డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
మహిళాదినోత్సవాలు అని ఒక రోజు ఎందుకు అని ప్రశ్న అడిగితే పుట్టినరోజు జరుపుకుంటాము కదా అలాగే అని సమాధానం వచ్చింది.ఈ లాజిక్కుల సంగతి పక్కన పెడితే..ప్రతి ఆడపిల్ల రెండు పదులు దాటి మహిళ గా రూపాంతరం చెందెలోపు..తప్పనిసరిగా సాధించవలసింది ఈ మూడు
1. తన కాళ్ళ పై తాను నిలబడేందుకు ఆర్ధిక స్వతంత్రాన్ని ఇవ్వగలిగే చదువు
2.జీవితంలో ఏదైనా అనుకోని అపశృతి పలికినప్పుడు తన పిల్లల్ని తానే పోషించుకోడానికి మనోధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని అందచేసే వృత్తి విద్యలు నేర్చుకుని ఉండటం
3. ఆడపిల్లకు స్వేచ్ఛ కావాలి అంటే అర్థం…విచ్చలవిడి తనం, ఫాషనబుల్ దుస్తులు కాదు..
తాను వేసే ప్రతి అడుగు తన అడుగై ఉండటం
అష్టావధానం చేస్తూ కుటుంబ బాధ్యత, ఉద్యోగ బాధ్యత నెరవేరుస్తున్న ప్రతి మహిళకి…ఎన్ని యుగాలైనా…మేటి మహిళ అంటే మన మాతృమూర్తి అని గర్వంగా చెప్పుకోగల మహిళాలోకానికి..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు