బుజ్జీ ..! 

-కృష్ణ గుగులోత్

అప్పడే పర్సుకుంటున్న లేల్యాత ఎండలో ఆత్రంగా తుమ్మకాయల్ని ఏరుకుంటున్నడు లక్పతి.కొద్దిసేపయ్యాక తలకు సుట్టుకున్న తువ్వాలిప్పి ఏరిన తుమ్మకాయల్ని మూటగట్టుకొని సెల్కల్లో ఉన్న తమ గొర్ల- మేకలమందవైపుసాగిండు.

మందతానికొచ్చాక “బుజ్జీ.!”అని తనగారాల మేకపోతుకు కేకేసిండు,గంతే ఒక్కపాలి దిగ్గునలేచి లక్పతి ముందు వాలిపోయింది ‘బుజ్జి’, తొందరగా తువ్వాలిప్పమన్నట్టుగా నానా హడావిడి సేస్తున్న బుజ్జితో.,”ఏహే ! థమ్ర, తార్వాసుతో కాఁయ్ లాయొజకోన్ ! ఇదె ఖో “!  (“ఏహే ! ఆగరా..! నీకోసమే కదా దీస్కొచ్చింది, ఇంగో.,తినూ.”) అంటూ తుమ్మకాయల్ని పర్సిండు ఐదునిముసాల్లోనే ‘హాంఫట్’ సేసేసి “అజి కాఁయ్ ఛేనిక” (“ఇంకేం లేవా.!)అన్నట్టుగా లక్పతి మొకంకెల్లి సూసింది బుజ్జి.! కాఁయ్ర కొండా! ధాపొకోనీక ? హనువతో ఆఁ !” (“ఏంరా కొండా ..! సాల్లేదా.!?” ఐతెదా.!”) అంటూ 

ఓ ఇరవై అడుగుల దూరంలోనున్న పరిగెపొదేపు గొడ్డలి దీస్కొని కదిలిండు, పైన బాగా దట్టంగా పచ్చదనం పర్సుకొని మాలావుగా ఉన్న ఓ కొమ్మపై గొడ్డలేటు ఏసిండు,అది సగమే తెగి కొద్దిగా ఏలాడింది ఎంటనే ఎనకాలే ఉన్న బుజ్జి “ధేర్ ఛోడ్దవోన మ దేఖ్లూఁచుఁ కాఁయ్ వోన!” (“సాలూ నాకొదిలెయ్.! నే సూస్కుంటాగా దాన్ని.!”) అన్నట్టుగా క్షణమాలస్యం చేయకుండా తన ముందరి కాళ్ళను లేపి కొమ్మపైనుంచింది గంతే పెళపెళామంటూ కొమ్మిరిగి నేలపైవడ్డది బుజ్జి బరువుకి,

