image_print

విజయవంతమైన “అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020)” అంతర్జాల సదస్సు

అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020)  తెలుగు అధ్యయన శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం & నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, కాలిఫోర్నియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల అంతర్జాల సదస్సు నివేదిక  జనవరి19-21, 2021 -ఆచార్య ఆశాజ్యోతి & డా. కె. గీత అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020) అన్న అంశంపై 19.01.2021 నుండి 21.01.2021 వరకు మూడు రోజుల పాటు అంతర్జాల అంతర్జాతీయ సదస్సును […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-1 (మీ పాటకి నా స్వరాలు)”రాధకు నీవేరా ప్రాణం” పాటకి స్వరాలు!

స్వరాలాపన-1  (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

ఇంద్రగంటి జానకీబాల గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత ఇంద్రగంటి జానకీబాల గారు ప్రముఖ రచయిత్రి, గాయని. వీరు ఆరు కథాసంపుటాలు, పన్నెండు నవలలు, ఒక కవితా సంపుటి ప్రచురించారు. సినీనేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం “కొమ్మా కొమ్మా కోయిలమ్మా” వంటివెన్నో వెలువరించారు. జానకీబాల గారు డిసెంబరు 4, 1945న రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ సూరి రామచంద్రశర్మ, శ్రీమతి లక్ష్మీనరసమాంబ. వీరు తణుకులోని సీతామహాలక్ష్మి జిల్లాపరిషత్ బాలికోన్నత […]

Continue Reading
Posted On :

మరో గుండమ్మ కథ

        మరో గుండమ్మ కథ -అక్షర గుండమ్మగారంటే ఎవరో కాదండీ, మా అత్తగారికి అత్తగారైన ఆదిలక్ష్మి అమ్మగారే. వయస్సు ఎనభై ప్లస్సు. మొత్తం ఇంటికి బాసు. ఏమంటారా? ఆ పరమాత్మ ఆనతి లేనిదే ఆకైనా కదులుతుందేమోకానీ ఈ ఆదిలక్ష్మిగారి అనుమతి లేనిదే మా ఇంట్లో మంచినీళ్లయినా పుట్టవు. అదేమంటారా? అది ఆవిడ అదృష్టం. మన ప్రాప్తం. ఏదేమైనా ఆవిడకు ఆఇంట్లో ఉన్న పవర్ చూసి, ఆవిడ ఆకారానికి తగ్గట్టుగా గుండమ్మ అని, బిగ్ బాస్ అని పేర్లు పెట్టాము. […]

Continue Reading
Posted On :

గంగ ఎక్కడికెళుతోంది? జయకాంతన్ తమిళ నవలకు జిల్లేళ్ళ బాలాజీ తెలుగు అనువాదం-

గంగ ఎక్కడికెళుతోంది? జయకాంతన్ తమిళ నవలకు జిల్లేళ్ళ బాలాజీ తెలుగు అనువాదం  -పి.జ్యోతి గంగ ఎక్కడికెళుతోంది?…. ఇది తమిళంలో వ్రాసిన “గంగై ఎంగే పోగిరాళి”? అనే జయకాంతన్ గారి నవలకు తెలుగు అనువాదం. దీన్ని జెల్లేళ్ళ బాలాజీ గారు అనువాదం చేసారు. 2017 లో విశాలాంధ్ర లో ఇది డైలీ సీరియల్ గా వచ్చింది. పుస్తక రూపంలో 2019 లో వచ్చిన రచన ఇది.  జయకాంతన గారు చాలా ఏళ్ళకు ముందు “అగ్నీ ప్రవేశం” అనే ఒక […]

Continue Reading
Posted On :

కలలు అలలు (కథ)

కలలు అలలు -శాంతి ప్రబోధ పాపాయి షో గ్రౌండ్స్ కి బయలుదేరింది. ఆ గ్రౌండ్స్ లో పిల్లలకోసం మంచి పార్క్ , రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి . బయట చల్లటి చలిగాలి వీస్తున్నది.  అందుకే వాళ్ళమ్మ పాపాయికి  చలికోటు , బూట్లు , సాక్స్ వేసింది. సాధారణంగా ప్రతి రోజూ  పాపాయి బయటికి వెళ్తుంది . అలా పార్కుకో, గ్రౌండ్స్ కో వెళ్లి అక్కడ కొంత సేపు గడపడం పాపాయికి చాలా ఇష్టం. ఆ పార్కుల్లో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఫిబ్రవరి, 2021

