గడ్డి పువ్వు
-కె.రూపరుక్మిణి
ఒంటరి మనసు వేసే ప్రశ్నలో ఆమెను ఆమేగా మలచుకుంటున్న వేళ
మనస్పూర్తిగా నువ్వు ఎలావున్నావు అని అడిగే వారు లేనప్పుడు !
పడుచు ప్రాయానికి
స్త్రీ అందమో, సంపదనో,చూసుకుని
వచ్చే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు!!
తప్పటడుగుల జీవితంలో
తారుమారు బ్రతుకులలో
నిన్ను నిన్నుగా చూస్తారు అని ఆశపడకు
ఆడది ఎప్పుడు ‘ఆడ’ మనిషే
అవసరమో, మోహమో నీఆర్ధికస్థితో అవసరానికి అభిమానానికి మధ్య
పెద్ద గీతగా చేరుతుంది
నీది కాని ప్రపంచం నీ చుట్టూ అలుముకుంటుంది మేఘాల దుప్పట్లు పరుచుకుంటాయి, మెరుపుల వెలుతురూ చూసి ఇంద్రలోకంగా భ్రమిస్తావు
అక్కడ కూడా అవసరానికి
పనికి వచ్చే ఆటవస్తువువు
అన్న సంగతి తెలిసి,
చేతనావస్థలో కూడా అచేతనంగా నిలబడినప్పుడు తోడుగా ఒక్కరైనా లేరని వగచేవు.
మనిషిగా మనసుకి విలువలేనప్పుడు
మేకవన్నె పులులున్న లోకంలో మనసుకి ముసుగేసుకో…తప్పులేదు
వన్నెల్ని వరించే గడ్డి పూవై కాక
గులాబీ ముల్లై వికసించు.
*****
Nice👍
గులాబీ ముల్లై వికసించు 👌 nice poem Rupagaru👍