ఓ సిన్నసైజు ఆంబోతులా ఉంటది బుజ్జి.కొమ్మిరిగిన సప్పుడిని ఆకలిమీనున్న మూణ్నాలుగు బక్కమేకలు-గొర్లు పొదేపు రాబట్టినయి,సప్ప-సప్ప మేస్తున్న బుజ్జి ఆటిని దగ్గరకి రానిచ్చి ఓ రెండు కుమ్ముళ్ళు కుమ్మింది,గంతే .. వచ్చిన సుట్టాలు మూడు పొర్లుగా ఎల్లెల్కలవడీ  ఇక దగ్గరకొచ్చే దైర్నం సేయకుండా దూరంగా బుజ్జి మేసేదాంక ప్యానాలు ఉగ్గవట్టినయ్ జీవాలు, యాపసెట్టు నీడలో కూసోని గిదంతా సూస్తున్న లక్పతితో “కాఁయ్ రో లక్పతీ ! పర్భాతి లాయొజకోన్ బమ్మోళీర్ ఫళీ పూర్వేకొనిక వోనా..!? హమార్ ఛేళీ-గోర్లీవూర్ బక్కిపోడేవాసుఛ, జరా దేఖ్రవోనా! (” ఏంరో లక్పతీ.! పొద్దుగాల దెచ్చిన తుమ్మకాయలు సాల్లేదా దాన్కీ ..! మా జీవాల డొక్కపగల్గొట్టేలావుందీ .. కొద్దిగా సూడ్రాదాన్నీ.!) అని తోటికాపరి ఖీమ్యా దెప్పిండు.! “ఏ థమ్ భనోయ్ వోర్ భూఖ్ మాలమ్వేన్సదాయ్ కాఁయ్ వాతే వో ..!” (ఏ.,ఊర్కో.! బావా.! దానాకలి దెల్సిగూడ ఏం మాటలవి.!”) వోన చరాయొజకోన్ ధేర్పణీ..!, ఆ ! మంద ఉటాడేవేళవేగిచఁ, ఆ ! దస్సేక్కాఁయ్ పేట్ భర్లాఁ !” (“దాన్నిమేపింది సాల్లేగనీ..! దా ! మందలేపే యాలైంది, దా!కడుపుకంత మెతుకులు గట్టుకుందాం !”) అంటూ కూడువేపు సాగిండు ఖీమ్యా. “ఆఁవూఁచుఁలా ! తూ ఖో !” (వత్తాలే., నువ్వుదిను”)అంటూ బుజ్జివేపు సూసిండు లక్పతి,బొర్ర బిగదన్నేలా బిర్రుగా లాగించి,బక్కమేకలకి ఇక తినమని ఆనతిచ్చినట్లుగా మా గారంగా వచ్చి లక్పతిభుజంతో తన ఈపు రుద్దసాగింది బుజ్జి,తల నిమురుతూ.,”పేట్ భరాగోక? కొండా ! ఆ..!” (“పొట్టనిండిందా ? కొండా..! దా.!”) కూసోమన్నట్టుగా నేలని తట్టిండు లక్పతి. బుజ్జి కూసోని తలను లక్పతి వళ్ళోకి మాముద్దుగా సాపింది, బుగ్గలువట్టుకొని అటూఇటూ ఊపుతూ ముద్దుజేసిండు లక్పతి,పెతీదినం లేసినెంటనే,లక్పతి జేసే

దినసెర్యగిది

లక్పతికి బుజ్జంటే పానం.పొద్దుపొడుపుసందీ  పొద్దుగుంకేదాంక బుజ్జే తనలోకం.! బుజ్జి కూడా లక్పతినొదిలి ఓ నిముసమైనా ఉండలేదు,పుట్టిన నెలల్నే తల్లిని పెంజర కాటుకు కాన్కిచ్చుకుంది బుజ్జి,గప్పటిసంది అన్నీ తానై బుజ్జిని సాకుతుండు లక్పతి.

  కూడుదిన్నాక మందని దగ్గర్లో నున్న బీళ్ళవైపు తోలుకెల్తరు కాపర్లు,రెండు మూడు మందలు కలగలిపి మేపుతుంటరు, ఇందులో ఖీమ్యాకు లక్పతికి దూరపు సుట్టరికమూ ఉంది. మజ్జానం ఎండకు ఓర్సుకోక దూపకు అల్లాడే మందని దగ్గర్లో వాగు-వొర్రెలేపుకు మలుపతరు,నీల్లుతాగి ఒక్కోటిగా ఒడ్డుకెక్కి సుట్టువట్ల పచ్చిక బీళ్ళలో బోడగుట్టల్లో- పొదల్లో పొద్దుగుంకేదాంక మేసే మందని అటెంక, దగ్గర్లో ఒప్పొందాలు సేసుకున్న రైతుసెల్కల్లోకి ఇడిదికై తోలుకొస్తరు కాపర్లు

వారం పదిరోజులు ఇడిదూళ్ళ సెల్కల్లో గిదే

దినసెర్య గీ కూచిపుడితండా గొర్ల-మేకలకాపర్లకి.

మర్నాటి ఉదయం “హే ! భనోయ్ బుజ్జీని దేఖ్తోరో !,అబ్బజ్ పాలో తోడ్లావూఁచూఁ !”

(“ఓ బావో.! బుజ్జిని సూస్తుండుండ్రి ఇప్పుడే తీగదెంపుకొస్తా.! అంటూ ఉర్కుతున్న లక్పతిని ఎనకనుంచి “జల్దీ ఆజోరే..! తూఁ కాఁయ్ ఢీలో ఆయొకతో బర్కా-బర్కాన్ హమార్ ధమ్ కాణాకచ ఈ!”  (“జల్దీరారో.,నువ్వు రావడం ఆలస్యమైతే అరిచి అరచి మా పానాలు తోడేస్తదిదీ.!”) లక్పతి ఎల్లినవేపే ఓరగా చూస్తున్న బుజ్జిని జూస్తూ ఖీమ్యా అన్నడు,లక్పతి ఎల్లిన 

ఓ పది నిముసాలకి “కాఁయ్రో! ఖీమ్యా ! కూఁకన్ ఛీ!మార్ బేటా కేవ్డీగోచ ? (“ఏంరో .! ఖీమ్యా .! గెట్లున్నవ్!మావోడేటెల్లిండు”) 

అనీ ఎనకనుంచి భుజం తట్టిండు లక్పతి నాయన భీమ్లా! ” వో మామా! అబ్బజ్ క, ఆయేరో! పాలొతోడ్లాఁవ్కన్ గోచ! ఉదే ఆరోచ,ఏర్ లక్పతీ తరాప్ ఆయొచరే..!” 

