కుమ్మరి పురుగు
-సుధామురళి
పరపరాగ సంపర్కం
‘నా’ లోనుంచి ‘నా’ లోలోనికి
అక్కడెక్కడా…..
గడ్డ కట్టించే చలుల వలయాలు లేవు
వేదనలు దూరని శీతల గాడ్పుల ఓదార్పులు తప్ప
ఆవిరౌతున్న స్వప్నాల వెచ్చటి ఆనవాళ్లు లేవు
మారని ఋతు ఆవరణాల ఏమార్పులు తప్ప
అవునూ కాదుల సందిగ్దావస్థల సాహచర్యం లేదు
నిశ్చితాభిప్రాయాల నిలువుగీతలు తప్ప
ఏ అచేతనత్వపు నీడలూ కానరావు
నిశిని ఎరుగని చీకటి వెలుగులు తప్ప
ఏ ఏ మౌనభాష్యాల వెక్కిరింతలూ పలకరించవు
నివురుగప్పిన నిశ్శబ్దపు స్పర్శ తప్ప
ఏ ఏ ఏ కార్యాకారణ సచేతన ఫలితాలూ ప్రకటించబడవు
ధైర్యపు దూరత్వ భారత్వం తప్ప
అందుకే….
పరపరాగ సంపర్కం
నాలోనుంచి
నా……లోలోనికి…..
*****
ఈ కవితకు కుమ్మరిపురుగు శీర్షిక బాగా కుదిరింది. ఈ కవితా రచన రచయిత్రి ఆత్మకథగా, ఉత్తమ పురుష కథనంలో చక్కగా సాగింది.
చెల్లమ్మా… నీ కవిత అంటేనే శ్రద్ధగా చదువుతాను. కనిపించినంత తేలిక కాదు. అంతర్లీనంగా భావమిమిడి ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే భావప్రకటనాశైలి ఇలా ఉండాలి అన్న సత్యం కచ్చితంగా తెలుస్తుంది. శుభాభినందనలు.💐💐💐💐💐
నివురుగప్పిన నిశ్శబ్ధపు స్పర్శ తప్ప….చాలా బాగుంది
థాంక్యూ సో మచ్ మేడం