షర్మిలాం “తరంగం”

-షర్మిల కోనేరు 

సంసారం సంగీతం ఆన్నాడొకాయన ...సంసారం సాగరం అంటుందిఒకావిడ .

సంసారం నిస్సారం అని కొందరి నిర్వచనం.

భార్యాభర్తల బంధం ఎప్పుడూ పాత సినిమాల్లో చూపించినట్టుండదు.

తెల్లారేటప్పటికి తలస్నానం చేసి జారు ముడేసుకుని కాఫీ కప్పు చేత్తోపట్టుకుని బెడ్రూంలో పవళించిన భర్తగారిని గోముగా లేపుతుందిహీరోయిన్.

అప్పుడు భర్త ఆమె మొహంలోకి తదేకంగా చూస్తూ “జ్యోతీ ! నేనెంతఅదృష్టవంతుడ్ని ” అంటూ కాఫీ కప్పుతో పాటు ఆమె చేయిఅందుకుంటాడు.

పాపం ఆ పాత సినిమాల ప్రభావం ఇప్పటికీ చాలా మందికి వదల్లేదు.

ఇంకా పెళ్ళాలు ఎదురెదురుగా కాఫీ కప్పులు అందిస్తూ , షూ లేసులుముడేస్తూ ఆనక ఏం ఉద్యోగమైనా చేసుకోవచ్చుగా అని ఆశగా ఎదురుచూస్తూ వుంటారు .

అలా వాస్తవంలో చచ్చినా జరగదు ఎవరి కాఫీ వాళ్ళు చేసుకుని ఆఫీసురూముల్లోకి పరిగెత్తాల్సిందే !

అబ్బాయిలనే కాదు అమ్మాయిల ఆలోచనలు ఇలాగే వుంటాయి.

“లవ్ యూ హనీ !”అని మాటి మాటికీ భర్త చెప్పాలని .. తననేఅంటిపెట్టుకుని తిరగాలని ఆశపడుతుంది.

మగాడు మొగుడయ్యాక “లవ్ యూ !” అని ఆమె కి చెప్పడం పెద్దనామోషీ అనుకుంటాడు.

ఏ చీరో , డ్రెస్సో వేసుకుని  బయటకి వెళ్తే బయట వాళ్ళయినా బాగుందనికాంప్లిమెంట్  ఇస్తారేమో గానీ మొగుడు మాత్రం చచ్చినా మెచ్చుకోడు.

ఇవన్నీ చిన్న విషయాలు. అన్నీ మనం ఊహించుకున్నట్టు జరగవు.

ఊహలకు రెక్కలుంటాయి. అందుకే వాస్తవం కటువుగా కనిపిస్తుంది.

మన ఎక్స్పెక్టేషన్ (expectetion) కు తగ్గట్టు ఎదుటి వారువుండాలనుకోవడం అత్యాశ!

సరిపెట్టుకునే మనస్తత్వాలు తగ్గిపోతున్న కొద్దీ సంసారం నిస్సారంగా నేమిగిలి పోతుంది.

తరాలు మారుతున్న కొద్దీ జీవన విధానాలు మారుతూ వుంటాయి .

మా తాత భోజనం చేస్తుంటే నాన్నమ్మ విసిరేది.

నా టైం లో టేబుల్ మీద అన్నీ వేడిగా పెట్టి , ప్లేట్ పెట్టాను  తినండి ! అనిచెప్పేదాన్ని.

ఇప్పుడు  ఇటూ అటూ కాని తరం  భార్య వంట చేసి పెడితే ప్లేట్ వాళ్ళేతెచ్చుకుని వాళ్ళే వేడి చేసుకుని తింటున్నారు.

ఎవరి ప్లేట్ వారు తీసుకునే వరకూ మార్పు వస్తోంది.

ఏ దేశం వెళ్ళినా వండి అమర్చే బాధ్యత నుంచి  భారతీయ మహిళకివిముక్తి దొరకదు.

కానీ మార్పు అనివార్యం.

రాబోయే తరం మారుతుంది. ఇద్దరూ సమానంగా ఇంటి పని వంటపనిచేసుకుంటారు.

అప్పుడప్పుడూ  ఏ ఇగోలూ లేకుండా లవ్ యూ లు చెప్పుకుంటారు.

నచ్చకపోతే ఇది నచ్చలేదనీ చెప్పుకునే స్వేచ్చతో బతుకుతారు.

ఇది నా ఎక్స్పెటేషన్ … ఇది నా ఊహ !

ఏంటో నేను అనుకున్నవన్నీ అలా జరిగిపోతుంటాయంతే !!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.