(“ఓ మావా.! ఇప్పుడేనా రావడం, తీగదెంపుకొస్తనని ఎల్లిండు.” “అదిగో వస్తండు.!” ఓరారీ ..! లక్పతిగా.,

మీ నాయనొచ్చిండ్రా.!”)జల్దీ రమ్మన్నట్టుగా అర్సిండు ఖీమ్యా .! పొదల్నుంచి దెంపుకొచ్చిన పాలోని (పచ్చనితీగల్ని) 

బుజ్జి ముందు పడేసి,ఆనందంగా “కాఁయ్ బా కూఁకన్ఛీ? ఏవ్డి ఆయో ! కాఁయ్ వాత్ ఛ ?” (“ఏం నాయనా !ఎట్లున్నవే ! గిటొచ్చినవ్,ఏంటిసయం”)రొప్పుతూ అడిగిండు లక్పతి.

“కాలజ్ సివరాత్రీ గీచ, అబ్ వోర్ పచ్చావజకోన్ కాఁయ్ కో హర్దేఆరోకోనీ !?బేటా !”(“మొన్నే సివరాత్రి ఎల్లిందిగా,ఇక దానెనక వచ్చేదేముందో గుర్తుకురాట్లేదా.!? బిడ్డా.!”) “ఓహ్! భూల్గో ! హోళీన పొన్గోస్ పోల్ తిర్పతమ్మ యాడీర్ హాటేర్ మొక్కుఛకోనికా? (“ఓహ్ ! మర్సిపోయిన ., హోళీకి పొన్గోస్ పోల్ (పెనుగ్రంచిప్రోలు) తిర్పతమ్మ తల్లి హాటేర్ మొక్కుందిగందా!? ) మొత్తానికి సోయిలోకొచ్చిండు లక్పతి ! “సవార్ పర్భాతి తాఁణు హాటేమా రేణూఁ! తోనన్ బక్రాన లేజావుకన్ ఆయోచుఁ”! (“రేపు తెల్లార్తె ఉండాలి జాతరలో.! నిన్ను,పోతును తీసుకెల్దామని వచ్చా.!”) “ధేరాచ్చోపణన్ అబ్ దేర్ కరనజూఁ మందమా పక్కో తాజావేరొజకోన్ బక్రాన ధూఁడ్!”(“సరేగనీ ఇగ ఆలస్యం చేయకుండా మందలో బాగా బలిసిన మేకపోతును సూడు”) అన్నడు బీమ్లా, “తాజవేరోజకోన్ బక్రా” (బలిసినపోతు) అనగానే ఉలిక్కివడ్డడు లక్పతి,నాయన సూపు యాడ బుజ్జిపైన పడుద్దోనని భయపడసాగిండు.! “కాఁయ్ రా! ధూఁడ్ కతో.., మోటోబీసార్ జూఁ దేఖ్రోచీ! తాతివేనిపణీన్ కత్త? అపణ్ మందా !” (“ఏంరా! ఎతకమంటే జంగవిల్లిలా సూత్తావేంద్రా! నీ వల్ల అవ్వదుగనీ,యాడ మన మంద.!”) అని ఎతకబట్టిండు భీమ్లా! ఆయన సూపు తిన్నగా మేతమేస్తున్న బుజ్జిపైనే పడింది.!”హాఁ ఈ బక్రా పూర్వేజాచ అపణేన !”( హా.! ఈ పోతు సరిపోద్ది మనకు.!” ) అంటూ బుజ్జిమెడకు బుడ్డతాడు కట్టవోతున్న నాయనకు “చాఁయ్నీ బా! చాఁయ్నీ ! తోన చాఁవ్ణూఁకతో ఏర్ బద్లేమా జోడేర్ బక్రా లేజామా! ఏన్ ఛోడ్దబా! ఈ మార్ దమ్మేతిదమ్”! (“వద్దు నాయనా వద్దు, నీగ్గావలంటే దీనికి బదులు జోడు పోతులు దీస్కెల్దాం, కాని దీన్నిడిసిపెట్టు నాయనా.! గిది నా పానం.”)బతిమాల్తూ అన్నాడు లక్పతి.”హావ మామా! వూ కేరొజకోన్ సాసిచ,వూ బక్రా న రతో వోరో ఏక్ ఆంగ్ సదాయ్ ముణాఁగ్ పడేని,వోన ఛోడ్దేన్ దూసర్ కూఁణ్సీవతో లేజావ్!” (“అవును మావా ఆడు సెప్పేది నిజం,అదిలేకుంటే వాడి కాలు కూడా కదల్దూ దాన్ని గాకుండ ఏరేదేదైనా దీస్కెల్లండి.!”) లక్పతికి మద్దత్తు నిల్సిండు ఖీమ్యా.”ఎహే! మూఁడొబూర్లో మూఁడెపర ముచ్చే ఆతేసాం ధొరియావూర్ జూఁ వాతేకరేర్జల్లీదే! జర సోయిమారేన్ వాతేకరో!ధేరాచ్చోపణన్, తమార్ కామ్దేనిజకోన్ వాతేవుతీ మన్కాఁయ్ కామ్పణీన్,చల్ జాఁవాఁచా!” (ఏ ..! మూస్కోండ్రి! మూతిమీన మీసాలొచ్చేపాటికి ఓ మోతెబర్లెక్క ఒర్లవట్టిండ్రు! జర్రంత సోయిలోకొచ్చి

