కేరళ వాసం అనుభవాలను, తన దగ్గరున్న చిన్న దైనిక డైరీ లాంటి బుక్కులో తన భావాలు రాసుకునేవారు పుట్టపర్తి పొడి పొడి వాక్యాలుగా వ్రాసుకునేవారన్నాను కదా! ఆ చిన్ని డైరీ ఇలా ఉంది. (నా దగ్గర ఉన్నది ఇప్పుడు కూడా)
****
‘త్రిశూర్, ఎర్నాకుళం దగ్గర , బస్సులో ప్రయాణం!! అందరూ నాయర్లే!! ఈ దేశాన్ని గురించి విన్నదంతా నిజమే!!
మందులూ, మాకులూ, మంత్రాలూ – అన్నీ జరుగుతాయి!! ఎక్కువగా , ఆడ మళయాళమే!!’
‘ఇక్కడి స్త్రీలలో, శూద్రులలో మంత్రవాదమెక్కువ. మందులూ మాకులూ ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలె..’
ఈ కాలేజీలో వేదాంతం ప్రొఫెసర్ ‘ఇడవ ‘ మిమాంసలో!! చాలామంది లెక్చరర్లు శూద్రులే!!
‘నంబూద్రీల వేదోచ్చారణ చిత్రంగా ఉంటుంది.’
‘గురువాయూర్ బృహస్పతి ప్రతిష్ట ‘
దిస్కషన్లో నేనొకడను. వారనేకమంది!! పదం ఎక్కడో ఒకచోట నిలవాలని నేను, కాదని వారందరూ!! చాలాసేపు
వాదించుకున్నాము!!’
‘ఇక్కడ పైపంచ గర్వ ద్యోతకం‘
‘అనంత పద్మనాభ స్వామిలో 12 వేల సాలిగ్రామాలు+ పణం,చక్రం, కాసు..’
‘పద్మనాభుని గుడిలో ఒక జర్మన్ విద్వాంసునికి అవమానం!! ఆరు నెలల క్రితం, వాడు ఫోటోలు తీసికొన యత్నించినాడు.’
‘తెన్ గులో వలె యడాగమం ప్రాచీన కాలాన !! నేడు వడాగమము. స్వరానికి స్వరం పరమైన అ + విడె = అవ్విడె: అవిడె ;
అకడవికటం ఎడిటర్ వ్యుత్పత్తి – అకిడె – కకారానికి వకారం వస్తుంది. అకిడె+ఇకడె = అవిడైవడె = అక్కడ ఇక్కడ (టాప్సీ టర్వీ)
మళయాళం లో ఎడము అనే శబ్దమూ ఉన్నది..’
ఆణీ కడచిల్ల (వైదిక ప్రయోగం) సంస్కృత డిక్ష్ణరీలో ఎటిమాలజీ లేదు. క. ఆణి ముత్తె .’ ఆణిగార ;(Wise man) మళ. ఆణి –
ముఖ్య ; కనుక సంస్కృతం, ద్రావిడాలనుండి తీసుకున్నది.’
మళయాళం లో ‘వ ‘కు ‘క ‘ ఆదేశం రావటం కద్దు. ‘పోవున్ను పోకున్ను ఆయ ఆన ఇది క్రియా పదాలలోనె అత్లె చకారానికి
కకారాదేశం రావడమూ కద్దు.
మళయాళంలో త కు ఉచ్చారణలో ల వాడుతారు. ఉత్ప్రేక్ష కు ‘ఉల్ప్రేక్ష ‘ బలవత్ కు బలవల్ !!
For every ten years, the Nambudris perform MURAJAPA (మురజప) at the temple for 41 days and on 42nd day, they perform the
worship of LAKSHADIPA ( లక్షదీప)
కేరళ స్త్రీలు మాయూర పింఛ కచలు. వారి కేశాలంకార వైవిధ్య సౌందర్యాలు వర్ణనకతీతాలు. త్రిశూలం లో స్త్రీలు
మహాసౌందర్యవతులట!! కేరళమున కది యాణి ముత్తెము.
