జ్ఞాపకాల సందడి-20
-డి.కామేశ్వరి
మా అన్నయ్య పెళ్లి 68 లో ఢిల్లీ లో జరిగింది. ఆపెళ్ళికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రాష్ట్రపతి, వివి గిరి . మొత్తం ఇందిరాగాంధీ కేబినెట్ మంత్రివర్గం, చీఫ్ జస్టిస్ లాటి పెద్దలు అందరు ఎటెండ్ అయ్యారు. ప్లానింగ్ కమీషన్ మెంబెర్ శ్రీ బుర్ర వెంకటప్పయ్యగారి అమ్మాయి పెళ్లికూతురు. వెంకటప్పయ్యగారు ఆ రోజులలో ఐసిఎస్ అంటే బ్రిటిష్ వారి కాలంలో ఇంగ్లాండ్ వెళ్లి పరీక్షా పాస్ అయి వచ్చి, కలెక్టర్ , సెక్రటరీ లాటి పెద్ద పదవులలో పనిచేసి సెంటర్లో primeminister కాబినెట్ లో పెద్ద అధికార హోదాలో పనిచేస్తున్న ప్లానింగ్ కమిషన్ మెంబర్గా , రూరల్ ఎలెట్రిఫికేషన్ చైర్మన్గా, ఉండేవారు.
స్వతంత్రం రాకముందు బ్రిటిష్ అధికారంలో ఇక్కడ ఒక డిగ్రీ వచ్చాక ఇంగ్లాండ్ వెళ్లిఅక్కడ ఏడాది కొన్ని కోర్సులు చదివి, ఐసిస్ పరీక్షా రాసి పాస్ అవడం అంటే మాటలు కాదు. పెద్దపెద్ద పదవులన్నిటికి దొరలెవుండేవారు, గుమాస్తాలు, టీచర్లు. తాసిల్దార్లు, మునసబులు లాటి ఉద్యోగాలు మాత్రం ఇండియన్స్కి దక్కేవి.
కాలక్రమేణా ఉద్యోగస్తుల అవసరం ఎక్కువయి లా చదవడానికి ,ఐసిస్ ఉద్యోగాలకి కొంతమందిని పంపి వారికీ. పెద్దహోదాలలో ఉద్యోగాలు ఇవ్వడం ఆరంభించారుట. ఆలా వెళ్లి ఐసిఎస్అయి అంటే పెద్దపదవులు pondinavaru sonti rammurtigaru. ముగ్గురు తెలుగువారు మాకు బంధువులు ఉండేవారు. 1919 lo ics chadivi madras ప్రెసిడెన్సీ చీఫ్ సెక్రటరీ గ రిటైర్ అయినవారు. మా అమ్మమ్మకి మేనమామగారు. ఇంకో ఆయన బయ్యా నరసింహం గారు మా పెద్ద అల్లుడికి ముత్తాత. వెంకటప్పయ్యగారు మా అమ్మమ్మ కి ఏదో దూరపు అంటే ఏదో కజిన్స్. ఇంకెవరన్న తెలుగువారు ఐసిస్ లు అయిన వరున్నరేమో నాకు తెలియదు. ఎవరికన్నా తెలిస్తే పేర్లు చెప్పండి. ఇప్పటి ఐఏఎస్ కంటే చాల పవర్ఫుల్ఆరోజుల్లో ఐసీఎస్.
1947 స్వతంత్రంవచ్చాక ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గ మారి ఇండియాలోనే పరీక్షలు జరుగుతున్నాయి . అప్పుడు మా అన్నయ్య నేవీ లో కెప్టెన్ గా వుండి, తరువాత భారత్ ఎలెక్ట్రానిక్స్ చైర్మన్గా రిటైర్ అయ్యాడు. ఆపెళ్ళికి ఆరోజుల్లో ప్రధానమంత్రి,రాష్ట్రపతి లాటి వారంతా వచ్చారంటే మాకు ఎంతో గర్వకారణం. ఆరోజుల్లో ఎంతగొప్పహోదావున్న ఇప్పటిలా పెద్దపెద్ద కళ్యాణమండపాలు ,ఇలాటి డెకరేషన్స్ లేవు.
పెద్ద పెద్ద వారి బంగ్లాల కాంపౌండ్ లోనే షామియానాలు కొద్దిగా అలంకారాలు ,విద్యుత్దీపాలు పెద్దహోదాకనాక సోఫాలు,కార్పెట్లు లాటివి ఉండేవి. వెయ్యి మంది పెట్టె ఎకరాలస్థలం ఉండేది చుట్టూ .అంత గొప్పగా జరిగింది అప్పుడే అందరం రాష్ట్రపతి భవనం చూసొచ్చాం . v .v గిరి గారి భార్యతో టీ తాగాం. అప్పుడు ఇలా ఫోటోలు తీసుకునే వీలు లేదుగదా. తరువాత మాఅన్నయ్య బెల్ చైర్మన్గాఉండగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ఢిల్లీ రమ్మని పిలిచినా రాజకీయవాతావరణంలో స్వేచ్ఛగా పనిచేయలేనని సున్నితంగా తిరస్కరించాడు. అంటే నిజాయితీగ, స్ట్రిక్ట్ గ పని చేయలేమని ఆనాడే అనుకున్నారంటే ఇప్పటి కలంగురించి ఎం చెప్పాలి. ఒక ఫోటో పెడితే బాక్గ్రౌండ్ రాయందే ఈ తరం వారికీ ఆ కాలమాన పరిస్థితులు తెలియాలని అనుకుంట నేను అంతేగాని గొప్పకోసం కాదు ఐసిఎస్ అన్నది ఈ కాలం వారికీ ఎంతమందికి తెలుసు. పాతతరం అనుభవాలు చెపుతుంటేగదా తెలిసేది .
