషైనా చదువు అనేది లేకపోయినా ప్రతి విషయాన్నీ చాల సునిసితంగా పరిశీలించి పరిస్థితులను బట్టి నిర్ణయాలను తీసుకునేది. ఆ మిగిలిన ఆస్తులను అమ్మి అక్కయ్యలకు వీలయినంతమటుకు మంచి సంబంధాలను చూసి నాన్న చేత పెళ్ళిళ్ళు చేయించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం ఏమిటి? అదే పరిస్థితి ఎదురయింది. అన్నయ్యలకు చదువులలోకి వచ్చేసరికి డబ్బు కోసం వెదుకులాడాల్సిన పరిస్థితి. కొన్ని విషయాలలో అన్నయ్యలు ఇద్దరిని మెచ్చుకోవాలి. ఏందుకంటే నాన్న ఆస్తిపాస్తులు పాడు చేసాడు అనే అసహ్యం వున్నా చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. నాన్నని అగౌరవపరచలేదు. వాళ్ళు అలా తండ్రి యందు లేని గౌరవం చూపించడం కాని, చదువు కోవడానికి గాని, మామ్మ పెంపకమే కారణం.
పెద్ద అన్నయ్య ఆ వూళ్ళో వారి సహకారంతో చిన్న వుద్యోగం సంపదించాడు. వాడు తెచ్చిన సంపాదనతో మామ్మ సంసారాన్ని చాలచాకచక్యంగా నడుపుతూ కొంత దాచి పెట్టేది. మా అమ్మ చాల అమాయకురాలు. నాన్న డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తున్న ఏనాడు ఎదురు చెప్పి ఎరుగదు.ఆ అమాయకత్వం వల్ల మామ్మే ఇల్లు నడిపేది.
నన్ను కూడ గ్రాడ్యుయేషన్ చేయించింది. తగిన సంబంధం చూసి నాకు కూడ పెళ్ళి చేసీ అత్తారింటికి పంపిన ఆరునెలలకల్లా మామ్మ చనిపోయింది.ఇల్లు మాత్రం అమాయకురాలైన అమ్మ కోసం అమ్మకుండా నిలబెట్టింది. ఆవిడ చివరివరకు తనకడుపు పుట్టకపోయినా , పెంచకున్నందుకు, తన వంశాన్ని నిలబెట్టినందుకు కొడుకుఅయిన సూర్య నారాయణ ని చాల ప్రేమగా అభిమానంతో చూసింది. తన అత్తవారిది ఇ వూరే అవడంతో అమ్మకి అండగా నిలిచింది.
అన్నయ్యల అదృష్టమో, నాన్న, మామ్మల పుణ్యఫలమో పోటీ పరీక్షల ద్వారా వాళ్ళు మంచి స్తతిలోకి వచ్చారు. అన్ని కలసి వచ్చి విదేశాలకు వెళ్లారు.చిననాటి తల్లితండ్రుల మీద కక్ష అనే వృక్షం బయటకి వచ్చి, చిగురులు వేసి వటవృక్షమైంది. దాని పర్యవసానమే నాన్నపోయిన చితికి నిప్పు పెట్టే సమయానికి రాలేదు. వచ్చారు. కార్యక్రమాలు అయ్యాయి. మానవనైజం అనుకుంటాను.దుఃఖంలో వుంది అనికూడ అనుకోకుండా అమ్మని ఎవరు వుంచుకోవాలి పోషణకి డబ్బు ఏలాగ అని తర్జనలు భర్జనలు పడి చివరకి ఇల్లు అమ్మకం పెట్టబోయారు. ఆ అమ్మకం మాటలు విని నా మనసు గిలగిల లాడిపోయింది. మానాయనమ్మ కష్టం, మా అమ్మ అమాయకత్వం నాన్న చివరిదశ అన్ని గుర్తుకువచ్చాయి. తండ్రి ఎటువంటి వాడైనా, నాకేమి అని కుటుంబాన్ని నడివీధిలో వదిలేయగలిగిందా మామ్మ. నాకు సంసారం వద్దు అనుకోగలిగిందా అమ్మా! ఇల్లు అమ్మకానికి పెట్టి, తనని వృద్ధాశ్రమంలో చేర్చడానికి ప్రయత్నిస్తున్న కొడుకులను ఎమైన అనగలిగిందా! లేదు. వాళ్ళు వంశోధ్ధారకులు.పున్నామ నరకం నుంచి తప్పించగలిగినవారు. పున్నామ నరకం నుంచి తప్పిస్తారో లేదో తెలియదు కాని బ్రతికుండగానే నరకం ఏలా వుంటుందో తెలియజేస్తూన్నారు. ఇటువంటి సుపుత్రుల కోసం ప్రతి తల్లి పూజలు,వ్రతాలు చేసి జన్మనిస్తున్నారు.
