భాషాభాగోతం

-వసంతలక్ష్మి అయ్యగారి

యిదెక్కడి గోలండీ బాబూ…తెలుగు జాతీయాలు యింత నవ్విస్తాయనినాకు యిప్పుడిప్పుడే తెలుస్తోంది…

కొన్నాళ్ళక్రితం…ఒక తెలుగు నేస్తంతో…”నువ్వు బొబ్ట్టట్లు ఎడం చేత్తో చేసిపారేస్తావుట కదా…”అంటేనూ…‘‘.నో నో…నేనెప్పుడూ వంటలుఎడమచేత్తో చెయ్యను..”అని శలవిచ్చింది..యిలా అన్నానని ఆవిడ నాకులీవు గ్రాంటు దేనికి చేసిందీ….అని మీరు నన్ను గాని ప్రశ్నించరు కదా…??సరే సరే…..ఆ విడ ‘‘బొబ్బట్లు చేసి పారెయ్యడమేమిటీ…”అనలేదనిసంతోషించాను.

ఇది తలచుకున్నప్పుడల్లా నాలో నేనే నవ్వుకుంటూఉండేదాన్ని.ఇపుడంటే మీరంతా ఉన్నారు ..పంచుకోడానికి.ఇంతలో ఇదేజాబితాలోకి మరోటొచ్చి చేరింది..!

మరో మిత్రురాలితో ..నేను..‘నిన్న ఒక్కపూట వంటచేయకపోతే నాకివాళచేతులకి దురదలొచ్చాయనుకోండి’అన్నానుసుమండీ..”

వెంటనే సదరు దోస్తు..”అయ్యో..డాక్టరు దగ్గరికి వెళ్ళారా .లేదా..”అంటూసహజమైన ఆతృత ప్రదర్శించింది.ఇదెక్కడి గోలరాబాబూ..అనుకున్నాను మరోసారి.

వీటికివాళ మరో రెండు వచ్చి చేరాయండోయ్!!!

”అమ్మ బాబోయ్…నీ నోట్లో నోరు పెట్టలేం నాయనా..”అన్నానుదగ్గరిబంధువుతో..

వెంటనే సదరు బంధువు అవాక్కవడమే కాదు…వింతగానన్నుచూడడంతో వాడు సంభ్రమాశ్చర్యాలకి గురై, నన్నుకూడా గాబరాకిలోను చేశాడని  నేను యిట్టే గమనించి నా నోరు మూసుకున్నాను.

యిక చివరాఖరుది..

మామూలుగా మనం ‘నో ‘చెప్పవలసి వచ్చినపుడు…మన ముఖాన్నిhorizontal గా తిప్పుతాం.మావారు చిత్రంగా…’.yes ‘చెప్పడానికి తల అలాతిప్పుతారు..నేను చెప్పిచెప్పి …విసిగి వేసారగా…యివాళ ఏదోసందర్భంలో…తల ఎలా ఊపితే ”యస్…”ఎలా తిప్పితే ..’నో..’అని sincere గా అడిగారనిపించింది…ముప్ఫై యేళ్ళకి..!నేను మరింత శ్రద్ధగా..‘‘చూడండి..మనం తెలుగులోమాట్లాడేటపుడు..ఎవరైనా ససేమిరాఅన్నపుడు…”వాడుఅడ్డంగాతలూపాడండీ..”అంటాం..అవునా..అంటే..అడ్డం means …అహఁ …no…..”అని వివరించి నవ్వుకున్నాను.

ముక్తాయింపుగా..ఇది చదవండి…

మా వారి ఆఫీసులో చాలా ఏళ్ళక్రితం ఓ బాస్ గారు అరవై కి దగ్గరైనవారొకరుండే వారట.ఈయనతో పాటు డిపార్ట్ మెంటులో తెలుగు రాని ఒకలేడీ కొలీగ్ ఉండేవారు.మిగిలిన తెలుగు కొలీగ్సంతా..తరచు..”అదికాదునాన్నా..”అంటూ మాట్లాడుకోవడం విన్న ఆ నాన్ తెలుగువుమన్…తనకంటే వయసులో చిన్న వారైన వీరందర్నీ ”నాన్నా ..”అనిసంబోధించడం మొదలెట్టిందట..అంతవరకూ బానే వుంది..కానీ..పెద్దవారికి ”గారు ” చేర్చి గౌరవించాలి కాబోలు అనుకున్నఆవిడ,వాళ్ళboss గారిని ..”నాన్నగారూ…”అనడం అలవాటు గామార్చుకుందట..!పాతికేళ్ళు గడిచినా…మావారు ఇది తలచుకుని ..చెప్పి చెప్పినవ్వుతుంటారు.

ఇదంతా చదివి మీరంతా “చెవులు కొరుక్కోవడం లేదు”కదా !!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.