మాట్లాడుండ్రి !సర్లే మీ లోల్లితో నాకేం పనిగనీ,పద ఎల్దాం,” ) బుజ్జి మెడ్గట్టిన బుడ్డతాడును లాగుతూ.,లక్పతితో అన్నడు “బా !చాఁయ్నీ తార్ టాంగేధోకూఁచూ ఏన చాయ్నీ,తూ జోర్ కరస్తో మ ఆఁవూఁని!”(“నాయనా.! వద్దూ.! నీకాల్మొక్తా!దీన్ని వద్దూ,నువ్వు మరీ బలంతం జేస్తే 

నే రాను.!”) కోపంతో అలిగినట్టుగా మొకందిప్పుకొని మాట్లాడిండు లక్పతి. “కాఁయ్ చాఁయ్నీ ? కసన్ ఆయేస్నీ ? ఏర్ బమ్మెండా ! పచాస్ ఛేళి-గోర్లీర్ మందా ఆజ్ పాఁచ్ సో వీచ,ఘరేమా ఎగసామి ఖండీర్- ఖండీ పాత్రా ఘాల్రేచాఁ! యే .. సే ! వో .. యాడీయ్ దయా-ధరమ్ న రజూఁ వే

కేలేరోచిక !?” (ఏం వద్దు.!? ఎందుకు రావు.!? అరే బుర్రతక్కువ బాడ్కావ్.! ఏబై మేకలున్న మంద గీ దినాం ఐదొందలైంది,ఇంటికాడ ఎవుసాయం,పుట్లకు పుట్లు పాతరేసినం! 

గీ యన్నీ గా అమ్మోరి దయలేకుండనే అయినయనుకుంటున్నవా.!?”) అగ్గిబరాట అయ్యిండు భీమ్లా ! ఒకింత గొంతువెంచి 

మార్ దమ్,మారిష్టం కన్ కూఁణస్ కేలాచకో వూఁదనజ్ దేణూఁ ఓ యాడీన,కోని-కోని వూజ్ కోరన్ లేలచ,మ ఆన్ ఏ బక్రాన మ వీఁడేరో సదాయ్ ఓ యాడీర్ ఆదేసేర్జూఁ కేలేణూ!అజ్కేదమ్మూ ఆవునీ-చాయ్నీ కన్ బమ్మెండివాతే మూఁణేతి బక్మత్!”

