అనుసృజన-నిర్మల(చివరి భాగం)
అనుసృజన నిర్మల (భాగం-18) అనుసృజన: ఆర్.శాంతసుందరి హిందీ మూలం: ప్రేమ్ చంద్ మరో నెలరోజులు గడిచాయి.సుధ మూడో రోజు మరిది వెంట వాళ్ళింటికి వెళ్ళిపోయింది.నిర్మల ఒంటరిదైపోయింది.ఇప్పుడు ఆమెకి ఏడుపొక్కటే మిగిలింది.ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణించసాగింది.పాత ఇంటి అద్దె ఎక్కువని ఒక ఇరుకు సందులో చిన్న ఇల్లు అద్దెకి తీసుకుంది.ఒక గదీ, నడవా,అంతే.గాలీ, వెలుతురూ లేవు.ఎప్పుడూ ఇల్లు కంపుకొడుతూ ఉండేది.డబ్బున్నా భోంచెయ్యకుండా ఉపవాసాలుండేవాళ్ళు వదినా మరదలూ.సామాన్లు కొనేందుకు బజారుకెవరెళ్తారు అనేది సమస్య.ఇంట్లో మొగదిక్కు లేనప్పుడు రోజూ కష్టపడి వండటం […]
Continue Reading