లిలియన్ హెల్ మన్
-ఎన్.ఇన్నయ్య
అమెరికాలో బ్రాడ్ వే థియేటర్స్ లో లిలియన్ హెల్ మన్ రచనల ప్రదర్శన కొన్నేళ్ళు అత్యంత ఆకర్షణీయంగా సాగాయి. ముఖ్యంగా పిల్లలపై ఆమె రచనలు స్టేజి మీద రావడం ఒక విశిష్టతగా చరిత్రకెక్కింది. లిలియన్ ఫ్లారెన్స్ హెల్ మన్ ప్రదర్శనలు కొన్ని తరాల వారిని ఆకట్టుకున్న అంశం అపురూపం. ఆమె ప్రదర్శనలో స్వార్థం పై దాడి, అన్యాయం పై ధ్వజం, దోపిడీ పై పోరాటం అనితర సాధ్యం.
హెల్మన్ రచనలలో చిల్డ్రన్స్ అవర్ 1934 ప్రాంతాలలో రాగా అత్యుత్తమ స్టేజి ప్రదర్శనగా వాసికెక్కింది.
అమెరికాలోని న్యూ ఆర్లియన్స్ రాష్ట్రంలో యూధు కుటుంబంలో 1905లో లిలియన్ పుట్టింది.
ఆమె చదువు అంతా న్యూయార్క్ లో, కొలంబియా విశ్వవిద్యాలయంలో సాగింది.
1925లో ఆర్ధర్ కోబర్ ను హెళ్ళాడిన లిలియన్ కేవలం 7 సంవత్సరాలకే విడిపోయింది.
ఆమెరికాలో ఆరోజులలో హాలివుడ్ లో రాడికల్ రాజకీయ ధోరణులు ప్రబలంగా వుండేవి. అందులో హెల్మన్ కీలక పాత్ర వహించింది.
యూరోప్ దేశాలలో విస్తారంగా పర్యటించిన లిలియన్ విశేష అనుభవం గడించి, బాన్ లో కొన్నాళ్ళు స్థిరపడి చదువులు సాగించింది.
కలం విదిలిస్తే లిలియన్ ఎంతో ఆకర్షణీయమైన స్టేజి ప్రదర్శనలకు ఉపకరించే రచనలు చేసి, రాణించింది.
ఆమె వామపక్ష పక్షపాతంతో, కమ్యూనిస్టు అభిమానిగా వుందని నెపం వేసి, విచారణ జరిపారు. 1950 ప్రాంతాలలో కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలకు అమెరికాలో పెద్ద వ్యతిరేకత వుండేది. ఆమెను ఆ విధంగా విచారణ జరిపి, అభాసుపాలు చేయడానికి ప్రయత్నించారు.
కాని లిలియన్ ఏ మాత్రం రాజీ పడకుండా తన రచనలు సాగించింది. అందరూ పిల్లల పాత్రతో వున్న స్టేజి ప్రదర్శన నాటికీ నేటికీ బహుళ ప్రచారంలో వుంది. అదే చిల్డ్రన్స్ అవర్. అలాగే ది లిటిల్ ఫాక్సస్, వాచ్ ఆన్ ది రైన్ కూడా.
అందరూ అమ్మాయిల పాత్రలే వున్న చిల్డ్రన్స్ అవర్ అపురూపంగా ప్రదర్శితమైంది. సినిమాలలో పేర్కొనదగినవి జూలియ, వాచ్ ఆన్ ది రైన్.
రష్యా సుప్రసిద్ధ రచయిత చెకోవ్ లేఖల్ని 1955లో పరిష్కరించి ప్రచురించింది.
1984 జూన్ 30న మరణించిన లిలియన్ చిరస్మరణీయురాలిగా నిలిచింది
*****