 (“నా ప్రాణం నా కిష్టం అనుకుంటాంగందా, మనకేది ఇష్టమో గదే .. ఇవ్వాలి, గా .. అమ్మకి.! కాదు కాదూ.! తనే కోరి దీస్కుంటది,నేనొచ్చి దీన్నే కోరడం గూడా.. గా .. తల్లి ఆదేసమే.!మల్లోపాలి రాను.! వద్దూ.! అని అత్తి-పిత్తి మాటలు ఒర్లమాకు .!”)గుడ్లురిమి ఒకింత గద్దించి సెప్పిండు భీమ్లా,ఇంత సెప్పినంక నాయనని ఎదిరించే దమ్ములేక,బేలగా బుజ్జితో పాటు నాయనెంట నడిసిండు లక్పతి.”ఏర్ ఖీమ్యా! మందాన ఆచ్ఛో దేఖ్లా,ఘర్జాన్ బాఁయాన మేలూఁచూఁలా!” (” ఓర్ ఖీమ్యా .! జీవాలు జాగర్తా ..! ఇంటికి ఎల్లినంకా, జీతగాణ్ని తోల్తాలే ..!) అంటూ.,ముందుకు సాగిండు భీమ్లా “ధేరాచ్చో మామా !” (“సరే మామా !”) అన్నడు ఖీమ్యా .! మంద అంతా., వెళ్ళిపోతున్న బుజ్జి కోసం,ఒక్కోటిగా వెనుకనుంచి అరుస్తున్నయి.!

       ఇంటికాడ అంతా సిద్దంగా ఉంచిండ్రు ఇల్లంతా అమ్మోరి పాటలతో మారుమోగిపోతుంది !బుజ్జికి తానం సేయించి పసుపు-కుంకుమలు జల్లి ,కాళ్ళకు 

గజ్జెలుగట్టి టాక్టర్ ఎక్కించిండ్రు,టాక్టర్ కి ముందు ప్రెభ,మైకులను ఏర్పాటు సేసి,సరంజామా ఏస్కోని,బంధువులంతా ఎక్కినంకా,లక్పతి ఎక్కి బుజ్జి పక్కన కూసున్నడు,సివరికి భీమ్లా టాక్టర్ ముందు కొబ్బరికాయకొట్టి, పోనియ్యమన్నడు టాక్టర్ని ,మజ్జరేతిరి షురూ అయ్యింది టాక్టర్.! దార్లో ఎదురైన జీతగాడ్ని మందతానికి పొమ్మన్నడు భీమ్లా.ఇటు జూస్తే లక్పతి మనేదివడ్డడు, అమ్మ ద్వాళీ బంధువులంతా తనతో అర్సుకుంటున్నా పరధ్యానంగా జీవిడిసిన మొకంలా బదులిస్తున్నడు, బుజ్జిని చూసినపుడల్లా గుండెని కత్తితో కోస్తున్నట్లుంది లక్పతికి.! మొత్తానికి రాత్రి పయనం పూర్తై పొద్దుపొడుపుకు పొన్గోస్ పోల్ (పెనుగంచిప్రోలు) అమ్మవారి ఆలయానికి సేరుకుంది టాక్టర్.!

   గుడి సుట్టూ పెదక్షినల కోసం బుజ్జిని దించిండ్రు! లక్పతి నాయన భీమ్లా తాడువట్టుకొని గుంజుతున్న కదలకపోయేపాటికి, ఒక బంధువు దిగి కర్రవట్టుకొని కొట్టబోయేది సూసిన లక్పతి టాక్టర్ నుంచి దూంకి అతన్ని తోసేసిండు, లక్పతిని సూసి కదిలింది బుజ్జి. నాయన నుంచి తను తాడువట్టుకొని తంతు కానిచ్చిండు, గుడికి ముందున్న మున్నేరు ఇసుకదిబ్బలపై ఆపిండ్రు టాక్టర్ని.సరంజామ అంతా దించుతుంటే,జావగారివోతున్న లక్పతిని చూసి అమ్మ ద్వాళీ “కాఁయ్ వేగోకన్ బేటా!అత్రాయ్ హాయిఘాల్లిదోచి! హను హాయిఘాల్లమత్ బేటా!”(“ఏమయిందని బిడ్డా ! అంత దిగులువడుతుండవ్ ! గట్ల మనేదివడకు బిడ్డా!)యని ఓదార్చబోయింది ద్వాళీ !”హనుకోని యాడీ ! మందామా అత్రా బక్రావురేతా సదాయ్, బా! మాపర రీస్ ఘాఁల్లీదోజూఁ ఏ బక్రానజ్ వీఁడ్నూక ? పాప్ లాగ్య యాడీ! ఈ యాడిమర్గొజకోన్ పిల్లా యాడీ! వోన మార్ హాతేతి పాళోజకోన్ ఏ దాడేర్వాసుక ? యాడీ!వూ తాజవతో ఓన భవానీర్ బక్రా కర్యకన్ మాఁలమ్వీవతో వోన అత్రాలాడేతి పాళ్తోకొని యాడీ!” ఏబా ! ఆజ్ మ పాళోజకోనజ్ లాడజ్ వోర్ దమ్

