యుగధర్మం 

-ఐతా చంద్రయ్య

మగధీరా ! మేలుకో 

యుగధర్మం చూసుకో అబల కాదు అగ్నికణం 

భరత నారి తెలుసుకో 

ఓర్పులోన భూదేవి 

నేర్పు గల శాంతి స్వరూపం 

బలహీనత కాదు అది 

భలే క్రాంతిదర్శనం 

హక్కులు, బాధ్యతలు ఏమిటి 

అన్నింటా సగం సగం 

సహనమును పరీక్షిస్తే 

సమరానికి సిద్ధం 

కట్నకానుకల కోసం 

కాల్చుకు తినకు 

తిరగబడితే వెళ్తావు 

కటకటాల వెనుకకు

ఇలవేలుపు అవుతుంది 

కాలు కింద పురుగంటే 

కాలసర్పమవుతుంది 

రాజకీయక్షేత్రమేమి

 రక్షణ రంగములో 

అతివలకిక సాటి లేదు 

ఆధునిక యుగమ్మలో

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.