స్వరాలాపన-2

(మీ పాటకి నా స్వరాలు)

పగలే వెన్నెలా

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం! 

***

సినిమా: పూజాఫలం

గీత రచన: సినారె 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

రాగం: హిందోళం 

ఆరో: స గ2 మ1 ద1 ని2  స*

అవ: స* ని2  ద1 మ1 గ2 స

పగలే వెన్నెలా జగమే ఊయల

సమమా గామమా గమమా గాససా 

కదలె వూహలకే కన్నులుంటే ఏఏఏ ఏఏఏ

గమమా మాదదదా  దదనిసని సా*నిదమ  నీదమగ నిదమగ సనిసా 

పగలే వెన్నెలా

సమమా గాగదామా

నింగిలోన చందమామ తొంగి చూచే 

సా*స*గ*స*స* నీనిస*నిద  గామదనీనీ 

నీటిలోన కలువభామ పొంగి పూచే 

గామమామ మాదదాద దానిస*గా*సా* 

యీ అనురాగమే జీవనరాగమై

సా*దని సా*గ*గా* స*స*గ *గ  స*గ*స*దా  

యెదలో తేనె జల్లు కురిసిపోదా ఆ ఆ ఆ ఆ

దనిసా *గా*స నీ ని  దానినీ దామగ సనిసా ||పగలే||

కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసే

మురళి పాట విన్న నాగు శిరసునూపే

యీ అనుబంధమే మధురానందమై

ఇలపై నందనాలు నిలిపిపోదా  

పగలే వెన్నెలా 

నీలి మబ్బు నీడ లేచి నెమలి ఆడే

పూల ఋతువు సైగ చూచి పికము పాడే

మనసే వీణగా ఝుణ ఝుణ మ్రోయగా

బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెలా 

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.