లేరిజూఁవేగీ !” (“అదికాదమ్మా.! మందలో అన్ని పోతులుండగా,నాయన నా మీనే పగవట్టినట్లు దీన్నే ఏరాల్నా !? పాపం తల్లి లేనిదమ్మా.! నా సేతులతో పెంచి పెద్దచేసింది దాని దినానికా‌ !? అది బలుస్తే.! బలిపసువును సేత్తారంటే అంత ముద్దుగా పెంచేవాణ్ని కానమ్మా.! అయ్యో !

గీ దినం నా పెంపకమే.! దాని పానాలు పోయేందుకు కారణమయితాందిగందా.!” ) కండ్లనీల్లు నింపుకుంటూ తల్లికి సెబుతున్నాడు లక్పతి.”చాఁయ్నీ బేటా !

హను మూఁణ్యా ఆవజూ వాతే కర్మత్ బేటా!

భవానీన రీస్ ఆవ్జాయ ! మా సోనేర్ బేటా తూఁ దస్సేకో శాంతమేతి ర బేటా ! ‘బా’..తీ

రాడ్ చాఁయ్నీ !”(“వద్దు, అలా ఒర్లకు అమ్మ కోపమైతది! మా బంగారు బిడ్డవి కదూ., కొద్దిగ శాంతంగుండు బిడ్డా ! నాయనతో తాకులాటలొద్దు !”)అంటున్న అమ్మ ద్వాళీ మాటలకు 

“శాంతమ్ క ? ఛీ ..!” (“శాంతమా .?” సీ.!) అని ఇసురుగా లేచి దూరంగా ఇసుకతిన్నెలవేపు కదిలిండు.!”బేటా ! కత్తజారోచిరా!? (“బిడ్డా ఎక్కడికీరా.!?”) బతిమాల్తున్న అమ్మపిలుపును కూడా ఇనిపించుకోకుండా .!!

    ఈడ అమ్మవారి గుడికెదురుగా బుజ్జిని వుంచి’జల్తా'(దడ్ధడీ)తంతుని మొదలెట్టిండ్రు బంధుగణమంతా.! ఇత్తడి పళ్ళెంలో సిన్నపాటి అమ్మోరి రాగిప్రతిమనెట్టి,అగరొత్తులు ఎలిగించి,ఒక్కొక్కరుగా వచ్చి బొట్లువెట్టి మొక్కుకుంటున్నరు,సివరగా భీమ్లా కొబ్బరికాయ కొట్టి “యాడీ తూఁ మన్న దినీజేమాతి తోన దస్సేకో దేలేరోచూఁ యాడీ! యాడీ! సంతోసేతే లేలేణూఁ మార్ యాడీ ! లేల యాడీ !” (“అమ్మా.!నాకు నువ్విచ్చిన దాంట్లో.,నీకు కొద్దిగా ఇచ్చుకుంటున్నానమ్మా.! తల్లీ.! సంతోసంగా దీస్కోవాలా.! దీస్కో తల్లీ.!”)అంటూ అమ్మోరికి మొక్కిండు.! బుజ్జిలో ఏ చలనం లేదు, గీ మజ్జెలో బంధువులు మల్లోపాలి పసుపు-కుంకుమ నీళ్ళని బుజ్జి ఈపుపైన,సెవుల్లో సల్లిన్రు! ఐన బుజ్జిలో 

ఏ సెలనం లేదు.”యాడీ లేలేణూఁ! అబ్బేర్సారి రీస్ కరీస్తో ఫేర్ అజ్జేక్దమ్మూ ఆయాకోని !”(” తల్లీ.! దీస్కో.! ఈసారి మారంచేస్తే ఇంకోసారి రాలేము.!”) బంధువుల్లో ఎవరి కంఠమో అమ్మోరిని 

