జ్ఞాపకాల సందడి-21
-డి.కామేశ్వరి
శ్రీ పివి నరసింహరావుగారు ప్రధానమంత్రిగా వున్నప్పుడు వారి మనవరాలు పెళ్లి హైదరాబాద్ లో మా చెల్లెలుశ్యామల మరిదికొడుకుతో పెళ్లిఅయినపుడు మేమందరం వెళ్ళాము .అపుడు ఆయన్ని కలిసి నా పుస్తకాలూ కొన్ని ఇవ్వడం అయన నా వివరాలు అడగడం ఓ రచయిత్రిగా నాకు ఎంతో సంతోషం ,గర్వం కలిగించిన క్షణాలు . ఆయన స్వతహాగా బహుభాషాప్రవీణులు కాకరచయితా కూడా .ఆ పెళ్లికికూడా మొత్తంరాజకీయ ,సినిమా ప్రముఖులు ఎంతోమంది వచ్చారు .తేదీ సరిగా గుర్తు లేదుకానీ 91 ..95 మధ్య అపుడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మంత్రి గ వున్నారు. తరువాత ముఖ్య మంత్రిగా శ్రీ చంద్రాబునాయుడుగారుండగా అయన జన్మభూమి పధకం నన్ను ఎంతో ఆకర్షించి అకథావస్తువుతో జన్మభూమి అనే నవల రాసి ఆయనకి. అంకితం ఇచ్చాను .అసందర్భములో అయన అంగీకారం కోసం సెక్రటేరియట్ వెళ్లి కలిసిన సందర్భం ఫోటో ,తరువాత అయనఇంటికి వెళ్లి పుస్తకం ఇచ్చినపుడు సన్మానించిన సందర్భం.రవీంద్రభారతిలో సభకి నాలుగున్నరనించి ఐదున్నరవరకు టైం ఇచ్చారు . ఆరోజు అయన ముందే ఏర్పాటు అయిన షెడ్యుయేల్ ప్రకారం పదిగంటనించి నాలుగువరకు ఎక్కడో ఊరులో పర్యటన ,మీటింగ్ వుంది హెలికాఫ్టర్ లో వెళ్లి నాలుగుకు తిరిగివచ్చి ఇక్కడ మీటింగ్ అటెండ్ అవుతారని టైం ఇచ్చారు ఆఫీస్లో. మురళీమోహన్ ,నారాయణరెడ్డిగారు ,సీతాదేవిమొదలైన చాలామంది పాల్గొనేసభ . దురదృష్టం కొద్దీ ఆరున్నరవరకు అయన అన్ని చోట్ల ఆలస్యమయి ఇరుక్కుపోయారు .మీరు సభ మొదలుపెట్టి జరుగుతూ ఉంటే వచ్చేస్తారు అంటూ ఫోన్లు.మిగతా అందరు మాట్లాడడం అయింది ,ఆరున్నరవకు ఎదురుచూసి టెన్షన్ తో
వున్నాం .ఇంకోకారణం ఎప్పుడో మూడునెలలక్రితం బుక్ చేసుకున్న. ఒక నాట్య ప్రదర్శన ఐదుగంటలకి వుంది సి.ఎం పోగ్రామ్ ఐదున్నరకల్లా కచ్చితంగా టైంకి అయిపోతుందని వాళ్ళని ఒప్పించి హాలు అలాట్ చేసారు మాకు .రెండుగంటలనించి వాళ్ళు make-up లు వేసుకుని పాపం వెయిట్ చేస్తున్నారు ,అప్పటికే చీకటి పడుతుంది .అపుడే సీఎం దిగారు ఇంకా ఇక్కడ లాభం లేదు ఇంటికి వచ్చి అక్కడే కలవండి అని పి ఏ ఫోన్ .అందరు నిరాశ పడ్డం ఇంకాచేసేదేంవుంది . ముఖ్యమైన వాళ్ళం కార్లలో వెళ్ళాం .ఆయన చాల నొచ్చుకుంటూ సారి చెప్పారు ప్రతిచోటా జన ప్రభంజనం తప్పించుకు రాలేకపోయారుట .అక్కడే పుస్తకం అంకితం ఇచ్చక అయన నన్ను సన్మానించారు .ఆఫొటోలు అవి .ఆలా ఇంకో పోగ్రామ్ ఆయనకి ఉందని తెలియదు ,ఆఫీస్ వాళ్ళు ముందు చెపితే ఇంకోరోజు పెట్టుకునేదాన్ని .ఆఫ్కోర్స్ ఇంకో రోజు దొరకడం అంత ఈజీ కాదు వాళ్ళ బిజీ షెడ్యూల్ లో ఏమయినా ఆశాభంగం కలిగింది .ఇదంతా ఇప్పటి నా ఫేస్బుక్
ఫ్రెండ్స్ కి ,కొత్తతరం రచయితలకి తెలియదుకదా అందుకే వివరం ఇచ్చాను..
*****
పత్రిక బాగా వస్తుంది. కొత్త కోణంలో ఆవిష్కరించిన తీ రు కూడా ఉంది.
Thanks Shobha Rani garu.