వసివాడే ‘పసి’కూనలు!
(‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో మార్చి 30, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)
-రాయపురెడ్డి సత్యనారాయణ
మానవ జీవితాన మరువలేని, మరపురాని ‘మధురస్మృతి’ బాల్యం!
ఏ బాదరబందీ లేని, బరువు బాధ్యతలు కనరాని, తిరిగిరాని ‘సుందర స్వప్నం’ బాల్యం!!
ఆ బాల్యం ‘బలి’యౌతోంది నేడు, ఆధునిక జీవన రథచక్రాల క్రింద నలిగి!
ఆ ‘పసి’ మనసు అగ్నిపర్వతమై లోలోన రగులుతోంది చూడు…
అదుపులేని ‘ఆంక్షల’ నడిసంద్రపు ‘సుడిగుండా’ల్లో పడి!!
చీకటి ప్రొద్దున లేవాలి! నిదుర కళ్ళతో చదవాలి!!
బండెడు ‘పుస్తకాల మోపు’ను వీపున మోస్తూ, వడివడిగా ‘బడి’కి అడుగేయాలి!!
‘చదువే’ ఆహారం! ‘ట్యూషన్లే’ పానీయం!’పరీక్ష’లే సర్వస్వం! ‘మార్కులూ, ర్యాంకు’లే సమస్తం!!
కేబుల్ ‘టీవీ’ చూడొద్దు! కులాసా ‘కబుర్లు’ ఆడొద్దు! ‘ఆటపాట’లకు స్వస్తి!’ఆనందం, ఆహ్లాదం’ నాస్తి!!
‘అన్నం’ తినే వేళ తప్పించి, అహర్నిశలూ ‘చదువే చదువు’!
హతవిధీ! ఇదీ., ఉరుకుల పరుగుల వర్తమాన మా’నవ’ జీవన యాంత్రిక గమనంలో…..
వసివాడి పోతోన్న ‘పసి’వాడి దయనీయ ‘బ్రతుకు చిత్రం’! కడు ‘విచిత్రం’!!
*****
ధన్యవాదములు మేడమ్!
Kavitha chaala baagundi Sir. Deenni oka rap ga kuda paadavachu ani anipistundi. Chaduve aaharam, tution le paaneeyam ane line adbhutham.
తెన్నేటి శ్యామకృష్ణ హైదరాబాదు
‘వసివాడే పసికూనలు్’ కవితా వస్తువు సముచితంగా ఉంది. మా చిన్నప్పుడు బాల్యం ఎంత మధురంగా గడిచిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని, ఇప్పటి పిల్లలతో పోల్చుకుంటే మరింత ఆవేదన కలుగుతుంది, వారి స్థితిని తలుచుకుని. చదువంటే భట్టీయం వేయడం అనే భావన అటు తలిదండ్రులలో, ఇటు విద్యాసంస్థలలో కలగడం దురదృస్టం.
“ఆ బాల్యం బలియౌతోంది నేడు ఆధునిక జీవన రథచక్రాల క్రింద నలిగి” అన్న మాట అక్షర సత్యం!
కవిత చాలా బాగుంది… తెలిసిన విషయమే అయినా ఒక్క మారు ఆగి బాల్యం లోనూ ఉరుకులు, పరుగులు, పోటీలు, పడిలేవడాలు ఎందుకు ఏమిటి అనిపించక మానదు.. కవిత సారాంశం గ్రహిస్తే.. అల్లాగే జీవితంలో ….వృద్దాప్యంలోనూ అంతులేని బాధ్యతలు, సమసిపోని సమస్యలు ఉన్న వారు కూడా లేకపోలేదు. ఏ దశలోనైనా మనిషి జీవితం తేనెలో పడ్డ ఈగలానే సాగుతుందేమో అనిపిస్తుంది.. బాల్యంలోనే కాస్త తక్కువ బాధ్యతలేమో మరి.. చక్కని కవితకి రచయితకి శుభాకాంక్షలు.
ఉమాభారతి కోసూరి
ధన్యవాదములు మేడమ్!
కవిత చాలా బాగుంది సర్.
చక్కని పద సంపద.
ధన్యవాదములు సార్!