స్త్రీ వాద కవితలకు ఆహ్వానం

-ఎడిటర్

గమనిక: 

మిత్రులారా! నెచ్చెలి & జే.డీ పబ్లికేషన్స్ తో కలిసి ప్రచురణకు పూనుకున్నఅపరాజితస్త్రీవాద కవితా సంకలనం అనివార్య కారణాల వల్ల ఆగిపోయినందుకు చింతిస్తున్నాం. ఇక మీదట కేవలం జే.డీ పబ్లికేషన్స్ పేరుతో ప్రచురించుకునే సంకలనానికి, నెచ్చెలికి ఎటువంటి సంబంధమూ లేదు.  నెచ్చెలి & జే.డీ పబ్లికేషన్స్ లో సంయుక్త ప్రచురణకు మీ కవితలకు మీరు ఇచ్చిన అనుమతి జే.డీ పబ్లికేషన్స్ పేరుతో ప్రచురించుకునే సంకలనానికి చెల్లదు. 

ఇకఅపరాజితఅన్న పేరు నెచ్చెలికి మాత్రమే స్వంతం. ఆ పేరుతో నెచ్చెలి తీసుకు రాబోతున్న సంకలనానికి దయచేసి నెచ్చెలికి మాత్రమే అనుమతి ఇస్తూ మరొకసారి మీ అనుమతి పత్రాన్ని వీలైనంత త్వరలో పంపండి.  అలాగే కింద ఇచ్చిన మొదటి ప్రకటన ప్రకారం మీ కవితలను నెచ్చెలి పత్రికలో ప్రచురించుకునే హక్కులు నెచ్చెలి పత్రికకు మాత్రమే ఉన్నాయి. 

 

మీ అనుమతి పత్రం ఈ కింది విధంగా ఉండాలి:-

నెచ్చెలి ప్రచురిస్తున్న స్త్రీవాద కవితా సంకలనంఅపరాజితకు నా కవితను ప్రచురించడానికి అనుమతి ఇస్తున్నాను. జే.డీ పబ్లికేషన్స్ కు గానీ, మరి ఏ ప్రచురణ సంస్థకు గానీ ప్రచురణకు అనుమతి లేదు. అనుమతి పత్రం చేరవలసిన తుది తేదీ: నవంబరు 30, 2021. 

 

——-

నెచ్చెలి & జె.డి.పబ్లికేషన్స్ 

సంయుక్త ఆధ్వర్యంలో స్త్రీవాద కవితాసంకలనం కోసం స్త్రీ వాద కవితలకు ఆహ్వానం!

1. 2010 నుండి ఇప్పటి వరకు స్త్రీల సమస్యలపై కవయిత్రులు రాసిన కవితలను మాత్రమే పంపాలి.

2. ప్రచురింపబడినవైనా సరే పంపవచ్చు. ఎప్పుడు రాసినది, ఏ పత్రికలో ప్రచురించబడింది మొ.న వివరాలు కవిత చివర రాసి పంపాలి.

3. కవితతో బాటూ విధిగా ఒక ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ (మీపేరు, ఊరు, వృత్తి, రచనలు, చిరునామా, ఫోన్, ఈమైల్) వివరాలు ఈ-మెయిలుకి జతపరచండి. 

 4. ఒక్కొక్కరు ఒక్క కవిత మాత్రమే పంపాలి. కవిత పంపిన ప్రతి ఒక్కరు రెండు పుస్తకాలు కొనవలసి ఉంటుంది.

5. కవితకు పంక్తుల నిబంధన లేదు కానీ మరీ పెద్దగా ఉంటే సంక్షప్తం చేయబడతాయి

6. కవితలకు పోటీ లేదు కానీ.. లక్కీ డిప్లో ఐదు కవితల ఎంపిక జరుగుతుంది.. ఎఃపికయిన వారికి జేడీ పబ్లికేషన్స్ మూడు పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి.

7.కవిత తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. వర్డ్ ఫైల్ పంపాలి పిడిఎఫ్, పి.ఎమ్.డి లు స్వీకరించబడవు. 

8. ఎంపిక చేయబడిన కవితలు “నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక” లో కూడా నెలనెలా ప్రచురింపబడతాయి. 

9. కవిత పంపడానికి చివరి తేదీ:15-05- 2021.

10. కవితా సంకలనం నెచ్చెలి రెండవ      జన్మదినోత్సవం సందర్భంగా జూలై10, 2021 న ఆవిష్కరింపబడుతుంది. 

11.ఈ-మెయిలు మీద “జెడి & నెచ్చెలి స్త్రీవాద కవితాసంకలనం-2021కి” అని రాసి  
jdpublicationsjwalitha@gmail.com మరియు   editor.neccheli@gmail.com  రెండిటికీ పంపాలి.                       

నిర్వాహకులు
 జె.డి.& నెచ్చెలి.   
 9989198943.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.