“నెచ్చెలి”మాట  చదువు ఉపయోగం -డా|| కె.గీత  చదువు ఉపయోగం ఏవిటంటే- దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు… టెక్నాలజీలో అన్ని దేశాల కన్నా ముందుండవచ్చు… దేశం….. అబ్బా! అడిగేది దేశం గురించి ఊకదంపుడు ఉపన్యాసం కాదు మామూలు మనుషుల గురించి అంటారా? చదువుకుంటే సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు… మూఢనమ్మకాలు పారద్రోలవచ్చు… నైతిక ప్రవర్తన నేర్చుకోవచ్చు… ఇన్నొద్దుగానీ ఇంకో మాటేదైనా చెప్పమంటారా? చదువుకుంటే తెలివి పెరుగుతుంది తిక్క కుదురుతుంది లాంటివి కాకుండా అసలు సిసలైనవేవిటంటే పొట్టకూటికి తప్పనివైనా తక్కువ తిప్పలు […]

Continue Reading
Posted On :

నిన్ను చూడకుంటే నాకు బెంగ (కథ)

నిన్ను చూడకుంటే నాకు బెంగ -జానకీ చామర్తి తలుపు తీయంగానే విసురుగా తాకిన హేమంతగాలికి కట్టుకున్న నూలు చీర ఆపలేక వణికింది విజయ. అమ్మ చీర , రాత్రి రాగానే పెట్లోంచి తీసి కట్టేసుకుంది .. చూసుకు నవ్వుకుంది, పెద్దవాళ్ళచీరలా ఉందని.నీళ్ళ పొయ్యి ముందుకు వచ్చి , మోకాళ్ళు మునగదీసుకు కూచుని , అరచేతులు చాపి మంట వేడికి వెచ్చపెట్టి చెంపలకు తాకించుకుంటోంది. నీళ్ళకాగులో నీళ్ళు కాగే కళపెళా చప్పుడు వింటూ కేకెట్టింది, “ నీళ్ళు కాగాయి, ఎవరు పోసుకుంటారు “ […]

Continue Reading
Posted On :

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం -శీలా సుభద్రా దేవి వందేళ్ళ తెలుగు కథానికా ప్రస్థానంలో రచయిత్రుల కథానికల్లోని భాష కాలక్రమేణా ఏవిధంగా, ఏ రకమైన మార్పులకు లోనైందీ, నాటినుండి నేటివరకూ సామాజిక జీవితంలోని మార్పులు భాషపై ఏ రకంగా ప్రభావం చూపాయనే విషయాల్నీ, నా పరిశీలనాంశాలనూ ఈ వ్యాసంలో ప్రస్తావించదలిచాను. ఏ కాలంలో జీవిస్తున్న రచయిత్రి రచనలపై ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రభావం ప్రతిబింబించటం సహజం అనేది ప్రతితరంలోనూ గమనించగలం. తొలితరం కథారచయిత్రులు సుమారు పదిహేనుమంది వరకూ ఉన్నట్లు […]

Continue Reading

గోర్ బంజారా కథలు-5 “సంకల్పం”

బుజ్జీ ..!  -కృష్ణ గుగులోత్ అప్పడే పర్సుకుంటున్న లేల్యాత ఎండలో ఆత్రంగా తుమ్మకాయల్ని ఏరుకుంటున్నడు లక్పతి.కొద్దిసేపయ్యాక తలకు సుట్టుకున్న తువ్వాలిప్పి ఏరిన తుమ్మకాయల్ని మూటగట్టుకొని సెల్కల్లో ఉన్న తమ గొర్ల- మేకలమందవైపుసాగిండు. మందతానికొచ్చాక “బుజ్జీ.!”అని తనగారాల మేకపోతుకు కేకేసిండు,గంతే ఒక్కపాలి దిగ్గునలేచి లక్పతి ముందు వాలిపోయింది ‘బుజ్జి’, తొందరగా తువ్వాలిప్పమన్నట్టుగా నానా హడావిడి సేస్తున్న బుజ్జితో.,”ఏహే ! థమ్ర, తార్వాసుతో కాఁయ్ లాయొజకోన్ ! ఇదె ఖో “!  (“ఏహే ! ఆగరా..! నీకోసమే కదా దీస్కొచ్చింది, […]

Continue Reading
Posted On :

ఖాళీ (కవిత)