ఒక ఎం ఏ చదివినవాడన్నాడు. ‘భాసునికేమీ రాదు..’
‘ఊంబర్ద్దు ‘
‘కేరళమున స్త్రీలకుపరిసురతమే!! వారికి చుంబనమొక విద్య!!’
‘కైబర్ కు ముందే ఆర్యులిటకు వచ్చిరి..’
‘అరబ్బీ, మళయాళం, మణిప్రవాళమూ‘
‘నేటి చర్చలు – శ్రీభండారం ‘ ‘పులి ‘
‘ప్రాంత్య ‘ ‘ప్రాంత అర్థ విచారము
‘నాయ్ ..నాలుక..’ చర్చ
‘నేడు రాజు పుట్టినరోజు. గుడికి వెళ్ళాను . లక్ష దీపార్చన, ఒక్కొక్క స్థంభనికి అరటి గెల!! వేయి స్థంభలు!! వరాహ క్షేత్రం
చూచినాను. అహోబిల మఠం, హనుమ కోవెల, అమ్మ గుడి, సివాలయం,చూచినను. పద్మనాభుని గుడిలో వంట పాత్రలు
బ్రహ్మాండాలు. నేటికీ బ్రాహ్మణ సంతర్పణ జరుగును. కులశేఖర మండపంలో చక్కని శిల్పమున్నది. ‘
‘రాయల తల్లి నాయరట!!’ ఎడిటర్
నేటి చర్చలు ‘అళియ, ఆర్య, పల్లీ, హళ్ళీ, వరు+తున్=వరున్ను ‘
‘ప్రాకృతాలు చదువుతున్నాను..”
”పద్మనాభ తీర్థం లో స్నానం, వరాహస్వామి ప్రథమ గురువార దర్శనం. సాయంకాలం మీటింగు, ఎడిటర్ వచ్చాడు.’
”తమిళ మళయాళీలకు బ్రహ్మ ద్వేషం, కన్నులుండి యీ ఊళ్ళో బదుకడం, కష్టం.’
‘నేటి చర్చలు ..వలం, బలం, ద్వారం, తురుతు, భాష, పేశి!!’
నేటి చర్చలు.’నారింజ, కొళ్ళా, అక్ని, భక్న..’
‘ఇక్కడ పొన్నకాయల నూనె – దీపాలకు..’ (??)
‘నేడు వాక్ కి వెళ్ళాను. త్రోవలో పెద్ద పాము – మన జెర్రిపోతు వలె ఉంది!! అది మనిషి శరీరానికి చుట్టుకొని, చెవిలో
ఊదుతుందట! వాడు చస్తాడు. అది శరీరానికి చుట్టుకుంటే, ఇక బైటికి రావటం, అసాధ్యం. దానిని ‘చేరై ‘ అంటారు.’
I met Bukhaari, Reader in Arabic Literature. He is very good man. We discussed on the history of Daccan.’
‘వారితో వాదించవద్దు. వారికేమీ తెలియదు. ‘ ఎడిటర్
‘నేను కంబర్ పద్యం చెప్పడము, కృష్ణయ్యంగార్ కు పెద్ద దెబ్బ. (అక్కు + ఉళ్) కన్నడ- అక్కి = టు డైజెస్ట్ ! కానీ అక్కు వుంది.
తె. అక్కు. మ. యెందుకుండరాదు?? ‘ఇక్కుళ్ ‘ అనే అర్థంలో ‘ఇక్కు ‘ ఉంది. ‘అక్కు ‘ వుండును. అక్కు కక్ష శబ్ద భవము.
ఎడిటర్ సమ్మతించాడు.అందరూ నాపైకి వచ్చారు. చేతనైతే, బుద్ధితో జయించాలి. అంతే!!’