మద్రాస్లో శొంఠి రామమూర్తిగారింటికి అమ్మతో ఒకసారి 1950 లో నాన్న కేరళలో ఉద్యోగం చేస్తుంటే వెడుతుంటే మద్రాసులో trian మారాలి.మద్రాస్చూడడం మొదటిసారి .రామచంద్రపురం పదిహేనేళ్ల పిల్లకి అదే గొప్ప .అలాటిది చీఫ్ సెక్రటరీ గారి బంగ్లా ఆహోదా వారి బ్రిటిషకాలంనాటి ఫుర్నిచర్ ,బుట్లర్లు,కార్లు, అప్పుడు నాలుగు స్టేట్స్ కి అధికారి .బ్రిటిష్ వారి దర్జా ఎలా ఉండేదో నోరెళ్ళబెట్టుకు చూసినరోజు గుర్తుకు తెచ్చుకుంటే ఈ నాటికీ గొప్ప అనుభవమే. మీరెరుగని రోజులు అవి.
న్యాయంకావాలి సినిమా 1981 లో విడుదల అయి చాల విజయవంతమైన సినిమాగా ఎన్నో చోట్ల శతదినోత్సవాలు జరుపుకుని ఆ సంవత్సరం ఉత్తమ సినీ కధ గ ఐదుఅవార్డ్స్ గెలుచుకుని నా కెంతోపేరు తెచ్చిపెట్టింది . ఆ సినిమా చతురలో ప్రచురించబడ్డ కొత్తమలుపు నవల ఆధారం. ఆ సినిమా కేవలం కధాబలంవల్ల విజయ వంతమైన చిత్రం గ పేరుతెచ్చుకుంది. ఎందుకంటే హీరో, హీరోయిన్లు కొత్తవారు, అలాగే దర్శకుడు కోదండరామిరెడ్డిగారు అప్పటికి ఒక సినిమాచేసిన కొత్తవారు. నిర్మాత అభిరుచి వున్న మంచి నిర్మాత క్రాంతికుమారుగారు. ఆ సినిమా చాల చిన్నబడ్జెట్ సినిమా,హంగులు,ఆర్భాటాలు లేకుండా కేవలం ఐదులక్షల రూపాయల బడ్జెట్ తో తీసిన చిత్రం రాధికకి మొదటి తెలుగు చిత్రం చిరంజీవికి కూడా రెండో మూడో చిత్రం. శారద , జగ్గయ్య కేరక్టర్ ఏక్టర్స్. అల్లురామలింగయ్య హాస్యనటులు.అంతే. చాలమాములు లొకేషన్స్ . కేవలం కధలో కొత్తదనం ఉండి విజయవంతమైనది. తెలుగులోనేకాక తరువాత తమిళం లోవిధి, ముఝే ఇన్సాఫ్ చాహియే గ హిందీ, కన్నడ,మలయాళం ఐదు భాషల్లో విజయవంతమైనది. అన్నిటికన్నా తమిళ్లో అఖండ విజయవంతమైనదట. ఒక రచయిత్రిగా నవలకి న్యాయం జరిగిందన్న సంతృప్తి నిచ్చింది. సాధారణంగా ఒక నవలఆధారంగా సినిమా తీసినప్పుడు ఎన్నోమార్పులు చేర్పులు చేసి ఇది నా కథేనా అనిపిస్తుంది రచయితకి.కథేకాక మాటలుకూడా చాలావరకు పుస్తకంలో వేవాడడం ఇంకా సంతృప్తి నిచ్చింది. అవార్డులు ,రివార్డ్ లు తెచ్చిపెట్టిన ఇన్ని భాషల్లో వచ్చిన నాకొచ్చిన మొత్తం పదివేల . అప్పుడు భువనేశ్వర్లో ఉండేదాన్ని. నవల వచ్చిన చాల రోజుల తరువాత తేదీ గుర్తులేదు ఎవరో కొత్త ప్రొడ్యూసర్ ఊరుపేరు వినలేదు. వచ్చి నవల సినిమాగా తీస్తాం అంటూ బేరాలాడి ,కొత్తవాళ్ళం ఫిలిం సక్సెస్ అయితే అప్పుడు మరోసగం ఇస్తాం అంటూ వొప్పించి రెండువేలఐదువందలు చేతిలోపెట్టి డాక్యుమెంట్ రాయించుకున్నారు. నాకు ఎంత అడగాలో ఎలా బేరాలాడలో చేతకాదు. అసలే మోహమాటం సినిమావాళ్ళు ఎవరో ఒకరే కదా వచ్చి అడిగారు .