ముందస్తు భయం( కవిత)
-సాహితి
ప్రపంచానికి జ్వరమొచ్చింది.
ఏ ముందుకు చావని
వింత లక్షణం వణికిస్తోంది.
హద్దులు లేకుండా స్వచ్ఛగా
పరిసారాన్ని సోకి ప్రాణం తీసే
ఓ వైరసు కు భయపడ్డ మానవాళికి
చావు భయంపట్టుకుంది.
జీవితంలో తొలిసారిగా
బతుకు భయాన్ని తెలియచేస్తూ
వీధులు తలుపులు మూసి
మూతికి చిక్కాన్ని తొడుక్కుమని
జీవితాలకి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంటే
ఇళ్లు సంకెళ్లుగా మారి
బంధాలన్ని ఏకాంత ద్వీపాలుగా మార్చి
భద్రత బోధిస్తున్నాయి.
ఏ వైపు నుంచి గాలి ఏ కబురు మోసుకొస్తుందో…
ఏ దిక్కు నుండి ఎటువైపుకి
చావు ముసురుకొస్తుందోనన్న
ముందోస్తు భయం ఊపిరిని దెబ్బకొడుతుంటే
అంతకు అంత అనారోగ్యం ప్రబలి
ఊపిరిని పొసే ప్రాణవాయువు కొరతతో
వైద్యశాలే రోగిని వదిలేస్తుంటే
ఊర్లకుఊర్లు ఊపిరాడక
అర్ధాయుష్షుతో అకాలమరణాలతో
పిట్టల్లా రాలుతున్న జనంతో
కనిపించని మృత్యురాకాసి మారణహోమానికి
గంటకో శవం బలవుతుంటే
దేశాలన్ని కన్నిటిఉప్పెనకి
భూస్థలమంతా స్మశానమే.
*****
సూటిగా, స్పష్టంగా సాగిన కవిత. కరోనా విళయాన్ని ఏకరువు పెట్టిన కవిత. ఓకే… రచయిత్రికి అభినందనలు