బ్లాక్ మేయిల్ చేస్తుంది.! బుజ్జీ.! అటూఇటూ చూస్తూ.,మజ్జె-మజ్జెలో “మే.!”అని లక్పతికి ఫిర్యాదు సేస్తున్నది.! “ఘరేమా సే ధోకేక !?” (“ఇంట్లో వాళ్ళందరూ మొక్కిండ్రా.!!?”) ఓ పండుముసలి బంధువు ప్రశ్న.! వెంటనే లక్పతి మెదిలిండు భీమ్లాకు!భార్య ద్వాళీవైపు జూసి “ఊ కత్త ?” (“గాడేడీ.!”) గుడ్లురిమిండు.! గీలోపే లక్పతి కోసం పరిగెత్తిండ్రు సుట్టాలు, ఇసకతిన్నెల్లో.! యాడో బైరాగైన లక్పతిని అతికష్టమీన తీసుకొచ్చిండ్రు.!”కత్త గోర ?” కాఁయ్ తమాషా కర్రోచిక ? ఆ..!బక్రాన బొట్టుమేలన్ ధోక్ !” (“ఏడబోయినవ్రా.! ఏం తమాషాలు జేస్తుండవా.!? దా.!పోతుకు బొట్టువెట్టి మొక్కూ..!) హుంకరించిండు భీమ్లా ! చేసేది లేక కుంకుమ జల్లీ.! “జాఁన్ ఆ దోస్త్ !” (“ఎల్లిరా నేస్తం.!”) అని మనసులో ఉప్పొంగుతున్న దుఃఖాన్ని అతికష్టంమీన దిగమింగుకుంటా..,తనవేపు ఆప్యాయంగా చూస్తున్న బుజ్జి కళ్ళలో కళ్ళెట్టి బొట్టెడుతూ., దుఃఖమాపుకోలేక బావురమన్నడు.! లక్పతి దుఃఖాన్ని చూసి తను కూడా” మే..! మే.!” అని అరవసాగింది.! అమ్మొచ్చి ఓదార్సి పక్కకు తీసుకెళ్ళింది లక్పతిని. లక్పతి వచ్చిన

ఆనందమో.! ఏమోగనీ ఒక్కసారిగా ఒళ్ళంతా జలదరించేసింది బుజ్జి.! “యాడీ శాప్ణీ లేల్దీ! కత్రవతో సత్తేర్ యాడీ చీ తూఁ!” (“అమ్మ తీసుకొంది,ఎంతైన మహిమగల తల్లివమ్మా నువ్వూ !”) అని అమ్మోరికి మల్లోపాలి మొక్కిండ్రు అందరూ.!

   తరువాత తట్టల్లో ఉన్న కత్తులు,కత్తిపీఠలు బైటికి పెడుతూ.,”అరే లక్పతి సహసఖ్యకోని వోన దూర్ లేజావ్ !”(అరేయ్ లక్పతిగాడు తట్టుకోలేడు”)వాణ్ని దూరం తీసుకెళ్ళమని చెప్పిండు భీమ్లా .! సిన్నపిల్లలందరిని టాక్టర్ తొట్లో దాక్కోమన్నరు, ఐనా పిల్లలు నక్కి నక్కి తంతునంతా సూస్తున్నరు,సిన్నపాటి ఆంబోతులా ఉన్న బుజ్జిని బలికోసమని

ఓ ముగ్గురు బంధువులు గూడి పడేసిండ్రు.! ఎంత ఇసురుగా పడేసిండ్రో.! అంతే ఏగంగా లేచి నుల్సుంది బుజ్జి.ఈసారి ఇంకో ఇద్దరు గూడి మళ్ళీ పడేసిండ్రు,ఈపాలి మరింత ఏగంగా లేచినుల్సుంది,అలాగే తనను పడేస్తున్నవాళ్ళ గురించి లక్పతికి ఫిర్యాదు సేస్తున్నట్లుగా ఇంకా పెద్దగా ” మే.! మే.!” అని అరువబట్టింది బుజ్జి,తన్నూ పడేద్దామని వస్తున్న వాళ్ళని పొడుస్తానన్నట్టుగా మోరెత్తి సూట్టూసూస్తున్నది,ఈపాలి మరింత కసిగా మళ్ళీ పడేసిండ్రు,ఇగ ఏడా లేస్తదోనని ఆబాగా బుజ్జి గొంతుపై కత్తివెట్టికోయబట్టిండ్రు “బే..! మే..!” అరుస్తున్న అరుపులతో పాటు వెచ్చని రగతం సిమ్ముతున్న సప్పుళ్ళు ఇనపడుతున్నాయి, సిమ్మిన రక్తాన్ని దోసిలిలోవట్టి అమ్మోరి రాగిపెతిమపై గుమ్మరించిండు భీమ్లా ! ఓ ఐదు నిముసాల్లో గిలగిలా కొట్టుకొంటూ తన పానాలొదిలింది బుజ్జి.! బుజ్జి తలను తెగ్గొసి, అమ్మ వారి రాగిపెతిమ ముందు ఉంచిండ్రు.! అల్లంత దూరంలో బుజ్జి అరిచిన ప్రతిఅరుపుకి, విలవిల్లాడుతూ.,కాళ్ళమజ్జెన తలవెట్టుకొని పొగిలి-పొగిలి ఏడుస్తున్న లక్పతిని ఆపటం ఎవరివల్లా., కావటం లేదు.! అమ్మోరికి ఎదురుగా తెగ్గోసి పెట్టిన బుజ్జి తల “యాడీ మారో దమ్ లక్పతీ కత్త యాడీ? (“అమ్మా .! 