వచ్చిందే దక్కుడనుకుని తీసుకోవాలా సలహా చెప్పేవారేలేరు ఇంకో సగం ఇస్తామంటున్నారు కదా అనుకుని సరే అనేసా. అప్పటికి నా అరుణ నవల 1970 లోముందు పూర్ణచందర్రావుగారు తీసుకుని తరువాత చేతులు మారి రామానాయుడుగారు తీసుకుని ఆలాఉండిపోయింది. ఏంచేస్తారో చేసుకొని వచ్చిందేదో తీసుకోడమే అనే ఒక నిర్వేదంలో వున్న నేను సరేఅన్న. ఒకఏడాది పైన అయినా వాళ్ళు ఉలుకూపలుకు లేదు .భయపడినంత అయింది అనుకున్న ,ఇదిగో అదిగో అంటారుఅడిగితె . ఇలా ఉండగా సడన్గా ఒక రోజు క్రాంతికుమార్గారి అసిస్టెంట్ ఎవరో విజయభాస్కరో ,విజయసారదో వచ్చి క్రాంతికుమార్గరికి మీ నవల చాల నచ్చింది సినిమాతీస్తారు రైట్స్ కావాలి అన్నారు .వున్నసంగతి చెప్పా అయ్యో ఊరుపేరు లేనివాళ్ళకి ఇచ్చారు. రైట్స్ వెనక్కి తీసుకోండి మాకివ్వండి వాళ్ళ అడ్వాన్స్ ఇచ్చేయండి టైం లిమిట్ అయిపొయింది అని కాన్సుల్ చేయచ్చు అంటూ చెప్పారు. ఎలా రాయాలో చెప్పి వొప్పించి బేరాలు మొదలెట్టి ఎంతకావాలో చెప్పండి అన్నారు. ఒక తెలుగుకే తీసుకోండి అంతే ఆలాకాదు మీరే చెప్పండి ఆంటే వెర్రి మొహంకాకపోతే ఓ పాతికేనా అడగచ్చుకదా, ఏమిటో వాళ్ళు రెండున్నరవేలే కదా ఇచ్చారు పదికంటే అడుగుతే బాగుంటుందా పోనీ పదిహేనడిగితే వప్పుకోకపోతే సినిమాఅవదు ఈమాత్రం కూడా రాదు అనుకుని ఆలోచిస్తూనే నోట్లోనించి పది అనేసా,ఇంకేం మొత్తం ఒకేసారి ఇచ్చేసి అగ్రిమెంట్ రాయించుకు వెళ్ళిపోయాడు. తరువాతఅన్ని భాషలకి పెద్దమొత్తాలకి అమ్మిన నాకు ఒక రుపాయి కూడా రాలేదు ఆరోజుల్లో అంత తెలియనితనం .సరే వెనువెంటనే నాలుగయిదు నెలల్లో సినిమాగా వచ్చిఎంతవిజయవంతమైనదో అందరికి తెలుసు .సితార ,వంశీబెర్కిలీ ,సినిహెరాల్డ,చిత్రభూమి ,కళాసాగర్ కధఅవార్డు ఇచ్చాయి .సితార ఈనాడువారు వైజాగ్లో బ్రహ్మాండమైన సభ పదిపదిహేనువేలమంది ఓపెన్ ఎయిర్ సమక్షంలో కమలహాసన్ ,కృష్ణవిజయనిర్మల లాటి ఎందరో అన్నిరంగాల ప్రముఖులకిచ్చే సభలో నేనుఅందుకోవడం ,అలాగే మద్రాసులో సినిహెరాల్డ సభలో శశికపూర్ జెన్నిఫర్ ,ప్రవీణ్సుల్తానా లాటి దిగ్గజాలమధ్య నేనుఅవార్డు తీసుకోవడం ,వంసీబుర్కిలీ అవార్డు ఎంతోఘన్మగా రైలుకళారంగంలో రామరాజుగారు జరిపిన సభలో అల్విప్రసాద్ గారు మెచ్చుకుని హిందీలో తీస్తున్నానని చెప్పి గెస్ట్ హౌసేకి టీకి పిలిచారు .అలాగే ఆంధ్రభూమి వారి చిత్రభూమి అవార్డు రవీంద్రభారతి లో ఘనంగా జరిపి ఏంటో అందమైన మొమెంటో అందుకోవడం అక్కినేనిగారు మర్నాడు వారిఇంటికి టీకి ఆహ్వానించి అన్నపూర్ణగారిని పరిచయంచేసి స్వయంగా కారులో తీసికెళ్ళి అన్నపూర్ణ స్టూడియో అంత తిప్పిచూపించడం ఎన్ని మథుర ఘట్టాలు ,ఎన్నిజ్ఞాపకాలు. కళాసాగర్ అవార్డు అదే రోజు మరిదిపెళ్లి ఉండడం మేమె పెద్దలం కాబట్టి మద్రాస్ వెళ్లి అవార్డు తీసుకోలేకపోయిన బాధ ఉండిపోయింది.
*****
డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.