    ఖాళీ -డా.సి.భవానీదేవి ఇప్పుడంతా ఖాళీయేఇల్లు..మనసు..కలల ఖజానా ఎన్నో దశాబ్దాలుగా సేకరించి పెట్టుకున్నఅక్షర హాలికుల సేద్య ఫలాలు…. స్వర శిఖర సంభావిత సంపూజ్యరాగమాంత్రికుల మధుర గళ మధురిమలు సాహితీ ప్రకాండుల సభా సందర్భాలనుమనోనేత్రంలో  చిర చిత్రణ చేసిన జ్ఞాపికలు బాల్యం తాగించిన అమ్మ నాన్నల అనంతామృత ధారల ప్రేమ ఉయ్యాలలు చదువు..సంస్కారం ప్రసరించినగురువుల ప్రశంసల ఆశీస్సులు బాల్యంలో హత్తుకున్న కలం ప్రకటించినఅనేకానేక రచనల సమాహారాలు చిన్నప్పటి నుండి నా ఆశల స్వప్నాల్నీనా కన్నీటి తడిని చదివిన వంటపాత్రలు దూరమయిన రక్తబంధాల ఆనవాళ్ళుదగ్గరయిన ఆత్మబంధువుల ఆప్యాయతలు జీవితంలో ప్రతి క్షణం ..వెలుగు నీడలుమనసుగదిలో […]

Continue Reading
Posted On :

ప్రేమ (కవిత)

  ప్రేమ -డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రేమంటే ఏమిటి? అడిగిందో ప్రేయసిగా ఎదుటివారి కోసం ఏదైనా చేయగలగడం – చెప్పాడతడు తన సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధపడిందామె ఏదైనా చేయగలగడమంటే కోట్లు వెచ్చించి కొనుక్కోగలగడం తత్వబోధ చేసి తాపీగా వెళ్ళిపోయాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో భార్యగా బాధ్యతగా బ్రతకడమే- బదులిచ్చాడతడు విరామమే మరిచి అతడి విలాసానికి వెలుగై నిలిచిందామె కళాత్మకత తెలియని కఠిన శిలవంటూ సరస సల్లాపాల డోలలాడించగల మోహిని ముందు మోకరిల్లాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో తల్లిగా రక్త మాంసాలను ధారపోయడమే- బదులిచ్చాడతడు జీవితాన్నే ధారపోసిందామె రెక్కలొచ్చిన పక్షి తన గూటిని వెతుక్కుంది మీలో ఎవరైనా నన్ను ప్రేమించగలరా? అడిగిందామె అది అన్ కండీషనల్ ప్రేమించడమే నీ వంతు సమాధానమిచ్చారు ముగ్గురూ! **** డా. నల్లపనేని విజయలక్ష్మి.డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. వీరి కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

Continue Reading

దినచర్య (కవిత)

దినచర్య -పద్మావతి రాంభక్త బహుశా మీరనుకుంటారేమో నా ఖాళీ సమయాలన్నీ అక్షరాలుగా తర్జుమా అవుతుంటాయని ఉదయం లేచీ లేవగానే నా మెదడు నిండా అంటుకున్న కలల శకలాలను దులిపి వాస్తవాన్ని కౌగిలించుకున్నప్పుడు నిన్నటి జ్ఞాపకమేదో నా మనసులోకి వద్దన్నా జొరబడి వంటింట్లోని  పోపుగింజలా అక్షరమై చిటపటలాడుతుంది లోపల వర్షం బయట వర్షంతో జతగూడినపుడు నేను తడిమేఘమై కురిసిపోతుంటాను కిటికీలోనుండి ప్రవేశిస్తున్న రవికిరణాలలోని వెచ్చదనాన్ని కట్టగట్టినపుడు ఒక నులివెచ్చని వాక్యమై వాలిపోతాను గడ్డకట్టిన కాలం కన్నీటి సంతకాలతో తుపానులతో […]

Continue Reading

స్వేచ్ఛ (కవిత)

స్వేచ్ఛ -పి.సుష్మ వాళ్లంతా భద్రత అనే బంగారు పంజరంలో బందీలు రెక్కల క్రింద స్వేచ్ఛను కట్టేసుకొని అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటారు ఎగిరే కొద్దీ వెనక్కిలాగే వాళ్ళు కొందరు స్వేచ్ఛ ఇచ్చామని అంటూనే రెక్కలు విరిచేస్తూ ఉంటారు ఇంకొందరు విరిగిపోయిన రెక్కలు ఈకలై ఎగిరిపోవడం చూసే ఉంటావు అది ఎవరికీ భయపడని స్వేచ్ఛ ఈకలన్ని చదివే ఉంటాయి ఆకతాయి గాలి చేష్టలు అయ్యో అంటూ అక్కున చేర్చుకున్న బండరాయి సందులో కొన్ని ముళ్ళకంపలో కొన్ని ఇలా అక్కడక్కడా […]

Continue Reading
Posted On :