నా ప్రాణం లక్పతి ఎక్కడమ్మా .!?”) అని నిర్జీవమైన కండ్లతో అమ్మోరిని దీనంగా అర్థిస్తున్నట్లుగా ఉంది.

( తన ఇరువది ఏండ్ల వయసు వరకు 

ఇలాంటి మూగజీవాలనే మేపి,తను గడించిన జీవిత అనుభవాల్లో నుంచి 

ఓ స్మృతిగా మా నాన్న నాకు మిగిల్చిపోయిన ఓ యథార్దగాథ ఇది,

నాన్న ఇచ్చిన స్మృతులకు నివాళులు అర్పిస్తూ..!)

 

*****

Please follow and like us:

5 thoughts on “గోర్ బంజారా కథలు-4 బుజ్జీ ..!”

  1. కథ చాలా గొప్పగా ఉంది అనువాదం ఇవ్వటం వలన అర్ధం అయింది .హృదయంద్రవించేలా ఆపిల్లవాని ఆవేదనను వర్ణించారు. పెంపుడు జంతువులతో మనిషికి అనుబంధం ప్రాచీనకాలంలోనే ఉంది .ఎందుకంటే అందరిలోఅంతర్గగతంగాగల సహజీవభావన ఆవేదన కలిగిస్తుంది .

  2. కథ మొత్త చదివాను, చదవడం మొదలుపెడితే మొత్తం అయిపోయేదాకా చదవాలనిపించే కథ అది.
    చదువుకుంటూ చివరికి పోతుంటే నాకు తెలియకుండానే దు:ఖమొచింది, కళ్ళుచెమ్మగిల్యాయి. లక్పతి ఆ మేకపోతును సోంత బిడ్డా కంటే ెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెె ఎక్కువగా ప్రేమగా పెంచిండు, తన చేతులతో పెంచిన దాన్ని తనకళ్ళముందే బలీస్తూంటే తట్టుకొలేకపోయాడు లక్పతి.
    మొత్తం గా కథ చాల బాగుంది. సహాజమైన భాషను ఉపయేగించడం దీని విశేషత.

  3. స్థానిక భాషలో రాసిన కథ బాగుంది…

  4. మిత్రుడు కృష్ణ రాసిన స్వీయ అనుభవం యధార్థ గాధ హృద్యంగా కళ్ళు తిప్పకుండా చదివేలాగుంది, ప్రతీ పదంలో వైవిధ్యం, భాషలో సహజమైన ఆధిపత్యం ఉట్టిపడుతోంది, మూగజీవాలు మనోవేదన, పెంచిన ప్రేమనేది తన పిల్లలపైనే కాదు, బుజ్జి జీవాలమీదా కావల్సినంత ఉంటుందని కలంతో నిరూపించారు. అవసరమైన చోట తెలుగులో కూడా రాయడం తెలుగు భాషలో పట్టు తెలియజేస్తుంది, హిందీ లోనూ కవితలు, కధలు రాస్తాడంటే సాహిత్య పిపాస, కాలం ఝళిపించే చేయి, పాత జ్ఞాపకాలు, అనుభవాలు, సమకాలీన స్పందన, సామాజిక బాధ్యత కవిగా కృష్ణ నది ఊరికే కూర్చోనివ్వదని అర్ధమవుతోంది. హ్యాట్సాఫ్ డియర్ కృష్ణా మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తోంది.

    1. మీ ఆత్మీయ స్పందనకు నమస్సులు భయ్యా 🙏 Thank you so much

Leave a Reply

Your email address will not be published.