నా భర్త చాల మంచివాడు. “ఆ ఇల్లు అమ్మవలసిన అవసరము లేదు. అత్తగారిని వృద్ధాశ్రమం లోను చేర్పించనవసరం లేదు. ఆవిడ మనకు బరువు కాదు.” అనిచెప్ఫడంతో ఆవిషయాన్ని అమ్మకు చెప్పాలని వచ్చిన నేను స్థాణువయిపోయాను. “అమ్మా……అమ్మా……అని లేపబోయిన నాకు ఆవిడ శరీరం మంచుగడ్డలా వుంది.ఒక్కసారిగా బావురుమన్నాను.
“అమ్మ మంచి ధరే వచ్చింది.పోయినవాళ్ళు ఈ ఇల్లు వుంచి మంచ పనిచేసారు. మామ్మ కూడ ముందరి చూపు గలదే ఈ ఇల్లు ఆనాడే అమ్మకం పెట్టి వుంటే ” అంటూ వచ్చిన అన్నదమ్ములు నన్ను చూసి నిశ్చేష్టులయి అలా నిలబడిపోయారు.
ప్రతి తల్లితండ్రులు కూతరు పుట్టగానే మైనసూ అని, కొడుకు పుడితే ప్లసు అని ముందుగానే అనేసుకుంటారు. ఇద్దరు ఒకేవిధంగా జన్మిస్తారు. కాని పెంపకం దగ్గర వాళ్ళనిద్దరిని తేడాగా పెంచుతారు. దాంతో కొడుకులో అవ్యక్తి కే తెలియని అహం వచ్చి ఒక్కొక్కచోట కొందరు పనికిరానివాళ్ళు
అయిపోయి సంఘానికి,సమాజానికి చెదపురుగులు
అయిపోతున్నారు.కొంతమంది నా తండ్రిలాగ తయారయ్యి వాళ్ళ పిల్లల మనసులలో చోటు లేకుండా చేసుకుంటున్నారు.
వీధిలో హడావుడితో అమ్మ దగ్గర నుంచి లేచి విముక్తిని ప్రసాదించిన,కనపడని దైవానికి నమస్కారించి ముందుకు కదిలాను.
****
నా పేరు అనంతలక్ష్మి. నాకు రచనలు చేయడమంటే ఎంతో ఆసక్తి. నా మనసుకి తోచిన విధంగా వ్రాస్తూవుంటాను. నాకు చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం అంటే చాల ఇష్టం.
మీ ప్రయత్నం అభినందించదగినది..
అక్షర దోషాలు సరి చేసుకుంటే బావుంటుంది mam.
అలాగే కథనం లోని ఒక ప్రధాన లోపం చెప్తాను.
కథానాయకి తన జీవితాన్ని ఒక సింహావలోకనం చేసుకుంటూ ఉంటుంది తల్లి వద్ద కూర్చుని.
అప్పుడు రాసే గతం లో నేను అని రాయకూడదు
తను అని రాయాలి
నేను, నన్ను ఈ పదాలు గతాన్ని మరొకరికి చెప్పేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాము
అన్యథా భావించవధ్ధు అని మనవి.