హేమలత (1932-2008) అనన్య సామాన్యకృషి
-ఎన్.ఇన్నయ్య
ఆంధ్రప్రదేశ్‌లో తెంగాణాలో చిరకాలంగా ఆచరణలో వున్న దేవదాసి, జోగిని పద్ధతులను తొలగించడంలో హేమలత ఎదురీది సాధించారు. దేవుడి పేరిట అట్టడుగు వర్గాల స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టిన దురాచారమే జోగిని పద్ధతి. తెలంగాణాలో నిజామాబాద్ జిల్లాలో నాటుకుపోయిన ఈ దురాచారం చిరకాంగా, ఎవరూ ఏమీ చేయలేక చేతులెత్తేశారు. అటువంటి దశలో హేమలత రంగప్రవేశం చేసి, ఎదురీది చాలా వరకు జోగిని దురాచారాన్ని ఆపించగలిగింది.
హేమలత సుప్రసిద్ధ కవి గుర్రం జాషువా కుమార్తె. అనేక అవమానాలకు గురై, ఎదురీది కవిగా నిలిచి పేరొందిన జాషువా తన కుమార్తె లవణాన్ని పెళ్ళాడుతుంటే ఆనందించాడు.
ప్రపంచంలోనే పేరు నిబెట్టిన గోరా నాస్తిక కేంద్రంలో కీలకపాత్ర వహించిన లవణం, అసమాన సాంఘిక వ్యవస్థలో మంచిపేరు తెచ్చిన కార్యక్రమాలో నిమగ్నమయ్యారు. ఆయన హేమలతను పెళ్ళాడారు. ఒకరు బ్రాహ్మణుడు మరొకరు అట్టడుగు కులాలవారుగా భావించబడుతున్న వారి కుమార్తె పెళ్ళి లౌకిక క్రమంలో జరిగింది.
లవణం– హేమలత దంపతులు ప్రపంచ పర్యటన చేసి, నాస్తిక ప్రచారం గావించారు.
హేమలత అతి పట్టుదలతో జోగిని వ్యవస్థపై పోరాడింది. ఆంధ్రప్రదేశ్‌లో దేవదాసి, జోగిని నీచ పద్ధతులు మతం పేరిట దేవాలయాలను అడ్డం పెట్టుకుని చిరకాలంగా సాగాయి. హేమలత పట్టుబట్టి, ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు, గవర్నర్ సహాయంతో చట్టరీత్యా ఆ వ్యవస్థను స్వస్తి పలికించింది.
హేమలత ప్రపంచ పర్యటన చేసి నాస్తిక నాయకులను కలిశారు. అనేక సభలలో ప్రసంగించారు. ఆమెకు సంతానం లేదు. అటు గోరా, ఇటు గుర్రం జాషువాలు అనన్య సామాన్య కృషి చేసి, ఎదురీది నిలిచినవారు. ఆమె వారి ధైర్యసాహసాలను పుణికిపుచ్చుకొని సమాజంలో గొప్పపేరు నిబెట్టింది. విమర్శలు ఎదుర్కొన్నది. హేమలత స్ఫూర్తికి నిదర్శనం ఆమె ఎరుక, యానాది వారిని సంస్కరించడంలో ఎనలేని కృషి జరపడం. మధ్యప్రదేశ్‌లో చంబల్‌వాలీ దోపిడీ ముద్దాయిను సంస్కరించడంలో జయప్రకాష్ నారాయణ్‌కు తోడ్పడి, చరిత్ర ముపులో నిలిచింది. హేమత ఆదర్శ స్త్రీ. కేన్సర్‌తో నాస్తిక కేంద్రంలో చనిపోయారు.
నరిసెట్టి ఇనయ్య గారూ… హేమలత గారు గురించి చాలా విషయాలు తెలిపారు. వారు జోగిని, దేవదాసీ వ్యవస్థల పై చేసిన పోరాటం గురించి ఎన్నో విషయాలు తెలిపారు