డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
రచయిత్రి ఎంతో బాగా చదివిన పుస్తకాల గురించి, తన అంతరంగాన్ని,రచనా వ్యాసంగాన్ని చక్కగా వివరించారు ..గీత గారికి,నెచ్చెలి కి అభినందనలు.
Veera Lakshmi Devi vari interviw is very nice. Kalasagar
మృదువైన మధురమైన భాషలో ఆసాంతం సాగిన హృద్యమైన సంభాషణలు వీరలక్ష్మి గారి సాహితీ ప్రస్థానాన్ని ఇంపుగా వినిపించాయి. వెన్నెల ముగ్గేసుకొని, శరత్కథలని ఓ చేత్తో , చెలం రచనల్ని మరో చేత్తో, రాజ వొమ్మంగి గిరిజన జీవన చిత్రాల్ని చూస్తో, ఇంటో పేరుకే ‘చిన’ అయిన వీరభద్రుడి సాహితీ శివతాండవానికి అచ్చెరువొందుతో, కథాప్రపంచం లోకి అడుగెట్టిన అనేక అనుభవాల కెరటాలే ఈ ముఖాముఖి. రమ్యంగా, రమణీయంగా హాయిగా, పిల్లతెమ్మెర వీవెనలా సాగిన ఇంటర్వ్యూలో వీర లక్ష్మి గారి సాహితీ జ్ఞాపకాలు సారస్వతాభిమానులకు అందమైన అనుభూతుల తోరణాలు.
వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారితో ముఖాముఖి చాలా స్ఫూర్తి దాయకంగా ఉంది