One first class M.A came to me. Doing research on ‘The evolution of Malayalam literature ‘ శుద్ధ మొద్దు!! వాడు – కుందాణ; ‘క– డి *
లేదు. ‘కుందూ – ఉంది. బంగారు, కుందనము, గుద్దలి, కుద్దలి..!!
‘ఎక్కడా కార్తీక దీపాలే!! ఊరెంతో బాగుంది..’
‘మళయాళం రిసర్చర్ వచ్చాడు. ‘అవరు ‘ అవరే‘ వారు ‘ గురించి చర్చ ..’
‘నేటి చర్చల్లో, ‘కర్ణాటక ,కందనప్రోలు, కర్నూలు..
‘ Louis Reno (Paris) సంస్కృత ప్రొఫెసర్ వచ్చాడు. అయనతో చర్చలు..’
ఎళుత్తచ్చన్, భాగవతం, కిళిప్పాట్టై..’
మళయాళం రిసర్చర్ వచ్చాడు. ‘అవరు ‘ అవరే‘ వారు ‘ గురించి చర్చ ..’
‘వీరికి హిందీ పై దుంపదెగులు..తమిళులకంతా అంతే!!’
నేడు పర్సు పోయింది. డబ్బుకు చాలా అవస్థ పడ్డాను. ఇక మీదట నేను పక్క జేబీలలో డబ్బు పెట్టుకోకూడదు.’
ఒక శబ్దం పై యీ రోజు చర్చ!! (పీడన్ మార్??) పదాన్ని కనుగొన్నందుకు అందరికీ ఎంత సంతోషమో!! ఆంధ్రులకు బుద్ధి
ఏదీ?? ఎన్నో పదాలు పోగొట్టుకుంటున్నారు.’
నేడు ఉన్నితన్ కృష్ణ్ నాయర్ నాపై రగడకు వచ్చినాడు.దీనికి కారణం నారాయణన్నాయర్. రత్న సామి గోడమీది పిల్లి.
కృష్ణన్ నాయర్ మనిషే కాడు. ఒక స్థిర భావం లేనివాడు. ‘
నేడు సంస్కృత కాలేజీకి వెళ్ళినాను. ‘మీరీ యునివర్సిటీకి రావడం మా అదృష్టం ‘ అన్నాడు. అందరు ఉపాధ్యాయులూ
సంతోషించినారు.’
ఈ రోజు ముసిరి కచ్చేరీ. తోడి సుందరం అయ్యర్ ఫిడేలు.
నేడు కుమారస్వామి పాట కచ్చేరీ. తోడి పల్లవి బాగుండింది కానీ అక్షరాలన్నీ మింగివేసినాడు.’
****
ఇక్కడున్నప్పుడు పుట్టపర్తి కింది ఉద్యోగుల్లో చాలామంది పట్టభద్రులే!! కానీ అందరికీ పుట్టపర్తే అధికారి. ఏదైనా పదం గురించి
చర్చ వస్తే, దాని మూలాలు ఎక్కడివీ..అన్నప్పటినుంచీ మొదలు పెట్టేవారట పుట్టపర్తి!! అది వాళ్ళకు నచ్చేదికాదట!! పైగా
ఎక్కడో తెలుగు ప్రాంతాలనుంచీ వచ్చిన వాడు, మాపై పెత్తనం చలాయించటమేంటి?? అని వాళ్ళ బాధ!! అప్పటికే ప్రాకృత
భాషలూ, సంస్కృతమూ పైనున్న పట్టుతో మళయాళం నేర్వటం కష్టమేమీ కాలేదు పుట్టపర్తికి!! అరవిందో ఆశ్రమానికి వెళ్ళిన
అనుభవంతో గ్రీక్, లాటిన్, కాస్త ఫ్రెంచ్ కూడా వచ్చిన పుట్టపర్తిని నిరోధించగలిగే సత్తా ఎవరికీ లేదు.
ఇన్ని కారణాలవల్ల అక్కడి వాళ్ళు పుట్టపర్తిని ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఇబ్బందిపెట్టాలనే చూసేవారట!!