

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
మృణాళిని గారితో గీత గారు నిర్వహించిన ముఖాముఖి చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరిగింది. ధన్యవాదాలు గీతా మేడం.
Thank you Ratnamala garu.
మృణాళిని గారు అక్షరయాత్ర లో సాహితీవేత్తలను చేసిన ఇంటర్యూలు అన్నింటినీ చూస్తే ప్రత్యేకించి ఇంటర్వూలు చేయాలనుకున్న వారికి పాఠ్యాంశాలని చెప్పవచ్చు.సాహితీవేత్తల రచనలన్నీ కూలంకషంగా చదివి ప్రతీ రచన నేపధ్యాన్ని,ప్రభావాలనీ రాబట్టేలా మృణాళిని గారు చేసె ఇంటర్యూలు ఉంటాయి.అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి , విదుషీమణి నుండి నెచ్చెలి ద్వారా పరిచయం చేసి మృణాళిని గారి అంతరంగ ఆవిష్కరణ చేసారు డా.గీతగారు.స్నేహశీలి అయిన మృణాళిని గారు తన పద్ధతి లోనే ఖచ్చితమైన తన అభిప్రాయాల్ని వెల్లడించారు.వారి గురించి చాలా మందికి తెలియని విషయాలు తెలిసాయి.మృణాళిని గారికి, డా.గీత గారికి అభినందనలు & ధన్యవాదాలు
మీ అభినందనలకు కృతజ్ఞతలు సుభద్రాదేవి గారూ!
మృణాళిని గారితో గీత గారి ముఖాముఖిలో ఎన్నో తెలియని విషయాలు చర్చించారు. తెలియని విషయాలు నేర్చుకొనేలా ఉంది. ముఖ్యంగా కొత్తగా రాసే కవులకు, రచయితలకు, విమర్శకులకు మంచి సూచనలు అందజేశారు. మృణాళిని గారి నిరాడంబరత, విషయ విశదీకరణలో స్వచ్ఛతకు అభినందనలు. ఇంత మంచి ముఖాముఖి మాకందించిన గీత గారికి ధన్యవాదాలు -వడలి లక్ష్మీనాథ్
Thanks Lakshmi Nath garu!
డా.గీతగారు మీరు తక్కువ మాట్లాడి బహుముఖ ప్రజ్ఞాశాలి డా.మృణాళిని గారిద్వారా ఎక్కువ విషయాలను రాబట్టారు. వారి అక్షరయాత్ర చాలా ఇంటర్వూలు చూశాను. వారు ఆ పండితుల, రచయితల ఇంటర్వూ చేయాలంటె ఎంత చదివిండాలి వారి రచనలగురించి!! ఆమె ఇచ్చిన ఇంటర్వూలు అన్నీ చూశాననే అనుకొంటాను. ఈ ఇంటర్వూ చాలా నచ్చింది.డా.గీతగారు. నేను మృణాళిని గారి వీరాభిమానిని. ఒక వ్యక్తి ఇన్ని సాధించటానికి సాధ్యం అని నిరూపించారు. World Space Radio లొ ఆమె చేసిన కార్యక్రమాలు లభిస్తాయా అని వెతుకుతుంటాను. మృణాళిని గారికి మనఃపూర్వక అభినందనలు. మనసులొ నిలిచిపోయింది ఇంటర్వూ. మృణాళిని గారిని ఒక్కసారి కలవాలని. చూద్దాం. Time decides !! ఇంత మంచి ఇంటర్వూను మాకు అందించినందుకు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు డా.గీతగారు.
మీకు నెచ్చెలి ఇంటర్వ్యూ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సుశీల గారూ!
అక్షరయాత్ర చూసాక నేను మృణాళిని గారి అభిమానిని అయ్యాను. ఈ సంచికలో వారి ఇంటర్వ్యూ నే మూందుగా చూడటం జరిగింది. ఇంటర్వ్యూ చాలా బాగుంది. చాలా విషయాలు తెలిసాయి.సాహిత్యం లో క్వాలిటీ పెరగాలి అన్నది ఆహ్వానించదగిన విషయమే.
ఆవిడ కోరినట్లు నెచ్చెలి విభిన్నమైన విషయాలను ప్రచురిస్తూ చేసిన చాలా మార్పులు గమనించాను.
అభినందనలు గీత గారూ.
Thank you so much Sunitha garu.