మణిబెన్ కారా (1905-1999)

-ఎన్.ఇన్నయ్య

 

1905లో బొంబాయిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మణిబెన్, సెయింట్ కొలంబియా హైస్కూలులో చదివి, బర్మింగ్ హాంలో సోషల్ సైన్స్ డిప్లొమా పొందారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బొంబాయిలో సేవామందిర్ స్థాపించి, ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు.  బొంబాయి రేవు కార్మికోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నేత కార్మికులకు సేవ చేశారు.  బొంబాయిలో లేబర్ యూనియన్ కార్యకలాపాలలో పాల్గొని, సమ్మెలు నిర్వహించారు. 

స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూ విదేశీయుల సహాయం స్వీకరించే పనుల్లో పర్యటనలు చేసి, రష్యాలో లెనిన్ సహచర్యంతో అనుభవం గడించిన ఎం.ఎన్.రాయ్ 15 ఏళ్ళ అనంతరం స్వదేశానికి ఓడలో బొంబాయి చేరుకోగా, ఆయనకు వి.బి.కార్నిక్, మణిబెన్ స్వాగతం పలికి, అండగా నిలిచారు. 

ఎం.ఎన్. రాయ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొని సహకరించిన మణిబెన్, అతడు నడిపిన ‘ఇండిపెండెంట్ ఇండియా’ పత్రికను అచ్చువేసి, సహకరించింది.

మణిబెన్ తలమునకగా సేవా కార్యక్రమాలు జరుపుతూ, అవివాహితగా వుండిపోయింది. ఆమె సేవల్ని గుర్తించిన కార్మిక సంఘాలు, అంతర్జాతీయ సమావేశాలకు తమ ప్రతినిధిగా ఇంగ్లండ్ పంపించారు. హింద్ మజ్దూర్ సభలో చేరి కృషి చేసింది. ఆలిండియా రైల్వే మెన్ ఫెడరేషన్ అధ్యక్షురాలైంది. 

మణిబెన్ సేవల్ని గుర్తించి, పద్మశ్రీ గౌరవ పురస్కారం యిచ్చారు. 1972లో మణిబెన్ హైదరాబాద్ వచ్చి, రాడికల్ హ్యామనిస్ట్ సమావేశాల్లో పాల్గొంటూ, మా యింటికి వచ్చింది. జస్టిస్ ఆవుల సాంబశివరావు కుమార్తె మంజులతకు అబ్బాయి పుట్టాడని తెలిసి, అక్కడకు వెళ్ళి పసివాడికి బహుమానం యిచ్చి వచ్చాం. జీవితాన్ని సేవలకు అంకితం చేసి, 1974లో చనిపోయారు. ఆమెతో స్నేహం గర్వకారణం. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.